బీరు సీసాల లారీ ఇలా కాలింది (వీడియో)

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. రోడ్డుపై వెళ్తుండగా సాంకేతిక లోపంతో లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలకు బీరు సీసాలు పేలిపోయాయి.
మద్యం బాటిళ్లు పగలడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా సీసాలు పేలడంతో భయాందోళనతో స్థానికులు పరుగులు తీశారు దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవ‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *