షర్మిల తెలంగాణ పార్టీ సక్సెస్ చాన్సెంత? చాలా ఎక్కువ!

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీ విజయవంతమవుతుందా? తలలు తెరిసిన ‘మగధీరులు’ ఉన్న తెలంగాణలో ఒక మహిళ కొత్త రాజకీయ పార్టీ పెడితే విజయవంతమవుతుందా? అనేవి రెండు ఆసక్తికరమయిన ప్రశ్నలు.

ఎందుకంటే,రాజకీయాల్లో చాలా మంది మహిళలు  విజయవంతమయినా,  భారతదేశంలో ఒక మహిళ కొత్తగా పార్టీ పెట్టడమేనది ఇంతవరకు జరగలేదు.  చాలా మంది మహిళా నేతలంతా ఏదో ఒక పార్టీలో పైకి వచ్చిన వారే.తర్వాత విడిపోయి సొంత పార్టీ పెట్టుకుని ఉండవచ్చు. ఏకంగా కొత్తగా పార్టీ పెట్టిన మహిళలు లేరనే చెప్పాలి.

ఇందిరాగాంధీ కాంగ్రెస్ లో ఉంటూ పైకొచ్చారు.  మాయావతి కాన్సీరామ్ పెట్టిన పార్టీలో పైకొచ్చారు. జయలలిత ఎంజి రామచంద్రన్ ప్రోత్సాహంతో పైకొచ్చారు. బీహార్  రబ్డీ దేవి భర్త పార్టీలో సిఎం అయ్యారు.బెంగాల్ లోమమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి చీలిపోయి కొత్త పార్టీ పెట్టారు. వీళ్లంతా విజయవంతమైన నేతలే.

అయితే,  కొత్తగా ఒక పార్టీ ఏర్పాటు చేసిన మహిళలు లేరు. మనుగడలో ఉన్న పార్టీలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపిలు, కేంద్ర-రాష్ట్రమంత్రులు, గవర్నర్లు అయిన మహిళలున్నారు తప్ప ఎవరూ స్వతహాాగా పార్టీ పెట్టే సాహసం చేయలేదు.

ఎవరైనా  సబ్ రీజినల్ స్థాయిలో పార్టీలు పెట్టిఉంటే వుండవచ్చేమే. కాని ఆ పార్టీలు బతికినట్లు దాఖలాలేదు.

అందువల్ల షర్మిల పార్టీ ఒక  భారత  రాజకీయాల్లో ఒక ఒక కొత్త మలుపు. చాలా జాగ్రత్త కన్నేసి ఉంచాల్సిన కొత్త పరిణామం.

ఈ కారణంతోనే తెలంగాణలో ఆమె పార్టీ విజయవంతమవుతుందా  అనే చర్చ  రాజకీయ పరిశీలకుల్లోనే కాదు, అకడమిక్ వర్గాల్లో కూడా నడుస్తూ ఉంది. ఒక వర్గం వాదన ప్రకారం, షర్మిల పార్టీ తెలంగాణలో విజయవంతమయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి.

 


షర్మిల గత నెలరోజులుగా షర్మిల నడుస్తున్న తీరుచూస్తే  రూలింగ్ పార్టీని, ఇతర పార్టీలని చీటికి మాటికి చీల్చి చెండాడి చప్పట్లు కొట్టించుకునే క్షణికావేశానికి లోనుకాకుండా జాగ్రత్తగా అడుగేస్తున్నట్లు అర్థమవుతుంది. అంటే ప్రజారాజ్యం, జనసేన చేస్తున్న తప్పులను ఆమె చేయడంలేదు.


తెలంగాణాలో 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో చాలా రాజకీయమార్పు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేక వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది. ఇదే విధంగా 2001 నాటి పరిస్థితిని కొంచెం గమనిస్తే, తెలంగాణాలో దళిత ఉద్యమం (మాదిగ దండోరా, ఎంఆర్ పిఎస్ ) బాగా బలంగా ఉండింది. ఇది ఈ వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది. ఇలాగే  బిసిలలో క్రిష్ణయ్య బిసి హక్కుల కోసం నడిపిన ఉద్యమం, మండల్ ఉద్యమం బాగా చైతన్యం తీసుకువచ్చింది.

ఈ వర్గాలనుంచి చైతన్యమయిన వాళ్లంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు భాగాన నిలబడి  టిఆర్ ఎస్ నాయకత్వంలో కొందరు, జెఎసిల పేరతో మరికొందరు పోరాడారు. వీళ్లలో చాలా మంది తెలంగాణ వస్తే తమకు రాజకీయావకాశాలొస్తాయని భ్రాంతి చెందారు.

2014లో తెలంగాణ వచ్చింది, టిఆర్ ఎస్ పవర్ లోకి వచ్చింది. దీనితో  తెలంగాణలో మరొక రాజకీయ ఉద్యమం అనేది లేకుండా మాయమైపోయాయి. ఎంఆర్ పిఎస్ ఏమైందో తెలియదు. ఆర్ క్రిష్టయ్య బిసి ఉద్యమం ఎక్కడా కనిపించడం లేదు.  క్రిష్ణయ్య ఎమ్మెల్యే అయిపోయి, చాలా మంది బిసినేతల్లో ఎమ్మెల్యే కావాలనే కోరిక రగిలించారు. సోషల్ జస్టిస్ నినాదంమీద తెలంగాణలో ప్రవేశించేందుకు బిఎస్ పి,సమాజ్ వాది పార్టీలు ప్రయత్నించాయి. ఏవీ సక్సెస్ కాలేదు. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. బిజెపి ఇంకా బలపడలేదు. టిఆర్ ఎస్ పార్టీ వల్ల ఉద్యమం నుంచి వచ్చిన కొందరికి రాజకీయావకాశం దొరికింది, మంత్రులయ్యారు. వీరి సంఖ్య బాగా తక్కువ. ఇది  2014నాటిపరిస్థితి.

ఈ మధ్య కాలంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ విజృంభించి బాగా డబ్బు సంపాదించిన వాళ్లు, ఇతర వ్యాపారాలలో పైకొచ్చిన వాళ్లు, అర్బనేషన్ వల్ల పండని భూములు కూడా కోట్ల విలువచేసి కోటీశ్వరులయిన వాళ్లు, అమెరికా వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్లు అంటే  ఎలీట్ క్లాస్ అనేది  బిసి, ఎస్ సి, ఒసిలలో బలంగా తయారైంది.

21 వ శతాబ్దంలో డబ్బు రాగానే పొలిటికల్ పవర్ కోసం చూడటం యువకుల లక్షణం. ఇలా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారి (Aspirational middle class) సంఖ్య తెలంగాణలో బాగా పెరిగింది.

రాజకీయాల్లో హోదా, డబ్బు,సాంఘిక రక్షణ అన్నీ వున్నాయి కాబట్టి  అన్నివిధాల ఎంపవర్ (Empower) కావడానికి రాజకీయాల్లోకి రావడమే మార్గం అని వీళ్లు గుర్తించారు.

వీళ్లంతా ఎంతఖర్చయినా సరే భరించి  ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి అర్హతగా కులసమీకరణలు కూడా మొదలుపెట్టి తమకు కులము అండఉంది, డబ్బు ఊందని, టికెట్ ఇవ్వండని అడుగుతున్నారు.

వీళ్లకి టిఆర్ ఎస్ లో స్థానం దొరకలేదు. దొరకదు కూడా. ఎందుకంటే, ఈవర్గాలకే చెందిన అంతకు ముందటి తరం ఈ పార్టీలో చేరిపోయింది. వారికితోడు కాంగ్రెస్, టిడిపిల నుంచి వలసపోయి వాళ్లు  టిఆర్ ఎస్ లో ఉన్న జాగానంతా అక్రమించుకున్నారు.

వాళ్లంతా ఇపుడు తమ కొడుకులను, కూతుళ్లను, కోడళ్లను,అల్లుళ్లను వారసులగా తయారుచేస్తున్నారు తప్ప కొత్త వారికి అవకాశమీయడం లేదు.

అందువల్ల పొలిటికల్ గా ఎంపవర్ కాలవాలనుకున్న ఈ నూతన వర్గం అవకాశం కోసం చూస్తూ ఉంది. వీళ్ల కి సిద్ధాంతంతో పనిలేదు. ఆర్థికంగా పైకొచ్చాము కాబట్టి ఇక మిగిలింది రాజకీయంగా ఎంపవర్ కావాలనేదే లక్ష్యం. ఎవరూ పార్టీ పెట్టినా వారితో పోయేందుకు వీరుసిద్ధం. ఇలాంటి మార్పు ఇండియా మొత్తం వచ్చింది. తెలంగాణలో కూడా.  ఈ మార్పు ఎలాంటిదో, ఈ నూతన మధ్యతరగతి తరం ఎలాంటిదో హర్దయాల్ సింగ్ (Hardaya Singh)ఫైనాన్పియల్ ఎక్స్ ప్రెస్ లో మంచి వ్యాసం రాశారు.

Decades of economic growth have had two major outcomes: One, every minute, according to a Brookings study, 44 Indians escape the trap of extreme poverty, estimated by the World Bank at $1.9 per person per day. Such poverty, currently at 5%, may decline to 3% by 2022 and be eliminated altogether by 2030.
Two, equally importantly, the country has also witnessed unprecedented social mobility which has enabled millions to climb onto the bandwagon of the burgeoning middle class. With an annual per capita GDP of nearly $2,000, India is now increasingly becoming a low-middle income rather than a poor country.

బిజెపి బలపడితే, హిందూత్వ పార్టీయా, సెక్యులర్ పార్టీయా అనే దానితో నిమిత్తం లేకుండా ఈ కొత్త మిడిల్ క్లాస్ యువకులు ఆపార్టీ లో చేరిపోయేందుకు సిద్ధపడుతారు.ఈ మధ్యకాలంలో తెలంగాణా బిజెపి అనుబంధ సంస్థలన్నీ బలపడేందుకు కారణం వీళ్లు చేరడమే.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో బిజెపి గెలవగానే ‘బిజెపి పవర్ లోకి వస్తాంది… వస్తాంది’ అనే సుడిగాలి రావడానికి కారణం ఈ వర్గంమే. వాళ్లకి టిఆర్ ఎస్ కు బిజెపి లో ప్రత్యామ్నాయం కనిపించింది.

వాళ్లు పెద్ద ఎత్తున బిజెపి వైపు చూస్తూన్నారు. భారీగా చందాలిస్తున్నారు.

వాళ్లు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం లేదు. కాంగ్రెస్ ఇంకా పాత పార్టీయే (Grand Old Party : GOP), అక్కడ  కొత్తవాళ్లకు,యువకులకు, ప్రవేశంలేదు. ఏదేని ఒకటి రెండు నియోజకవర్గాలో అవకాశం ఉన్నా పార్టీ గెలుస్తుంది అనే  ధీమా వారిలో ఈ నాయకత్వం ఈయడం లేదు. బిజెపి ఇలాంటి ధీమాని ఇస్తున్నా,   బిజెపి రాజకీయాలు ఇబ్బందికరమయినవి. అవి ఉద్రేక మత రాజకీయాలు. సాంఘిక సెక్యులర్ భావాలకు  అక్కడ చోటు లేదు.ఈ దారిలో నడిచే వారికి బిజెపిలో అవకాశం ఉండదు. ఇది ఒక సెక్యులర్ పార్టీలోనే సాధ్యం.

విశ్వాసాల రీత్యా క్రిష్టియన్, కులరీత్యా రెడ్డి అయినా షర్మిల పార్టీ తప్పని సరిగా సెక్యులర్ పార్టీ అవుతుంది.

ఆ పార్టీ నాయకత్వం ఎవరిచేతిలో ఉన్నా అన్నికులాలకు, మతాలకు కొంతవరకైనా తలుపులు తెరిచే ఉంటాయి. కొత్త పార్టీ కాబట్టి యాస్పిరేషనల్ మిడిల్ క్లాస్ సభ్యులకు అవకాశాలెక్కువగా ఉంటాయి.

ఇపుడు మరొక కోణం చూద్దాం. షర్మిల మహిళ అనో ఆమెకు పార్లమెంటరీ అనుభవం లేదు అనో, చిన్న పిల్ల అనో  ఆమె పార్టీలో చేరేందుకు రాజకీయ వృద్ధులు, సీనియర్లు జంకుతారు. ఇక టిఆర్ ఎస్ పవర్ లో ఉంది కాబట్టి, ఆ పార్టీని వీడి షర్మిల పార్టీలో వాళ్లు తక్కువగా ఉంటారు. రాజకీయ సీనియర్ సిటిజన్లకు, ఫిరాయింపు దార్లకు  ఇందులో ప్రవేశం తక్కువగా ఉంటుంది.

ఇలాంటి పార్టీకి వాళ్ల బెడద ఉండదు. ఉన్నా పరిమితంగానే ఉంటుంది. వాళ్లని ఎక్కువ సంఖ్యలో  చేర్చుకున్నా పార్టీని ఆమె నడిపించలేరు. అందువల్ల అన్నికులాలకు చెందిన నూతన తరానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ.

అంటే ఒక్క మాటలో చెబితే ,తెలంగాణలో ఆర్థికంగా బలపడిన బిసి, ఎస్ సి, ఎస్ టి, ఒసికులాలోని కొత్త తరానికి షర్మిల పార్టీ భారీగా రాజకీయావకాశం కల్పిస్తుంది.

టిఆర్ ఎస్, కాంగ్రెస్ లలో అవకాశాలు దొరకని వాళ్లు, బిజెపి కంటే షర్మిల పార్టీ వైపే ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. షర్మిల ఆంధ్రానా, తెలంగాణనే అనే చర్చ వాళ్లకి అవసరం లేదు.

జాతీయ స్థాయిలో 2014లో  యుపిఎ, కాంగ్రెస్ విఫలమయినపుడు కొత్త నినాదాలతో మోదీ  ఈ యాస్సిరేషనల్ మిడిల్ క్లాస్  మనసుదోచుకునే అధికారంలోకి వచ్చారు.

గత నెలరోజులుగా షర్మిల నడుస్తున్న తీరుచూస్తే  రూలింగ్ పార్టీని, ఇతర పార్టీలని చీటికి మాటికి చీల్చి చెండాడి, సినిమాహీర్ స్టయిల్లో చప్పట్లు కొట్టించుకునే క్షణికావేశానికి లోనుకాకుండా జాగ్రత్తగా అడుగేస్తున్నట్లు అర్థమవుతుంది. అంటే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు చేస్తున్న తప్పులను ఆమె చేయడం లేదు. ఎన్నికల్లో నెగ్గేందుకు అత్యావేశం ఒక్కొక్క సారి అడ్డంకి అవుతుంది. షర్మిల సింపుల్ ప్రశ్నలతో ఇరుకునపెడుతున్నారు. ఆవేశం కంటే ఔచిత్యం చాలా పదునైనది.

 


2014 తర్వాత తెలంగాణలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఒక కొత్త వర్గం బాగా బలపడింది. వాళ్లకి రాజకీయవకాశాలు కావాలి. ఇక ముందు తెలంగాణలో  పొలిటికల్ ఎంపవర్ మెంట్ నినాదమే తప్ప సెంటిమెంట్లు పనిచేయవు.

అందువల్ల జాగ్రత్తగా ఆడుగేస్తే భారతదేశంలో తొలిసారి ఒక మహిళ పెడుతున్న పార్టీ తెలంగాణలో విజయవంతమయ్య అవకాశాలున్నాయి.

ఆపార్టీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది ఇపుడు చర్చనీయాంశం కాదు. ఏదో ఒక పార్టీలో చేరి పొలిటికల్ పవర్ లో భాగం కావాలనుకునే తరం షర్మిల తో కలుస్తుంది.   ఈ వర్గాలను ఆకట్టుకుంటే  చాలు, షర్మిల వేవ్ తెలంగాణలో బలంగా వీస్తుంది.

 

,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *