శేషాచలం అడవుల్లో ఒక రాత్రి…

(భూమన్)
ఆంధ్ర ప్రదేశ్  తిరుపతి నుంచి కడప జిల్లా వరకు విస్తరించిన  శేషాచలం అడవుల్లో సుదూరాన మూడురాత్రులిలా టెంట్ లో గడిపే అరుదైన అవకాశం వచ్చింది.
టెంట్ పక్కన రచయిత భూమన్
గత మూడు రాత్రులిలా అడవుల్లోనే గడిపాను. అందుకే ఎవరికీ ఫోన్ లో అందుబాటులో లేను. ఇది సరదా యాత్రనే కాదు, సాహస యాత్ర కూడా.

తిరుపతి ట్రెకర్స్ క్లబ్ కు చెందిన కొంతమంది మిత్రులతో కలసి అడవుల్లోకి వెళ్లాం. నిజానికి మేం వెళ్లాలనుకున్ని గుంజన జలపాతం  చూసేందుకు. ఆ వివరాలు రేపు.

ఇది ఒక రోజు రాత్రి బస చేసిన చోట. చలి తీవ్రంగా ఉంది. అయినా అడవిలో ఇలా గడపడం అనేది అద్భుతమయిన అనుభవం.

ఈ ప్రాంతం తిరుపతికి సుమారు 40 కి. మీ దూరాన ఉంటుంది. ఇది శేషాచలం అడవే అయినా కడప జిల్లా అటవీ ప్రాంతం. ఇక్కడి రావాలంటే అటవీ శాఖ అనుమతి అవసవరం.  దీని బాలపల్లె అటవీ ప్రాంతం అంటారు.

 

తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా కడపవైపు దారిపట్టాలి. అలా కోడూరు దాకా వచ్చాక కుక్కల దొడ్డి సమీపాన ఉన్న బాలపల్లి ఫారెస్టు బంగ్లా వైపు రావాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ గంజన జలపాతం వెళ్ళవచ్చు.  గంజన జలపాతం విశేషాలు త్వరలో…

అక్కడ అడవిలో  రాత్రి మంచు దట్టంగా ఉంది. ఆకాశం చుక్కల నుంచి వస్తున్న గుడ్డి వెలుతురు. చుట్టూర రకరకాల పక్షల, జంతువుల అరుపులు, అర్థంకాని  శబ్దాలు. మధ్య మధ్యన గాలి వీచ్చే సవ్వడి. నిశబ్దమో, కలకలమో, చీకటో, వెలుతురో తెలియని చిత్రమయిన పర్యావరణం. కొంచెం భయం గొలిపే వాతావరణం, కొంచెం సాహసం చేస్తున్నామన్న పులకరింత. ఎపుడో అర్థరాత్రికి అడవి మాకు మచ్చికయింది. మరచిపోలేని అనుభూతి.

(ఈ పోస్టు మీకు నచ్చితే , మీ మిత్రులకు షేర్ చేయండి)

 

 

(భూమన్, వయసు 75 సం. రచయిత, తిరుపతి,ఫోన్ నెంబర్ 9010744999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *