`ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య` టీజ‌ర్ విడుద‌ల‌. ఏప్రిల్ 17న రిలీజ్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`.ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్  హీరోగా న‌టిస్తున్నారు.
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 17న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు.  మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం చిత్ర బృందం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. వి.కె.న‌రేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు.
ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ..
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ వెంక‌ట్ మ‌హా మ‌న నెటివిటీకి త‌గిన‌ట్టు మంచి ఎమోష‌న్స్‌తో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాను అద్భుతంగా మ‌లిచారు. అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌, సుహాస్, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, టీఎన్ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌టేశ్ మ‌హా
నిర్మాత‌లు:  విజ‌య్ ప్ర‌వీణ ప‌రుచూరి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వసంత్ జుర్రు
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌జ్ఞ‌య్ కొనిగ‌రి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  రాము.ఆర్‌.కె
సినిమాటోగ్ర‌ఫీ: అప్పు ప్ర‌భాక‌ర్‌
సంగీతం:  బిజిబ‌ల్‌
ఎడిట‌ర్‌:  ర‌వితేజ గిరిజాల‌
క‌థ‌: శ‌్యామ్ పుష్క‌ర‌న్‌
కాస్ట్యూమ్స్‌:  అమృత బొమ్మి
సౌండ్ డిజైన‌ర్‌:  నాగార్జున త‌ల‌ప‌ల్లి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సుశాంత్ సావంత్‌