‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ విడుదల చేసిన రామ్ చరణ్

– విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల దంపతులు నిర్మించిన ఈ సిరీస్ డిసెంబర్ 25న ‘జీ 5’ ఓటీటీలో విడుదల
తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’. డిసెంబర్ 25న ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ను తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ‘జీ 5’ కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ దీనిని నిర్మించిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సిరీస్ షోరీల్ విడుదల చేశారు.
‘లూజర్’ నుండి ‘చదరంగం’, ‘గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)’ వరకు… ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ… కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా – డిఫరెంట్ జానర్ కంటెంట్ ‘జీ 5’ ప్లాట్‌ఫామ్ వీక్షకులకు అందించింది. ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’తో మరోసారి వీక్షకుల మనసు గెలుచుకునేలా ఉంది.
‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పి… తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’. ‘జీ 5’ అసోసియేష‌న్‌తో దీనిని నిర్మించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, తేజా కాకుమాను తదితరులు ప్రధాన పాత్రధారులు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని ‘జీ 5’ వర్గాలు వెల్లడించాయి.
షోరీల్ విడుదల కార్యక్రమంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ “జీ 5 ఓటీటీకి హెడ్ గా మాత్రమే కాకుండా… మా అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటార్ గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ‘ఓయ్’ నేను చూశా. జిమ్ కి వెళుతూ ఎన్నో నెలలు ఆ సినిమాలో పాటలు కారులో వింటూ ఉండేవాడిని. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఆనంద్ రంగా సినిమాలు మిస్ అవుతున్నాను. మా అక్క, బావ (సుష్మిత – విష్ణుప్రసాద్)తో అసోసియేట్ అయి ఓటీటీ వేదిక కోసం ఆయన సిరీస్ చేయడం… కమ్ బ్యాక్ లో అక్కాబావకి సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంది ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ ఫెంటాస్టిక్ గా ఉంది. చాలా రియల్ గా కూడా ఉంది. నటన విషయంలో, రియలిస్టిక్ లుక్ విషయంలో… నటీనటులు అందరూ బెస్ట్ ఇచ్చారు. మనమంతా ఏదైతే కోరుకుంటున్నామో అటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్లాస్టిక్ ఎరా ఆఫ్ ఫిలింమేకింగ్ అయిపొయింది. తేజ, నందినిరాయ్ కాంబో అదిరిపోయింది. కరోనా మహమ్మారి కాలంలో ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ టీమ్ అంతా బయటకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్. మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఎప్పటికీ మరువలేం. ఈ ఏడాది నుండి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడింది. ఎలా మొదలైందని అనేది కాదు… ఏడాది ఎలా ముగిసిందనేది చాలా అంటే చాలా ముఖ్యం. ‘జీ 5’ మద్దతుతో డిసెంబర్ 25న విడుదలవుతున్న ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’తో మంచి ఎండింగ్ ఇస్తామని ఆశిస్తున్నా. ఈ ఏడాదిని మనం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. గొప్ప ఓటీటీ వేదికలు, గొప్ప సినిమాలు రావాలని ఆశిస్తున్నా” అని అన్నారు.
సుష్మితా కొణిదెల గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ “నాన్నగారు 79లో ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబం ఎన్నో ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మేమంతా కష్టపడుతున్నామని గర్వంగా చెప్పగలను. ఇటువంటి కొత్త (ఓటీటీ) విభాగంలో సుష్మిత ఫైటర్ అని చెప్పవచ్చు. ‘రంగస్థలం’కి అక్క స్టయిలిస్ట్ గా పని చేసింది. నా ఫస్ట్ ప్రొడక్షన్ ‘ఖైదీ నంబర్ 150’కి కూడా పని చేసింది, బయటవాళ్ళు అయితే తిట్టించుకుని పని చేయించుకుంటాం. ఇంట్లోవాళ్లను తిట్టలేం. నాన్నగారు నన్ను తిట్టేవారు. పర్లేదు. నేను ఎవరినైనా కసురుకోవాలన్నా, ఏమైనా కోపం చూపించాలన్నా హానీ అక్క (సుష్మిత) మీద చూపించేవాడిని. నా బిగ్గెస్ట్ సపోర్ట్ తనే. ఈ సిరీస్ తో తను తప్పకుండా సక్సెస్ అందుకుంటుంది” అని అన్నారు.
క్రియేటివ్ హెడ్ – ‘జీ 5’ సౌత్ ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ “గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణసంస్థను లాంచ్ చేయడానికి ఇండియాలో లీడింగ్ ఓటీటీ వేదిక అయిన మా ‘జీ 5’ను ఎంపిక చేసుకున్నందుకు విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల దంపతులకు థాంక్స్. హిందీ సహా ప్రాంతీయ భాషల్లో ‘జీ 5’ క్వాలిటీతో కూడిన మంచి కంటెంట్ వీక్షకులకు అందిస్తోంది. కరోనా కాలంలో 500 గంటల నిడివి కల షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించాలని సంకల్పించింది. అందులో 5 ఒరిజినల్ షోలు తెలుగువే. ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ విషయానికి వస్తే… ఇంటెన్స్ అండ్ యాక్షన్ సిరీస్ ఇది. వీక్షకులను ఆకట్టుకుంటుంది” అని అన్నారు.
ఆనంద్ రంగా మాట్లాడుతూ “థాంక్స్ చరణ్. థాంక్స్ అన్నయ్యా ఫర్ ఎవిరీథింగ్. థాంక్స్ టు సుష్మిత, విష్ణుప్రసాద్. కంటెంట్ వర్క్ అవుతుందని ఆశిస్తున్నా” అని అన్నారు.
విష్ణుప్రసాద్ మాట్లాడుతూ “ఫెంటాస్టిక్ సిరీస్ ఇది. ఓటీటీలో గేమ్ చేంజర్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రసాద్ నిమ్మకాయల గారి మద్దతు, మార్గదర్శకత్వం లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థాంక్యూ ఆనంద్. టీమ్ అంతా గ్రేట్ వర్క్ చేశారు” అని అన్నారు.
సుష్మితా కొణిదెల మాట్లాడుతూ “ఈ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ప్రాజెక్ట్ కి మాత్రమే కాదు… నా జీవితంలో ముఖ్యమైన సందర్భాలు, విషయాల్లో చరణ్ ఎప్పుడూ నాకు అండగా, నావైపు నిలబడి ఉన్నాడు. తన విషయంలో నేనెంతో గర్వంగా, సంతోషంగా ఉన్నాను. అవకాశాలు, అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలని అంటారు. అలా కాకుండా మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ… అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలని నాన్నగారు చెబుతుంటారు. అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి థాంక్స్. ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ సిరీస్ చేసే అవకాశం జీ 5 నుండి మా దగ్గరకు వచ్చింది. ప్రసాద్ గారు మాకు చాలా విషయాల్లో సపోర్ట్ గా ఉన్నారు. ఆయనకు థాంక్స్. ఆనంద్ మంచి డైరెక్టర్. సరదా మనిషి కూడా. ఆనంద్, అతని టీమ్ వలన ఈ ప్రాజెక్టు ఎంతో మెమరబుల్ అయింది.  ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మా మొదటి ప్రాజెక్ట్ లో ఉండటం ఎంతో ఎగ్జయింటింగ్ గా ఉంది. వాళ్లతో ఉంటే మా ఫ్యామిలీతో సెట్ లో ఉన్నట్టే ఉంది. తేజ, నందిని, రజాక్, గాయత్రీ, మోయిన్ అందరూ అద్భుతంగా నటించారు. అది కాకుండా కరోనా కాలంలోనూ బయటకు వచ్చి షూటింగ్ చేసి, మాకు సపోర్ట్ చేశారు. కరోనా కాలంలో సిరీస్ స్టార్ట్ చేసి, జీ5కి టైమ్ కి అందించగలిగామంటే కారణం మా టీమ్ చేసిన హార్డ్ వర్క్.” అని అన్నారు.
నందినీరెడ్డి మాట్లాడుతూ “ప్రసాద్ నిమ్మకాయల నాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం. ఆయన జీ 5లో జాయిన్ అయిన వేళా విశేషం అనుకుంట… అప్పటి నుండి హిట్స్ మీద హిట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రసాద్ గారికి కంగ్రాచ్యులేషన్స్. సుష్మితాగారిని ఏడాది క్రితం కలిశా. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పారు. సలహాలు ఇస్తారా? అని అడిగితే మూడు విషయాలు చెప్పా. అందులో మొదటిది… సింపుల్ గా ఉంచమని చెప్పా. అది మర్చిపోయారు. గ్రాండ్ గా తీశారు. మిగతా రెండు విషయాలు పాటించారు. బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ గ్రేట్ ప్లానింగ్ తో తీశారు. ఆనంద్ రంగా నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. బ్రిలియంట్ మేకర్. వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ రంగా 2.0. ఈ సిరీస్ తో ఫెంటాస్టిక్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక్కొక్క షాట్ చూస్తుంటే ఒక్కొక్క యాక్టర్ ఎంత బాగా నటించారో అర్థం అవుతోంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నటీనటులు నందినీరాయ్, తేజ, సందీప్ సాహు, మొయిన్, సినిమాటోగ్రాఫర్  అనిల్ బండారి, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్, ఎడిటర్ నారాయణ, పబ్లిసిటీ పోస్టర్ డిజైనర్లు అనిల్-భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.
‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’లో ఐజీ ప్రవీణ్ చంద్ పాత్రలో శ్రీకాంత్, ఎస్పీ సూర్యనారాయణగా ప్రకాష్ రాజ్, అక్తర్ పాత్రలో తేజా కాకుమాను, నఫీసాగా నందినీ రాయ్, నాసిర్ పాత్రలో సందీప్ సాహు, సెల్వ కుమారిగా గాయత్రీ గుప్తా, యు. రాకేష్ పాత్రలో మొయిన్ నటించారు.
ఈ సిరీస్ కి
నిర్మాతలు: శ్రీమతి సుష్మితా కొణిదెల, విష్ణుప్రసాద్
దర్శకుడు: ఆనంద్ రంగా
ఛాయాగ్రహణం: అనిల్ బండారి
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
మ్యూజిక్ డైరెక్టర్: నరేష్ కుమారన్
ఎడిటర్: నారాయణ
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్ – భాను
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్య పోట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *