నేను ఆ బ్రాండ్ స్విమ్ సూట్ తోనే ఈత కొట్టాను (వీడియో)

ప్రియాంక చోప్రా చెల్లెలుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది పరిణీతి చోప్రా. కానీ ఆమె నటనలో తనదైన ముద్ర వేసింది. తొలినాళ్లలో బొద్దుగుమ్మలా ఉండేది. కానీ రాను రాను వయసు పెరుగుతుంటే అందం కూడా పెంచింది పరిణీతి. ఇక బొద్దు గుమ్మ బిరుదు వదిలించుకుని చిక్కిన చక్కనమ్మ గా మారింది. ఇప్పుడు పరిణీతి చోప్రా ఇంత సన్నబడిందా అని ఫ్యాన్స్ కూడా పరేషాన్ అవుతున్నారు.

https://www.facebook.com/bollywoodnow/videos/10155662893701925/

తాజాగా పరిణీతి చోప్రా ఒక స్విమ్ సూట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. చోప్రా.స్పీడో అనే ప్రపంచ పాపులారిటీ సంపాదించిన బ్రాండ్ కు మనదేశంలో ప్రచారకర్తగా ఈ చిన్నది ఎంపికైంది. దీంతో రకరకాల స్విమ్ వేర్స్ వేసుకుని హాట్ హాట్ స్టిల్స్ ఇచ్చింది. స్లిమ్ అయిన తర్వాత స్విమ్ సూట్ లో విడుదలైతున్న పరిణీతి ఫొటోలు చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.

స్వీడో బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవడం ఆనందంగా ఉందని ఇన్ స్టాగ్రామ్ లోని తన అకౌంట్ లో పోస్టు చేసింది. తాను చిన్నప్పటినుంచీ ఇదే బ్రాండ్ స్విమ్ సూట్ వేసుకుని ఈత కొట్టేదాన్న అని వెల్లడించింది. ఇప్పుడు అదే బ్రాండ్ కు అంబాసిడర్ కావడం ఆనందంగా ఉందన్నది ఈ చిన్నది. రానున్న రోజుల్లో పరిణీతి నటించిన యాడ్ టివిల్లో రానుంది. సో పరిణీతి ఫ్యాన్స్ రెడీగా ఉండండి. చిట్టిపొట్టి బట్టలతో కవ్వించేందుకు పరిణీతి కూడా రెడీ అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *