మూడు భాషల్లో ‘మేజర్’ టీజర్!


ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మేజర్’ టీజర్ ఈ రోజు సాయంత్రం ఘనంగా విడుదలైంది. తెలుగు టీజర్ ని మహేశ్   బాబు, హిందీ టీజర్ ని సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. మలయాళ టీజర్ ని పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు.

శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ ‘మేజర్’ లో అడివి శేష్ దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించగా, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. 

‘మేజర్’ తెలుగు టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు- ‘ అన్ సంగ్ హీరో వారసత్వాన్ని గౌరవించే ప్రయత్నం … మేజర్ ప్రయాణం ప్రారంభం!! మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము!’ అన్నారు.
హిందీ టీజర్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు- దీన్ని ధమాకాదార్ టీజర్ అంటారు. దీన్ని ప్రారంభించినందుకు నిజంగా సంతోషంగా,  గర్వంగా ఉంది. టీంకి అభినందనలు… మరియు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు వందనం’ అన్నారు.

‘మేజర్’- అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహస గాథ. 26/11 ముంబై టెర్రర్ అటాక్ ఉదంతం ఆధారంగా ఉంటుంది. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించాడు. టీజర్ ఒక ఫ్లాట్ లో ఆడుకుంటున్న పిల్లలతో ప్రారంభమై, సైనిక శిక్షణలో పొందుతూన్న అడివి శేష్ తో కొనసాగి, 28/11 ముంబై టెర్రర్ దాడులతో ముగుస్తుంది.
దీనికి తెలుగు డైలాగ్స్ అబ్బురి రవి రాస్తే, అక్షత్ అజయ్ శర్మ హిందీలో డైలాగ్స్ రాశారు. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం, శ్రీచరన్ పాకాల సంగీతం సమకూర్చారు. దీనికి మహేష్ బాబు నిర్మాత. ఈ యాక్షన్ మూవీ జూలై 2  న థియేటర్లలోకి రానుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *