ఫోక్ సింగర్ కోమలిని కమ్ముల ఆదరించాలి


నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్‌స్టోరీ లోని సారంగ దరియా సాంగ్ పై వివాదం ముదురుతోంది. సినిమా కంటే ముందే ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో పెద్ద హిట్టయ్యింది.

సాయి పల్లవి మీద చిత్రీకరించిన ఈ జానపద పాట ఒక పక్క సెన్సేషన్ క్రియేట్ చేస్తూంటే మరో పక్క వివాదం రగులుతోంది. ఈ పాట నా నుంచి తస్కరించారని ఒకరు, కాదు ఇది ప్రజల పాట అని మరొకరూ మాటల బాణాలు విసురుకుంటున్నారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన కోమలి  అనే గాయని ఈ పాటకు కర్తను నేనే అని మీడియా ముందుకొస్తే, కాదు నేనే రాశానని ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తిప్పి కొడుతున్నారు.

ఇందులో ఎవరు రైట్ అనేది పరిశీలిస్తే, గతంలో సుద్దాల అశోక్ తేజ న్యాయనిర్ణేతగా ఉన్న రేలా రే రియాల్టీ  షోలో వరంగల్ గాయని కోమలి సారంగ దారియా (అంటే సారంగిని  ధరించిన అమ్మాయి) పాడింది. ఈ పాట చూసిన  శేఖర్ కమ్ముల తమ సినిమాలో ఈ పాట తీసుకుందామని అశోక్ తేజను కోరారు. దీంతో అశోక్ తేజ ఒరిజినల్ పల్లవి అలాగే ఉంచి, మరో పల్లవి జత చేర్చారని చెప్పుకుంటున్నారు. కానీ ఈ పాట స్ఫూర్తిని కోమలి పాడగా పొందారనేది స్పష్టమవు
తోంది.

 తమ సినిమా కోసం ఈ సాంగ్‌ని వాడుకుంటున్నట్లు అశోక్ తేజ తనకు చెప్పారనీ, అయితే తర్వాత తనకు చెప్పకుండా ఈ పాట అశోక్ తేజ సేకరించినట్లుగా పేరు వేసుకున్నారనీ కోమలి వాపోతోంది. ప్రోమో చూశాకనే తాను సేకరించిన సాంగ్ ఇలా వాడేశారని తెలిసిందనివెంటనే అశోక్ తేజకి  ఫోన్ చేసి మాట్లాడితే సరైన స్పందన రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.

 

అసలు ప్రోమో వచ్చాక శేఖర్ కమ్ముల పాడతావా అని తనను అడిగినట్లు, తన  గొంతు బాగా లేకపోవడంతో పది రోజులు టైమ్ అడిగినట్టు చెప్పింది కోమలి.  ఇప్పుడైతే సమయం లేదనీ,  ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తామనీ, అలాగే అశోక్ తేజ పక్కనే పేరు కూడా వేస్తామన్నారనీ కోమలి వెర్షన్. ఇప్పుడు మాట మార్చి తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ లైవ్ లోనే ఏడ్చేసింది కోమలి.

        ఈ పాట సినిమాకోసం గాయని మంగ్లీ పాడింది. ఆమె గొంతులో ఫోక్ లేదని, పల్లెదనం లేదని, పాట ఏమీ బాగాలేదని కోమలి చెప్పింది. గతంలో ‘రేలా రే’ ప్రోగ్రాంలో మొదటిసారి ఈ ‘సారంగ దరియా’ జానపదాన్ని పాడి జనానికి వినిపించింది కోమలి. దీన్ని ఎవరు కాదంటారు. నిజానిజాలు జనాలకే తెలుసుశేఖర్ కమ్ముల, అశోక్ తేజ ఇలా సమర్ధించుకోవలసింది కాదు. జానపద కళాకారులను సినిమా ఫీల్డు అమాయకుల కింద జమ కట్టి ట్రీట్ చేస్తే మంచి సంకేతాలు వెళ్ళవేమో. మహిళల పట్ల గౌరవభావంతో సినిమాలు తీస్తానని చెప్పుకునే శేఖర్ కమ్ముల ఒకసారాలోచించాలి.

One thought on “ఫోక్ సింగర్ కోమలిని కమ్ముల ఆదరించాలి

Leave a Reply to Mahen Cancel reply

Your email address will not be published. Required fields are marked *