ఫుల్ యాక్షన్ తో ‘ఖిలాడీ’ టీజర్

 మాస్ మహారాజా రవితేజ  యాక్షన్ ఎంటర్టయినర్ ఖిలాడీటీజర్ ఈ రోజు ఉదయం విడుదలైంది. అప్పుడే లక్షల్లో వ్యూస్ తో వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ తీజర్ లో మాస్ మహారాజాతో యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరిడింపుల్ హయతీ హల్చల్ చేశారు.  సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో కన్పిస్తున్నాడు. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీకి రమేష్ వర్మ దర్శకుడు. కొనేరు సత్యనారాయణ, జయంతిలాల్ గడా నిర్మాతలు.

సింగిల్ డైలాగ్ ఉన్న 80 సెకన్ల టీజర్‌లో రవితేజ యాక్షన్ ప్యాక్ నటనతో రాణించాడు. రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తాడు. ఇందులో ఒక చిన్న అమ్మాయి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతూ వుంటుంది. బహుశా రవి తేజ ఈమెని కాపాడడమే కథ కావచ్చు. పరారీలో ఉంది మరియు దీనికి ప్రధాన కథకు బలమైన సంబంధం ఉండవచ్చు. రవితేజ శత్రువు వేళలో వున్నట్టుగా యాక్షన్ సీన్లున్నాయి. షాకింగ్ గా రవితేజ డింపుల్ హయతీ చంపుతున్న సీను కూడా వుంది…

        మాస్ మహారాజా రవితేజ గత చిత్రం క్రాక్ ఒక సంచలనాత్మక హిట్ అని తెలిసిందే. దాని వొత్తిడి ఖిలాడితప్పక వుంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో  రాక్షసుడు అనే హిట్ తీసిన రమేశ్ వర్మ ఇప్పుడు రవితేజతో స్టామినా నిలబెట్టుకోవాల్సిన అవసరముంది. చాలా పూర్వం రవితేజతో వీర అనే ఫ్లాప్ ఇచ్చాడు రమేశ్ వర్మ. మే 28 నా విడుదలవుతున్న ఖిలాడిని ఈ టీజర్ జస్టీఫై చేస్తుందనే ఆశిద్ధాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *