అవినాష్ ..బిగ్ బాస్ ఎంట్రీపై  ‘హైపర్ ఆది’ అదిరిపోయే పంచ్

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై మెల్లిగా  మూడు వారలు పూర్తి చేసుకుంది. స్టార్టింగ్ లో అదిరిపోయే రేటింగ్ సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ షో ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
రేటింగ్స్ లో దారుణంగా పడిపోవటం బిగ్ బాస్ టీమ్ ని కలవరపెట్టింది. దీంతో బిగ్ బాస్ వారానికి ఒక వైల్డ్ కార్డును దింపి జోష్ నింపే ప్రయత్నం చేస్తారున్నారు. అలానే మొదటి వారం కుమార్ సాయి ని వైల్డ్ కార్డుగా దింపగా రెండో వారం జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు.
అవినాష్ ఎంట్రీతో  అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ముక్కు అవినాష్  బిగ్ బాస్ ఎంట్రీ  విషయంపై నెట్టింట్లో పెద్ద డిస్కషనే మొదలైంది. మరో ప్రక్క వెబ్ మీడియాలో  బిగ్ బాస్ షో లోకి వచ్చేందుకు జబర్దస్త్ యాజమాన్యానికి మొదట చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం  దాదాపు 10 లక్షలకు పైగా ఫైన్ కట్టాడు అన్నారు. ఇక ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలో మంచి ఊపు వచ్చిందనేది మాత్రం నిజం. ఇక అవినాష్ ఎంట్రీ విషయంపై హైపర్ అది ఓ  సీక్రెట్ ని బయటపెట్టాడు.
డైరెక్టుగా చెప్పకపోయినప్పటికి హైపర్ అది తన స్కిట్ లోనే డైలాగులతో చెప్పసాడు .   అసలు అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ హౌస్ కు ఎందుకు వెళ్లాడో స్టేజీ మీదే చెప్పేశాడు హైపర్ ఆది. దీంతో మిగితా కంటెస్టెంట్లతో పాటుగా.. జడ్జిలు కూడా షాకయ్యారు.  అవినాష్ జబర్దస్త్ ను వదిలివెళ్లడానికి బలమైన కారణం ఉందనే అర్దం వచ్చేలా..డైలాగు విసిరాడు.
ప్రస్తుతం అవినాష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని దాంతో అందరికి అర్దమైంది. ఇంటికి ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ వదిలి అవినాష్ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడంటూ హైపర్ ఆది ఇన్ డైరెక్ట్ గా అవినాష్ గురించి తన స్కిట్ లోనే చెప్పేశాడు. ఇక ఈ స్కిట్ చూసిన నెటిజన్లు కూడా నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.