భానుమతి దర్శకత్వం వహించిన హిందీ సినిమా ఏది?

తొలి నాళ్లలో  ప్రఖ్యాత నటి పి. భానుమతి కి  సినిమాల్లో నటించాలని లేదు. గాయకురాలిగా స్థిరపడాలనే కోరిక బలంగా ఉండింది. అంతేకాదు, పెళ్లయ్యాక గృహిణిగా స్థిరపడాలని నిర్ణయించుకుంది. అయితే, ఆమెను సినిమాలు వదల్లేదు.

1. భానుమతి 1925 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా దొడ్దవరంలోజన్నించింది. తల్లి సరస్వతమ్మకుసంగీతంలో ప్రవేశం ఉంది. అందుకే భానుమతికి మొదటి సంగీతం గురువయ్యింది.

2. భానుమతి తండ్రి వెంకటసుబ్బయ్యకు పిత్రార్జితంగా 35 ఎకరాల పొలం వచ్చింది. అయితే, వెంకటసుబ్బయ్య తల్లిపేర రిజిస్టరయి ఉండింది. ఆ భూమి కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. రెవిన్యూ ఇన్స్ పెక్టర్  గా ఉన్న వెంకటసబ్బయ్య ఈ కోర్టు కేసుల కోసం మద్రాసు వెళ్లాల్సి వచ్చేంది. అపుడు జీతం చాలక కుటుంబ పోషణకోసం సరస్వతమ్య పిల్లలకు సంగీతం నేర్పింది. అలా  భానుమతి మొదటి గాయకురాలైంది.చివరకు తండ్రికి భూమీరాలేదు, ఉద్యోగం పోయింది. తర్వాత ఆయన తెనాలికి చెందిన వేదాంతం లక్ష్మినారాయణ దగ్గిర క్లర్క్ గా చేరారు.

3. అపుడు ఇంటికి కావలసిన పనులన్నింటిని అంటే బావినుంచి నీళ్ళుతోడుకుని రావడం మొదలుకుని అంగడినుంచి సరుకులు తీసుకురావడం దాకా పనులను మగవాడిలాగా బయట తిరిగి చేసింది భానుమతియే. తండ్రి ఆమెను కొడుకులాగే చూసే వాడు. సినిమాల్లో నటిస్తున్నరోజుల్లో కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరగమనేవాడట.

4. తల్లి సరస్వతమ్మ మంచి గాయకురాలు. రత్నమాల కథని భక్తి గీతాలుగా పాడేది. ఇదే రత్నమాల కథని తీసుకుని భానుమతి తొలిసారి దర్శకత్వం వహించి సినిమాగా తీశారు.

5. డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు పిలుపు మేరకు, పాడేందుకో, నటించేందుకో అవకాశం వస్తుందని తండ్రితో పాటు ఆమె మద్రాసు వెళ్లింది. ఒక స్టూడియో సందర్శించింది. అయితే, ఆమె ను పరీక్షించాక గోవిందరాజు సుబ్బారావు తిరస్కరించారు. భానుమతి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. భానుమతికి  గాయకురాలిగా స్థిరపడాలనే  ఉంది.

6. అయితే, రెండో సారి అవకాశం కూడా గోవిందరాజు సుబ్బారావు ద్వారానే వచ్చింది. ఆయన దగ్గిర నుంచి ఒక వ్యక్తి ఒక లేఖ తీసుకుని వచ్చాడు. ‘1934లో లవకుశ సినిమా తీసిన సి. పుల్లయ్య అనే పెద్దాయన రాజమండ్రిలో ఉన్నాడు,  సినిమా నేపథ్యం లేకుండా, అమాయకంగా ఉంటూ, చెప్పిన మాట వింటూ చక్కగా పాడే అమ్మాయి కోసం చూస్తున్నాడు, ఆయన దగ్గిరికు భానుమతిని తీసుకుని వెళ్లండి,’ అని లేఖలో రాశారు. ఆ వచ్చిన పెద్దమనిషి దగ్గిరుండి వాళ్లని రాజమండ్రి తీసుకు వెళ్లాడు. ఆ వచ్చిందెవరో కాదు, రేలంగి వెంకట్రామయ్య.

7. అయితే అదే సమయంలో ప్రఖ్యాత కర్నాటక సంగీక గాయకుడు గౌరీనాథ శాస్త్రి దగ్గిర నుంచి కూడా భానుమతి కి ఆహ్వానం వచ్చింది. ఈ రెండింటిలో ఎటు వెళ్లాలో పెద్ద సమస్య అయి కూచుంది. చాలా మంది నచ్చ చెప్పాక వెంకట సుబ్బయ్య కూతురిని సినిమాల్లోకి పంపాలని నిర్ణయించుకున్నాడు.

8. రాజమండ్రిలో పుల్లయ్యను కలిశాడు. ఆయన భానుమతితో పాటలు పాడించుకున్నాడు. భానుమతి స్వరం, అణకువ అన్నీ నచ్చాయి. పుల్లయ్య ఆమెను కలకత్తా పంపించాడు. అక్కడ టంగుటూరి సూర్యకుమారి అలనా పాలన చూసుకుంటుందని చెప్పారు. టంగూటురి సూర్యకుమారి పరిచయంతో భానుమతి మనసు కుదుటపడింది. అలా  తెలుగు భానుమతి సినిమా ప్రస్థానం బెంగాలీ కలకత్తా నుంచి మొదలయింది. ఆ రోజల్లో సినిమాలు తీసేందుకు మూడే కేంద్రాలు: కలకత్తా, కోల్లాపూర్, బొంబాయి. తర్వాత పూనా తోడయింది అందువల్ల తొలి నాళ్ల తెలుగు సినిమా షూటింగ్ లన్నీ ఈ మూడు వూర్లలోనే జరిగేవి.

9. పుల్లయ్య భానుమతిని తాను తీస్తున్న వరవిక్రయం (1939) లో కాళింది పాత్రకు తీసుకున్నాడు. కాళింది జీవితం కూడా భానుమతి జీవితంలాగే ఉండేది. నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా ఉండవచ్చని భానుమతి సినిమాలకు ఒప్పకుంది. అదే విధంగా వరవిక్రయంలో తండ్రిని ఆర్థిక సమస్యలనుంచి గట్టెక్కించేందుకు కాళింది ఆత్మహత్య చేసుకుంది. ఈ పోలిక కలకత్తా షూటింగులో కాళింది పాత్రలో భానుమతి జీవించే లా చేసింది.  అపుడామె వయసు 14 సంవత్సరాలు. కాబోయే పెళ్లికొడుక్కు కట్నం ఇచ్చుకోలేని తల్లితండ్రలు నిస్సహాయత వ్యక్తీకరించే సీన్ లో ఆమె నటించాలి.  నటించింది. ఆమె సహజనటనతో పుల్లయ్య ఎంతగా సంతృప్తి చెందారంటే, ‘ వెంకటసుబ్బయ్యా, నీకూతురు ఒక రోజు గొప్పనటి అవుతుంది,’ అని ప్రశంసించకుండా ఉండలేక పోయారు.

10. భానుమతి మూడో చిత్రం ‘కృష్ణ ప్రేమ’ (1943). ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఎం. ఎస్ రామకృష్ణ ప్రేమలో ఆమె పడ్డారు. ఈ విషయాన్ని రామకృష్ణనే  వెంకటసుబ్బయ్య ముందు అంగీకరించారు. కుటుంబ కారణాల వల్ల దీని మీద ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దానితోడు రామకృష్ణ ఒక షరతు పెట్టాడు. పెళ్లయ్యాక  భానుమతి  సినిమాల్లో నటించరాదన్నాడు. ఇది చెప్పి  కుటుంబ సభ్యుల సమావేశం నుంచి తుర్రుమని వెళ్లిపోయాడు. ఇది విన్నాక కూడ భానుమతి మనసు మారలేదు. భానుమతి కుటుంబం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు ఈలోపు వాళ్లిద్దరికి రామకృష్ణ పెంపుడు తల్లి మనపాక కమలమ్మ రహస్యంగా ఆగస్టు 3, 1943న పెళ్లి చేసేసింది.

11. పెళ్లి చేసుకున్నాక భానుమతి రామకృష్ణ జల్సాగా సినిమాలకు షికార్లకు మద్రాసులో తిరిగే వాళ్లు.వాళ్లు ఎపుడూ ఎక్కిన సిటిబస్ నెంబర్ 11 (పదకొండు)

12.పదకొండు సంవత్సరాల వయసులో స్కూలు వార్షికోత్సవంలో వేసిన పాదుకాపట్టాభిషేకం నాటికలో బానుమతి మొదటి సారి నటిగా మేకప్  వేసుకుంది. అపుడు వాళ్లవూరి పోస్టుమాస్టర్ భార్య అక్కమ్మ ఆమెకు మేకప్ చేసింది. అక్కమ్మ చేతి  విశేషం. దాదాపు అరవైయేళ్లు మేకప్ తనని వదల్లేదని భానుమతి చెబుతూండేవారు.

13. భానుమతి రెండో చిత్రం మాలతి మాధవం(1940). దర్శకుడు సి. పుల్లయ్య. ఇది భానుమతికి రెండు రకాల ప్రత్యేకమయింది. ఇది కలకత్తాలో తీసిన సినిమాయే. అపుడే ఆమె కలకత్తా బొటానికల్ గార్డెన్స్ కు వెళ్లింది. అక్కడొక పెద్ద బల్లిని చూసింది. ఆ అనుభవం నుంచి ‘పెద్ద ఆకారాలు, చిన్న వికారాలు’అనే కథ రాశారు. ఈచిత్రం స్క్రిప్టరైటర్ కవిరాజు దగ్గిర నుంచి ఈ షూటింగ్ సమాయంలోనే ఆమె స్క్రిప్టు రైటింగ్ మెలకువలు నేర్చుకున్నారు.

14. 1943 లో వివాహమయ్యాక, భర్త రామకృష్ణ అభీష్టానికి అనుగుణంగానే, అర్థిక సమస్యలున్నా ఇక సినిమాలు చాలు అనుకుంది. అయితే, సినిమాలు ఆమెను వదల్లేదు. బిఎన్ రెడ్డి స్వర్గసీమ తీయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి భానుమతియే సరైన నటి ఆయన భావిచారు. బిఎన్ రెడ్డి ఆమెను సంప్రదించారు. భార్యాభర్తలిద్దరు ఆఫర్ ని తిరస్కరించారు. అంతే కాదు,  బిఎన్ రెడ్డి పదే పదే అడుగుతూ పోరుపెడుతూంటే, వారు మద్రాసు వదలి రామకృష్ణ తల్లితండ్రుల దగ్గరకు పారిపోయారు. అయితే, బిఎన్ రెడ్డి వదల్లేదు. ఈ సారి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు. ‘నీకు ఆత్మన్యూనత ఉంది. అందుకే ఒక కళాకారిణిని చంపాలనుకుంటున్నావ్. నీ భార్య నటిగా విజయవంతం కావడం నీకు ఇష్టం లేదు,’ అని రామకృష్ణ మీద ఒక ట్రిక్ ప్రయోగించారు. అది పని చేసింది. భానుమతి నటించేందుకు రామకృష్ణ అంగీకరించాడు. ఇది 1945లో విడుదలయింది. ఇక్కడ మరొక విశేషముంది. ఘంటసాల సినీరంగ ప్రవేశం జరిగింది కూడా ఆ చిత్రంతోనే. ఈ చిత్రంలోని ఒహో పావురామా అనే పాటకు స్ఫూర్తి Blood and Sand లోని  రీటా హేవర్త్ (Rita Hayworth) పాట. అపుడది బాగా పాపులర్ ఇంగ్లీష్ పాట. ఈ సినిమాలో భానుమతి పాత్రమీద వాళ్ల వంటవాడు చేసిన కామెంట్ ను బట్టకుని ఆమె ‘వంటవాడు చొరకగసీమ’ కథ రాశారు.

15.స్వర్గసీమ తర్వాత వెంటనే మరొక ఆఫర్ వైవి రావు ‘తాశీల్దార్’ కోసం వచ్చింది. ఈ సారి తనకు ఇష్టం లేకపోయినా భర్త వత్తిడి ఎక్కువయింది. ఆయన ప్రోద్బలంతోనే ఈ చిత్రానికి  ఒప్పుకుంది.

16. తర్వాత తమిళ సినిమా రత్నమాల లో అయిష్టంగానే నటించేందుకు అంగీకరించారు. అప్పటి నుంచి సినిమాలు ఆరు దశబ్దాలు ఆమెను వదల్లేదు. అంతేకాదు,  1946లొ ఎల్ వి ప్రసాద్ హీరో గా తీస్తున్న గృహప్రవేశం కు రామకృష్ణ డైరెక్టర్ కూడా అయ్యారు.

17. ఈ మధ్యలో ఎంఎస్ సుబ్బులక్ష్మి భర్త సదాశివన్ తాను తీయబోయే మీరా లో నటించాలని బాణుమతిని కోరారు. ఆమె భాష సమస్య చెప్పి  ఈ ఆఫర్ కు అంగీకరించలేదు.

18. 1948 లో ఎంజిఆర్ హీరోగా, ఆయన భార్య విఎన్ జానకి హీరోయిన్ గా నటిస్తున్న తిమిళ చిత్రం రాజయోగి లో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూనాలోని ప్రభాత్ స్టూడియోలో జరిగింది. ఈ చిత్రం విడుదల కాలేదు. పూనా షూటింగ్ లో ఉన్నపుడు ఆమె తొలిసారి లతా మంగేష్కర్ గొంతు విన్నారు.

19. దక్షిణ భారత సినిమాలో మొదటి గేవా కలర్ చిత్రం అలీబాబా అండ్ ఫార్టీ థీవ్స్ లో నటించే అవకాశం  టిఆర్ సుందరం ద్వారా వచ్చింది.

20. ఆమె కొన్నిహిందీ సినిమాల్లో కూడా నటించారు. 1952-52లో  తెలుగు, తమిళం, హిందీలలో తీసిన చండీరాణి కి దర్శకత్వం వహించారు. అంతకు ముందు నిషాన్ (1950)  షంషేర్, మంగళ (1951) రాణి (1952) నటించారు.  ఆతర్వాత 1967లో నయీ రోష్నిలోనటించారు అదే చివరి హిందీ మూవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *