సమంతకు తెలంగాణ సర్కారు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

తెలంగాణ చేనేత కు ఫిల్మ్ స్టార్ సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అయిన తర్వాత చేనేత అభ్యున్నతి కోసం తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఆమెకు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందబ్బా అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి హీరోయిన్ సమంతకు తెలంగాణ సర్కారు ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు చదవండి మరి.

అసలే ఆమె టాప్ హీరోయిన్.. పైగా అక్కినేని వారి కోడలు. ఇంకేముంది ఆమె రేంజ్ ఎట్ల ఉంటదో మనం ఊహించవచ్చు. ఆమె అక్కినేని వారి కోడలు కాకముందే తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. చేనేత కోసమే ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అయిన తర్వాత ఆమె చేనేత అభ్యున్నతి కోసం పోచంపల్లి, సిరిసిల్ల పట్టణాల్లో తిరిగి చేనేత స్థితిగతులను తెలుసుకున్నారు.

మరి బ్రాండ్ అంబాసిడర్ అనగానే ఆమెకు కోట్లలో నజరానాలు ఉంటాయన్న భ్రమల్లో మనం ఉండడం సహజం. ఎందుకంటే గతంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన క్రీడాకారిణి సానియామీర్జాకు తెలంగాణ సర్కారు కాసుల వర్షం కురిపించింది. సానియామీర్జాకు ఒకసారి కోటి రూపాయలు, మరోసారి కోటి మొత్తం రెండు కోట్లు తెలంగాణ సర్కారు ముట్టచెప్పింది. మరి సానియా మీర్జా ఆ తీసుకున్న డబ్బులకు కూడా న్యాయం చేయలేదన్న విమర్శ కూడా ఉంది. బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా తెలంగాణ కోసం చేసిన మేలు ఏందంటే ఎవరూ చెప్పలేరు.

మరి సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే జీరో. సమంత చేనేత కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నా.. తెలంగాణ సర్కారు నుంచి ఇప్పటి వరకు నయా పైసా తీసుకోలేదు. రెండు కోట్లు తీసుకున్న సానియా ఏమీ సర్వీస్ చేయకపోయినా.. కోట్లేమీ తీసుకోకపోయినా సమంత చేనేత కోసం తన వంతు ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇంతకాలం సమంతకు ఎన్ని కోట్లు ఇస్తున్నారో అని జనాల్లో చర్చ ఉంది. శాసనమండలిలో సమంత రెమ్యూనరేషన్ విషయమై తెలంగాణ ఐటి, పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటిఆర్ వివరణ ఇచ్చారు. సమంతకు నయాపైసా సర్కారు నుంచి ఇవ్వడంలేదని వెల్లడించారు. ఆమె ఉచితంగానే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ఏది ఏమైనా అక్కినేని నాగార్జునకు తెలంగాణలో కోట్ల రూపాయల భూములు కట్టబెట్టారన్న విమర్శ ఉంది. అంతెందుకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ సర్కారు కూడా నాగార్జున కుటుంబానికి మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాగార్జున విషయంలో ఉద్యమకాలంలో తీవ్రమైన విమర్శలు చేసిన టిఆర్ఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున కుటుంబానికి దగ్గరైందన్న ప్రచారం కూడా ఉంది. ఆ మాటలు, విమర్శలు ఉంటే ఉండొచ్చు కానీ.. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉచితంగా సేవలు అందిస్తున్న సమంతను మాత్రం అభినందించక తప్పదంటున్నారు చేనేత వర్గాల వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *