టాలీవుడ్ కి కరోన సెకండ్ వేవ్ ప్రమాదం?

కోవిడ్ సెకండ్ వేవ్ టాలీవుడ్ ని కలవర పెడుతోంది. టాలీవుడ్ లో కూడా అగ్ర నిర్మాత అల్లు అరవింద్, వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ లు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం అలా వుండగా, గత శుక్రవారం విడుదలైన సినిమాల పరిస్థితి కోవిడ్ ప్రభావంతో బాగాలేదు. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్, కార్తీ నటించిన సుల్తాన్ కలెక్షన్ల తీరే నిదర్శనం.

కాగా వచ్చే శుక్రవారం ఏప్రెల్ 9 న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలవుతోంది. దీని మీద కోవిడ్ ప్రభావం వుండకపోయినా, ఆ పైవారం విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఎలా వుంటుందోననని ఆందోళన ఇప్పటి నుంచే మొదలైంది.

లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్ కలెక్షన్ల విషయానికి వస్తే టాలీవుడ్ అద్భుతమైన ఫలితాల్ని చూసింది. క్రాక్, ఉప్పేన వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నాంది లాంటి చిన్న సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత జాతిరత్నాలు కూడా సూపర్ హిట్టయ్యింది. కానీ వైల్డ్ డాగ్ నుంచీ కోవిడ్ విజృంభణ ఆందోళన పరుస్తోంది. పరిస్థితి గనుక తీవ్రమైతే మరో లాక్ డౌన్ ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకవేళ లాక్ డౌన్ విధించక పోతే 50 శాతం సీటింగ్ ఆంక్షలు విధించ వచ్చు. ఏది జరిగినా కొత్త సినిమాలకి గండమే వుంది. ఇప్పటికే కర్నాటకలో 50 శాతం సిటింగ్  ఆంక్షలు విధించేశారు.

ఇదిలా వుండగా, కోవిడ్ కేసుల్లో ఆకస్మిక పెరుగుదల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ కార్యక్రమాలకి సవాలుగా మారింది. ఈ మూవీకి సంబంధించి పూర్తి చేయాల్సిన కీలకమైన భాగం మిగిలే  ఉంది. దీంతో కోవిడ్ కేసుల ఉధృతి నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

షూటింగుకే కాకుండా  పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా తగినంత సమయం అవసరం. మే 14  విడుదల తేదీగా ప్రకటించినందున, కోవిడ్సెకండ్ వేవ్‌లో సినిమా బ్యాలెన్స్ షూట్‌ను సమయానికి ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను  సకాలంలో పూర్తి చేయడం దర్శకుడు కొరటాల శివకి పెద్ద సవాలుగానే వుంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *