Home Entertainment  ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ రివ్యూ

 ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ రివ్యూ

129
0

 ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ రివ్యూ

‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ అనే మలయాళం చిత్రాన్ని ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ గా విడుదల చేశారు. ఈ చిత్రం రివ్యూ ఇది.
ఎక్కడ చూడాలి?: ఆహా (aha app)
రిలీజ్ డేట్:  09-10-2020
రేటింగ్ : 3  /5
దేని గురించి?ఒంటరితనంతో బాధపడుతున్న ఓ పెద్దాయనకు..రోబోని తోడుగా ఉంచుతాడు వాళ్ల అబ్బాయి. ఏదో ఆయన వంట, ఇంటి పనులకు అది సాయిం చేస్తుందని భావిస్తాడు. అయితే కొన్నాళ్లకు అదే సర్వస్వం అయ్యిపోతుందాయనకు. నిజంగా యంత్రమైన రోబోతో మనిషి …ఎమోషనల్ గా కనక్ట్ కాగలడా?
కథేంటి?
ఓ పల్లెటూళ్లో వృధ్యాప్యాన్ని తన కొడుకుసాయింతో లాగుతూంటాడు  భాస్కరరావు (సూరజ్ వెంజరామూడు) . ఆయనకు కొడుకు సుబ్రమణ్యం (సౌబిన్ షాహిర్) అన్నీ చేసి పెడుతూంటే బాగానే ఉంటుంది కానీ అతనూ జీవితాన్ని వెతుక్కోవాలి కదా. ఎంతకాలమని తండ్రిమాట జవదాటని గొప్పవాడు అనే బిరుదుని మోస్తూ కూర్చుంటాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అతనికి రష్యాలో ఓ జపాన్ రోబోలు తయారు చేసే కంపెనీలు జాబ్ వస్తే…వెళ్లిపోవాలనుకుంటాడు. తన తండ్రి తనతో రాడు..తనేమో ఇక్కడ ఉండలేడు. ఈ క్రమంలో  తండ్రి చేత నాలుగు తిట్లు తిని, బలవంతంగా ఒప్పించి ఓ కేర్ టేకర్ ని పెట్టి  రష్యా వెళ్తాడు. కానీ ఈ పెద్దాయన తన ఛాదస్తంతో ఆ కేర్ టేకర్ ని కేర్ చేయక నానా తిప్పలు పెడతాడు.
దాంతో కేర్ టేకర్లు మారతారు కానీ ఆయన మాత్రం తన పంధా మార్చుకోడు. ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కొడుకు ఓ ఆలోచన చేస్తాడు. మనుష్యులతే ఆయనతో వేగలేకపోతున్నారు కాబట్టి చెప్పింది చేసే రోబో ని తెస్తే ఏ ఇబ్బంది ఉండదని ..తన కంపెనీ వాళ్లు చేసిన రోబో ని తీసుకువచ్చి తండ్రి చెప్పినట్లు వినేలా పోగ్రామింగ్ చేసి అప్పచెప్పి వెళ్తాడు.
మొదట ఈ రోబో గోలేంటి..అని విసుక్కున్న ఆ తండ్రి..ఆ తర్వాత మెల్లిగా రోబోతో తన ఒంటరితనాన్ని పోగొట్టుకుండాడు. దానితో చెస్ ఆడతాడు..గుడికి తీసుకెళ్తాడు..దానికి బట్టలు కుట్టిస్తాడు. జాతకం చూపిస్తాడు …తన తల స్నానం చేస్తే జుట్టు తుడిపించుకుంటాడు.
ఇలా రోబో..తో ఓ అనుబందం ఏర్పాటు చేసుకుంటాడు. ఈ లోగా అనుకోని ఓ అవాంతరం వచ్చి పడుతుంది. ఆ రోబో ని ఇచ్చిన కంపెనీ వెనక్కి తీసేసుకోవాలనుకుంటుంది. అందుకో ప్రత్యేక కారణం ఉంటుంది. దానితో ఎమోషనల్ గా కనెక్టు అయిన భాస్కరరావు..రోబో ని తిరిగి అప్పగించటానికి ఒప్పుకుంటాడా…చివరకు ఏమైంది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?
అప్పట్లో శంకర్,రజనీ కాంబోలో రోబో సినిమా వచ్చి,సెన్సేషన్ క్రియేట్ చేసింది. రోబో అచ్చం మనిషిలా …ఏం కావాలంటే అలా రజనీకాంత్ ని మించి పోయి  రచ్చ చేసేసింది.  అయితే ఆ తర్వాత రోబోని పెట్టి ఎవరూ సినిమా చేయటానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటో రోబో ప్రధాన పాత్రలో పెడితే ఆ రోబోనే హీరో అయ్యిపోతుంది. మెయిన్ హీరోకు ప్రాధాన్యత ఉండదు. దానికి తోడు రోబో సినిమా ని మించి బడ్జెట్ కావాలి. స్టార్ కాస్టింగ్ కావాలి. అన్నిటినీ మించి అంతకు మించి గొప్ప కథ కావాలి. అది శంకర్ కే రోబో 2 అంటే సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్దితుల్లో ఓ చిన్న సినిమా రోబో ప్రదాన పాత్రతో సినిమ వచ్చిందంటే ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే.  మళయాంలో ఏడాది క్రితం రిలీజైన  ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ అలా రోబోని జనాలకు ముందుకు తీసుకు వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడా సినిమాని తెలుగులోకి డబ్ చేసారు. సినిమా ఎమోషన్ గా కనక్ట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మిగతా టెక్నీషియన్స్ ఆయనకు అన్ని విధాలా సహకరించారు.
అలాగే ఈ సినిమాలో భాస్కర రావు గా నటించిన సూరజ్  నటన చాలా బాగుంది.ఈయన తన వయస్సు 40 కన్నా రెట్టింపు వయస్సు వాడిలా  జీవించాడు.
చివరి మాట
అసభ్యత, అపహాస్యం లేని ఈ కామెడీ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడచ్చు
నటీనటులు : సురాజ్ వెంజారమూడ్, సౌబిన్ షాహిర్, మాలా పార్వతి, సైజు కురుప్పు, రాజేష్ మాధవన్, ఉన్నిరాజా, శివదాస్ కణ్ణూర్ తదితరులు
నిర్మాణం: సంతోష్ టి.కురువిల్లా
దర్శకత్వం : రతీష్ బాలకృష్ణన్ పొదువాల్
సంగీతం :  బిజీబల్
ఎడిటర్:సైజు శ్రీధరన్
సినిమాటోగ్రఫీ: సను జాన్ ఉరుగేసి
రన్ టైమ్: 2.20  నిముషాలు