Home Entertainment 1960 దశకం: హిందీ సినీ సంగీతపు  స్వర్ణయుగం

1960 దశకం: హిందీ సినీ సంగీతపు  స్వర్ణయుగం

88
0
SHARE
Shammi Kapoor (A twitter picture)

(Ahmed Sheriff)

భారత దేశపు సినిమా చరిత్ర దాదా సాహెబ్ ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర తో 1913 లో మొదలయింది. ఇది మూకీ సినిమా. దీని తరువాత అర్దేశిర్ ఇరాని 1931 లో నిర్మించినఆలం ఆరా తో టాకీ సినిమాల శకం ఆరంభమైంది.  అప్పట్లొ దాదాపు హిందీ భాష లో నిర్మిత మయ్యే సినిమాలన్నీ బాంబే (ఇప్పటి ముంబై)ఆ చుట్టుపట్ల ప్రాంతాలలోనే నిర్మితమయ్యేవి. 
మొదట్లో వచ్చిన  హిందీ  మూకీ సినిమాలన్నీ దాదాపు పౌరాణికాలే. అటు తరువాత మెల్లగా జాన పదాలూ, సాంఘికాలు  హిందీ సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టాయి.  అయితే అప్పుడే వచ్చిన స్వాతంత్ర్యపు నేపధ్యం లో ప్రతి విషయపు లక్ష్యమూ భారత దేశాన్ని నిర్మించుకునే దిశలో వుండడం తో హిందీ సినిమాల ఇతివృత్తాలు కూడా కొంచం మొహమాటంగానే సాగాయి. 1950 దశకం చివరి వరకూ  హిందీ సినిమాలు భావోద్వేగాలకు దగ్గరగా,  వినోదానికి కొంచం దూరంగానే వుండి, సంస్కరణలూ, సందేశాలూ నిండిన ప్యాసా”, “మదర్ ఇండియా లాంటి సినిమాల ఇతివృత్తాలతో కొంచం బరువుగా సాగాయి.
1960 దశకం ప్రారంభంతో హిందీ సినిమాల లక్ష్యం  వినోదం ఆహ్లాదం పంచే దిశలో ఒక్క సారిగా యాహూ అంటూ అరుస్తూ మంచు కొండల మీదినుండి జారుతూ  మైదానాల మీద గంతులేస్తూ జోరుగా ఉషారుగా ఊపందుకుంది. 
ఈ సమయం లో హిందీ సినీ సంగీతం తార స్థాయి లో వుండింది. దీన్నే హిందీ సినీ సంగీతపు  సువర్ణ శకంగా పేర్కొన్నారు. దర్శక నిర్మాత విజయానంద్ ద్వారా వచ్చిన తీస్రి మంజిల్ (1966), జువల్ థీఫ్ (1967), జానీ మేరా నాం (1970) లాంటి సస్పెన్సు చిత్రాలు, శక్తి సామంత ద్వారా వచ్చిన కష్మీర్ కి కలి (1964), ఎన్ ఈవెనింగ్ ఇన్ పారిస్ (1967), ఆరాధనా (1969) లాంటి రొమాంటిక్ చిత్రాలు పూర్తి స్థాయి మనొరంజకమైన సంగీతం తో ఈ దశకం లోనే ఎంట్రీ ఇచ్చాయి.   
ఈ దశకం లో    దిలీప్ కుమార్ మొఘలే ఆజం (1960) నుండి రాజేష్ ఖన్నా అరాధన (1970) వరకూ వచ్చిన హిందీ చిత్రాలు, చిత్రాల హంగుల్నీ, వాటికి కావలసిన గుణగణాల్నీ, సంగీతపు స్థాయిన్నీ నటీనటుల్నించి ప్రేక్షకులు ఆశించే విషయాల్నీ  మూలరేఖల్లో కి మలిచి భవిష్యత్తులో చిత్రాలు ఎలా వుండాలి? అని  బాలీవుడ్ చిత్రాల శైలిని నిర్వచించాయి అనడం లో సందేహం లేదు
అలాంటి చిత్రాల్లో కొన్ని  ……….
మొఘలే ఆజం :
ఈ చిత్రం 1960 లో వచ్చింది.  ఇదొక ప్రేమ కథా చిత్రం. అంతేనా? ఈ ప్రేమ అక్బరు చక్రవర్తి (పృథ్వీ రాజ్ కపూర్) కుమారుడు, మొఘలు సామ్రాజ్యానికి వారసుడు యువరాజు అయిన   సలీం (దిలీప్ కుమార్) కురాజ దర్బారు లో నాట్యకత్తె అనార్కలీ (మధుబాలా) కి    మధ్యలో వుంటే ఎలావుంటుంది
శాపగ్రస్థ  ప్రేమ లోని  భాగస్వాములు గా దిలీప్ కుమార్, మధుబాలా నటించిన ఈ చారిత్రాత్మక చిత్రం మరో సమాంతర చరిత్రను సృష్టించింది.  రాచరికపు పొగరుతో కట్టుబాట్లను నిర్దేశించే అక్బరు చక్రవర్తి గా పృథ్వీ రాజ్ కపూర్, తనదైన శైలి లో స్లో డైలాగ్ డెలివరీ తో తన హావా భావాలతో,  అర్థం లేని కట్టుబాట్లను నిరసించే వ్యక్తి గా దిలీప్ కుమార్, తన అంద చందాలతో, నృత్యాలతో నే కాకుండా, ప్రేమకోసం రాచరికాన్ని ధిక్కరించే ఓ ప్రియురాలిగా మధుబాల   ప్రేక్షకుల మనసుల్లో   నిలిచిపోయే నటనను ప్రడర్శించారు.   
భారత దేశపు ఓ ప్రాంతం లో ఈ సన్నివేశాలన్ని జరుగుతున్నాయా? అని ప్రేక్షకులు అనుభూతి చెందేలా చరిత్ర ఘట్టాల్ని తెరమీదకు తెచ్చి ప్రేక్షకులందరూ మనం దీనిలో భాగమా ?” అని అనుభూతి చెందేట్లు దీనిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు కే. ఆసిఫ్.  చరిత్రలో నిలిచిపోయే ఓ గొప్ప సినీ కావ్యాన్ని చిత్ర సీమకు అందించాడు.  ఇదికె. ఆసిఫ్ ఊహలకీ, కఠిన ప్రరిశ్రమకీ, విచ్చలవిడి తనానికీ ఒక నివాళి అని ఓ పత్రిక రాసింది కూడాను.  

ఈ చిత్రాన్ని మరింత ఎత్తుకు తీసుకేళ్లింది నౌషాద్ దీనికి ఇచ్చిన అగ్ర స్థాయి  సంగీతం. మధు బాల పాడి నర్తించే “ప్యార్ కియా తో డర్నా క్యా జబ్”  పాట హిందీ సినీ సంగీతం లో నే చరిత్ర సృష్టించింది
గంగా జమున :
ఈ చిత్రానికి కథా రచయితానిర్మాతా దిలీప్ కుమార్. ఇది ఫేదరికం లో మగ్గుతున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. గంగా (దిలీప్ కుమార్), జమున (నాసిర్ ఖాన్). ఒకరు (గంగా) చెడు వైపు గూండా, డకాయిట్ గా. మరొకరు (జమున) మంచి వైపు , పోలీసు ఆఫీసర్ గా.  
ఈ చిత్రం లో దిలీప్ కుమార్ నటన తారస్థాయిలో వుండింది అని విమర్శకులు చెబుతారు. ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి ఏ మాత్రం సంబంధించని దిలీప్ కుమార్ అవధ్ యాస తో మాట్లాడిన  తీరు తనని ఆశ్చర్యం లో ముంచెత్తిందనీ, ఈ చిత్రం ద్వారా తానెంతో నేర్చుకున్నాననీ స్వయంగా నేటి సూపర్ స్టార్ అమితాభ్ బచన్ ఈ  చిత్రాన్ని కొనియాడటం ఓ విశేషం. 
ఈ చిత్రం డకాయిట్ చిత్రాలకూ, ఒకేకుటుంబం లోని ఇద్దరు వ్యక్తులు ఒకరు మంచి వైపు మరొకరు చెడు వైపు వున్న డ్రామా సినిమా లకు నాంది పలికింది. ఇది అమితాబ్ బచ్చన్ కి పాఠాలు నేర్పిందో లేదో తెలియదు కానీ, ఖచ్చితంగా ఆ తరువాత ఆంగ్రీ యంగ్ మన్ పాత్రలతో అమితాబ్ బచ్చన్, ఇతరులు వుర్రూతలూగించిన అనేక చిత్రాల స్క్రిప్టులు రాయడానికి సలీం-జావేద్ ల జంట కు మాత్రం తప్పకూండా ప్రేరణ కలిగించిందనే చెప్పాలి. ఈ విషయం వారి ద్వారా రచించబడ్డ దీవార్, త్రిశూల్ చిత్రాలు చూస్తే తెలుస్తుంది..
జంగ్లీ:
ప్రేమకోసం, స్వంతంత్రత కోసం యువత చేసే ఆర్తనాదం లా యాహూ అంటూ  కేరింతలు కొడుతూ జలపాతం లా ప్రెక్షల  గుండెల్లొకి దూకింది 1961  లో వచ్చిన జంగ్లి సినిమాఆనందాతి రేకలతో పాటలు పాడుతూ,   స్టెప్పు లేస్తూ ప్రజల్ని ఆనంద పరచడానికి భారత దేశపు ఎల్విస్ ప్రీస్లీ గా పేరు బడ్డ షమ్మీకపూర్ యువతలో ఆహ్లాదాన్ని ఉత్సాహాన్నీ నింపుతూ రంగ ప్రవేశం చేశాడు. 
షమ్మికఫుర్ ను హిందీ సినీ రంగపు మొట్టమొదటి డాన్సింగ్ హీరో అనొచ్చు. అప్పట్లో యాహూ అంటు అరుస్తూ షమ్మికపూర్ మంచు కొండల్లొ పడుతూ లేస్తూ పాడిన  “చాహె కొయి ముఝె జంగ్లి కహే”  పాట ఒక సంచలనం. 

సినిమాలు కట్టుబాట్ల లో వుండాలి వాటికి కొన్ని నియమాలుంటాయి అని ఎవరయినా అనుకుని వుంటే వారి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అవతరించాడు షమ్మీకపూర్. ఆ తరువాత ఎన్ని నియమాలు వుల్లంఘింప బడ్డాయో?
వక్త్  :
యాష్ చోప్రా మల్టి స్టారర్ చిత్రాలు తీయడం లో ప్రసిద్ధి. కుటుంబ సభ్యులు తప్పి పోవడాలూ,మళ్లీ కలవడాలు, ఈ మధ్య వారి జీవితాల్లో చోటు చేసుకునే అనెక సంఘటనలు, వాటి పట్ల వీరి ప్రతిచర్యలూ, వారి ఆలోచనల్లో తద్వారా వచ్చే జీవిత శైలిలో ని  మార్పులూ ఒక ఆసక్తి కరమైన సినిమా కథకి కావల్సినంత  సరంజామ. ఇలాంటి కథలు ఇటీవల వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ”, “యాదోన్ కి బారాత్  లాంటి సూపర్ హిట్ సినిమాల్లో చూడొచ్చు. అయితే ఈ దశకంలో వచ్చిన వక్త్ (సమయం) సినిమా (1965) ఇలాంటి కథలకు బీజం వేసింది.
ఈ చిత్రం బి.ఆర్. చోప్రా నిర్మాణత లో యాష్ చోప్రా దర్శకత్వం ద్వారా వచ్చింది. సోలో హీరోలు రాజ్యం చేస్తున్న రోజుల్లో మల్టి స్టారర్ సినిమాల మజా చూపించిన చిత్ర మిది. దీన్లో సునీల్ దత్, రాజ్ కుమార్, శశి కపూర్, బల్ రాజ్ సహ్ని, సాధనా, షర్మీలా టాగోర్, రహ్మాన్, మదన్ పూరి తదితరులు నటించారు.
రవి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ  చిత్రం లోని  “ఆగే భీ జానే న తూ”,ఐ మెరే జొహర జబి” పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.
గైడ్ : 
దేవానంద్ సినీ జీవిత ప్రయాణం లో  ఓ మైలు రాయి “గైడ్” (1965) చిత్రం.  ఆర్. కే. నారాయణ్   పుస్తకం గైడ్ ఆధారంగా తీసిన సినిమా.  సాంప్రదాయ విరుధ్ధమైన ఒక హీరోయిన్ పాత్రలో వహీదా రహమాన్ నటించింది. ఇది ఒక తాత్వికతను బొధించే చిత్రంగా చివరికి నీ మజిలీ ఏది?” అని హీరోను ప్రశ్నించే సినిమాగా వచ్చింది. దేవానంద్ ఒక టూరిస్ట్ గైడ్ పాత్రలో నటించాడు. రోసీ అనే ఒక అందమైన అమ్మాయి (మరొకరి భార్య) ప్రేమ వలలో చిక్కుకున్న ఒక అల్పజీవి ఆధ్యాత్మిక, తాత్విక జీవన ప్రయాణమే ఈ సినిమా ఇతి వృత్తం. దీనిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి ఎస్.డీ.బర్మన్ సంగీతం లో వచ్చిన పాటలు, వాటికి శైలేంద్ర రచన రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయా అన్నట్లు వుంటాయి. ఛిత్ర కథ కొంత సాంప్రదాయ విరుధ్ధమైన హీరొయిన్ మీద నడిచినా ఈ చిత్ర విజయానికి కారణం సంగీత మనే చెప్ప వచ్చు . 
ఆ రోజుల్లో వహీదా రహమాన్ నర్తిస్తూ పాడిన కాంటొ సె ఖీంచ్ కే యె ఆంచల్  పాట ప్రజానీకాన్ని వుర్రూతలూగించింది. దర్శకుడు విజయానంద్ ఖాతా లో మరొ విజయం ఈ సినిమా.
తీస్రి మంజిల్ :
ఈ సినిమా పేరే సంచలనంగా వుండింది ఆ రోజుల్లో. ఇదొక మర్డర్ మిస్టరీ సినిమా. ఈ సినిమా లో సస్పెన్సు, పాటలూ, డ్యాన్సులూ  , నటనా ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నట్లుంటాయి. నిర్మాత నాసిర్ హుస్సెన్ అప్పట్లో ఇటువంటి సినిమాలకు ప్రఖ్యాతి.  ఈ సినిమా నిర్మాణం లో ఓ విశేషముంది. దీనిలో హీరో పాత్రకు ముందుగా దేవానంద్ ను కలిశారు. దేవానంద్ సినిమా లో నటించడానికి నిరాకరించాడు. తరువాత ఇది షమ్మీకపూర్ వొళ్లో వాలింది.  మరీ విచిత్రమేమిటంటే ఈ సినిమాకి  దేవానంద్ సోదరుడు విజయానంద్ దర్శకత్వం వహించడం.  ఇది ఎంత సూపర్ హిట్ సినిమా అయ్యిందంటే  ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా  దేవానంద్ బాధ పడుతూనే వున్నాడు. ఈ సినిమా వద్దనుకుని నేను చాలా తప్పు చేసాను అంటు వుండేవాడు. ఇంకో విచిత్ర మేమిటంటె, 1957 లో కూడా ఒకసారి దేవానంద్ తుంసా నహి దేఖా అనే చిత్రాన్ని  తిరస్కరించాడు. దాన్లో కూడా ఆ తరువాత షమ్మీకపూరే నటించాడు. ఈ రెండు విషయాలను గుర్తు చేసుకుని దేవానంద్ ఒకసారి ” నా ప్రత్యర్థి ని నేనే తయారు చేసుకున్నాను అని వాపోయాడు.
చక చకా సాగే కథ, హత్య, చిక్కు ముళ్లూ, ఎవరై వుండవచ్చు?  అనే సస్పెన్సు తో విజయానంద్ మార్కు అంశాలన్నీ వున్న సినిమా. దీనికి తోడు మళ్లీ తార స్థాయి సంగీతమూ వెరసి ప్రేక్షకులు ఇచ్చిన దానికి మరెన్నో రెట్ల ఆనందాన్ని తిరిగి ఇచ్చిన సినిమా గా జండా ఎగురవేసింది. ఈ సినిమాలో ఓ హసీనా జుల్ఫో వాలీ జానే జహా  అనే పాట ఆ దశకపు పాటల్లోనే సూపర్ డూపర్ హిట్.

జ్యయల్ థీఫ్:
సస్పెన్సు మార్కు సినిమాలకు విజయానంద్ (దేవానంద్ సోదరుడు) పెట్టింది పేరు. అతడి దర్శకత్వం లోనే దేవానంద్ జీవిత ప్రయాణం లో మరో చెప్పుకో దగ్గ మైలు రాయి ఈ సినిమా. ఈ  సినిమా ఓ వార్తా పత్రికలో ముంబై పోలీసులను కలవర పెడుతున్న ఒక జువెల్ థీఫ్ (నగల దొంగ) కు సంబంధించిన ఓ వార్త తో మొదలవుతుంది. సినిమా మొదలయినప్పటినుండీ ప్రేక్షకులు దొంగ ఎవరు? అని ఊహించడం లో మునిగి పోతారు. ఆధారాలన్నీ సినీ హీరో దేవానంద్ వైపు తీసుకెళుతూ వుంటాయి. ఒక్కో సారి ఒకే దేవానంద్ వున్నాడా లెక  ఇద్దురున్నారా? అని కూడా ప్రేక్షకులు అనుమాన పడతారు.  సరైన సమయాల్లో సందర్భానుసారంగా వచ్చే థ్రిల్సుకథ లో మలుపులూ, అనూహ్యమైన పాత్రలూ, డ్రామా, అన్నింటినీమించి మనొరంజక మైన పాటల చిత్రీకరణ  వెరసి జువల్ థీఫ్ సినిమా. సపెన్సు సినిమాలూ వాటిలో వుండవలిసిన కథనం ఎలా వుండాలన్నది ఈ సినిమా నేర్పుతుంది. 
అన్నీ చెప్పాం అసలు సంగతి వదిలేశాం  దేశ భక్తి మీద సినిమా ఏదీఅదిగో ఈ దశకానికే కాదు ఈ శతకానికే సరిపోయేంత దేశ భక్తి తో … 
ఉప్ కార్ :  
మనోజ్ కుమార్ (ఉహూ మిస్టర్ భారత్) రచనా , దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా మనోజ్ కుమార్ తన దేశభక్తిని ప్రస్ఫుటంగా చాటుకున్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి  “జై జవాన్ జై కిసాన్ నినాదం ఒక దేశ భక్తి   నాదం లా మోగించింది ఈ చిత్రం. అప్పట్లో ఎక్కడ చూసినా దీని చర్చలే. అంత వరకూ, సాంఘిక, సస్పెన్సు చిత్రాలలో  కనిపించిన మనోజ్ కుమార్ ఒక్క సారిగా మిస్టర్ భరత్ గా  అవతార మెత్తాడు. ఈ చిత్రం ఒక శక్తివంత మైన దేశ భక్తి చిత్రంగా ప్రేక్షకుల హృదయాల్లో నాటుకు పోయింది.   ఈ చిత్రం లో ని పాటలు మెరె దేశ్ కి ధర్తీ”,  ఖస్మె వాదే ప్యార్ వఫా సబ్ వాదె హై వాదో కా క్యా సూపర్ హిట్ అయ్యాయి.

ఈ చిత్రం లో ప్రఖ్యాత విలన్ ప్రాణ్ మొదటి సారి ఒక మంచి వాడి పాత్రలో కనిపించాడు. ఖస్మె వాదే ప్యార్ వఫా సబ్ అనే ఒక పాట కు అభినయించాడు. ఈ చిత్రం లో    ప్రజలు అతడికిచ్చిన గుర్తింపు అతడి జీవితాన్నే మార్చెసింది. ఆ తరువాత ప్రాణ్ విలన్ వేషాలు  మానేసి క్యారెక్టర్ పాత్రలే వేశాడు
Ahmed Sheriff
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610