వైఎస్ సలహాదారు సోమయాజులు అకస్మిక మృతి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆయన ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉండిన ప్రముఖ్య చార్టర్డ్ అకౌంటెంట్ డిఎ సోమయాజులు ఆకస్మికంగా మృతి చెందారు. వైఎస్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. కెవిపి రామచంద్రరావు రాజకీయాల సలహాదారుగా ఉంటే, సోమయాజులు ఆర్థిక వ్యవహారాలు, పాలసీ అమలు విభాగం చూసేవారు. దీనితో పాటు ఆయనను కొద్దిరోజు అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన విద్యుత్, వ్యవసాయ రంగం మీద అపారమయిన విజ్ఞానం ఉంది. ఈ రెండు రంగాలలో వస్తున్న సంస్కరణలతో పాటు, ఈ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షున్ణంగా పరిశోధన చేశారు. ఆయన ఆలోచలన్నీ ఎపుడూ రైతుకు మేలుచేసేవిగా ఉండేవి. ఇక్కడే వైఎస్, ఆయన ఆలోచనలు కలిశాలయి.

వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు మీద పోరాటానికి అవసరమయిన ఇంటెల్లెక్చవల్ సమాచారాన్నంతా అందిస్తూ సహకరించారు. వైఎస్ మరణం తర్వాత ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. తర్వాత వైసిపిలో కి వచ్చారు. జగన్ కూడా సలహాధారుగా ఉండినారు.

సోమయాజులు మృతి పట్ల జగన్ సంతాపం

 

సోమయాజులు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యల సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన ఉత్తమ్, పొన్నాల..

గొప్ప మిత్రుణ్ణి కోల్పోయాను- ఉత్తమ్

సోమయాజులు రైతు పక్షపాతి .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ పథకం అమలులో సోమయాజులు పాత్ర కీలకం.. మంచి మిత్రుణ్ణి, మార్గదర్శకుణ్ణి కోల్పోయానని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

‘‘సోమయజులు గారు మేధా సంపన్నులు అనేక రైతు సంక్షేమ పథకాలు రూపొందించారు.
ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు, ఒక గొప్ప సలహా దారుణ్ణి కోల్పోయాను,’’ అని ఆయన ఆవేదన చెందారు.

ఈ నాలుగేళ్ల ప్రతిపక్ష రాజకీయంలో కూడా సోమయాజులు గారు నాకు మంచి సలహాలు, ప్రణాళికలు, వ్యూహాలు చెప్పారు. ఆయన కృషి మరువలేనిదని అటూ ఆయన మరణం నాకు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా ఉత్తమ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *