Home Breaking పార్థీ గ్యాంగ్ అని హడల గొట్టింది వీళ్లేనా

పార్థీ గ్యాంగ్ అని హడల గొట్టింది వీళ్లేనా

277
0

విజయవాడలో హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషంలో అర్ధరాత్రి ఏలూరు రోడ్ లో కొంతమంది యువకులు వీరంగం చేశారు.  దీనితో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ గోడవ ఆనోట ఈ నోటో పడి పోలీసుల దాకా వెళ్లింది. వారు  రంగంలోకి  ఆరుగురు యువకులను అదుపు లోకి తీసుకున్నారు.

యువకులను మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్థీ గ్యాంగ్ , ఆ గ్యాంగ్ అని, ఈ గ్యాంగ్ అని ఈ మధ్య సోషల్ బోగస్ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని చదువుకున్నోళ్ల వాట్సాప్ గ్రూపులు కూడా అదేదో సామాజిక బాధ్యత అన్నట్లు తెగ షేర్ చేసి సంచలనానికి కారణమయ్యారు. ఇలాంటి సంచలనాలు కొంతమందిని చంపేందుకు కూడా కారణమయ్యాయి. ఈ నేపథ్యంల విజయవాడలో హర్రర్ సృష్టించిన యువకుల గ్యాంగ్ పెట్రోలింగ్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.


వీళ్లేమో తాము హర్రర్ షార్ట్ ఫిల్మ్ కో్సమే ఈదెయ్యాలాట ఆడినట్లు చెబుతున్నారు.  ఇది షార్ట్ ఫిల్మ్ గోడవేనా లేక ఇంకా ఏవయినా కారణాలున్నాయా అనేది కూడా పోలీసుల పరిశీలిసున్నారు. పార్థీ గ్యాంగ్ లని, పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లని వాట్సాప్ షేరవుతున్న చాలా వ్యవహారాలు ఇలాంటి కుర్రకారు సృష్టిస్తున్న రూమర్లేని పోలీసులు అనుమానిస్తున్నారు.

వీళ్లదగ్గిర ఉన్న వీడియోల ను పరిశిలించి వీళ్ల సంగతి చూస్తామని పోలీసులు చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here