Home English కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ కల వెనక రాజకీయం ఏమిటి?

కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ కల వెనక రాజకీయం ఏమిటి?

382
0

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి  కెసిఆర్  తాను మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తానని అవసరం అయితే తానే నాయకత్వం వహిస్తానని  ప్రకటన చేసినారు.  బిజెపి కాంగ్రెస్ దేశాన్ని సరిగా పాలించలేదని విధాలను సమూలంగా మార్చివేయాలని సైతం మాట్లాడుతున్నారు. కెసిఆర్  ప్రకటనతో రాజకీయాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ప్రాతిపదిక వారు మాట్లాడుతున్న విధానాలా లేక 2019 ఎన్నికలా అన్న కోణంలో కచ్చితమైన  పరిశీలన జరగాలి.

కెసిఆర్ ప్రకటనకు మూలం ఏమిటి?

కెసిఆర్ కీలక ప్రకటనకు మూలం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలే అనిపిస్తుంది. 2014 ఎన్నికలలో బిజెపి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దానికి రెండు కారణాలు 1. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత 2. మోదీ మీద ఉన్న నమ్మకం. గడిచిన 4 సంవత్సరాలను పరిసీలిస్తే కాంగ్రెస్ మీద అనుకూలం లేకపోయినా నాటి వ్యతిరేకత ఉండదు ( ఆంద్రప్రదేశ్ మినహయింపు)అని పిస్తుంది.. మోది మీద నాడు ఉన్న నమ్మకం తగ్గిందే తప్ప పెరిగింది లేదు. 2014 ఎన్నికలలో బిజెపి మంచి విజయాన్ని సాధించింది కేవలం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్దాన్, గుజరాత్,మహరాష్ట్ర, బీహర్, డిల్లీ లాంటి 7 రాష్ట్రాలలో వచ్చిన ఏకపక్ష విజయాలే కారణం. ఆ పార్టీ సాధించిన 282 స్దానాలలో 201 స్దానాలు ఇక్కడివే. 2014 తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాలను పరిసీలిస్తే బీహర్, మద్యప్రదేశ్, రాజస్దాన్, డిల్లీ లో ఓడిపోయింది. గుజరాత్ లో గణనీయంగా తగ్గింది. మొత్తం జరిగిన పరిణామాలు చూస్తే దాదాపు 70-80 స్థానాలు తగ్గే అవకాశం ఉంది. మరో కీలక విషయం అక్కడ కాంగ్రెస్ కు అవకాశం ఉంటుంది. అంటే బిజెపి 282 నుంచి 200 కు తగ్గితే కాంగ్రెస్ 40 నుంచి 100 స స్థానాలను దాటనుంది. బెంగాల్, కేరళ,తమిళనాడు, ఉబయ తెలుగు రాష్ట్రాలలో గతానికి నేటికి బిజెపి కి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు మిగిలిన రాష్ట్రాలలో కూడా బిజెపి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు సరికదా పంజాబ్ లాంటి చోట్ల కాంగ్రెస్ పుంజుకుంది. మొత్తంగా పరిసీలిస్తే జాతీయ పార్టీలు అయిన బిజెపి కి 200 లోపు కాంగ్రెస్ కు 150 లోపు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే రెండు పార్టీలకు సరిపడ సీట్లు రావు.

పుంజుకుంటున్న ప్రాంతీయ పార్టీలు

దేశ పరిస్థితులు అలా ఉంటే పలు రాష్ట్రాలలో ప్రాంతీ పార్టీలు ఈ కాలంలో పుంజు కున్నాయి. బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడు లో డిఎంకె లేదా రజినీ, తెలంగాణలో కెసిఆర్, ఏపీలో టిడిపి  లేదా వైసిపి  లు, ఒడిస్సాలో నవీన్, ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి లేదా అకిలేష్ కు గతంలో కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయి. దాదాపుగా 150 స్థానాలు పైగా ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది. రెండు జాతీయ పార్టీలకు 150 , 200 దాకా స్థానాలు వస్తే ప్రాంతీయ పార్టీలకు 150 దాకా వస్తాయి. అలా 2019లో ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశం వస్తుంది.

బహముఖ వ్యూహంతో కెసిఆర్ అడుగులు

కెసిఆర్ ఒక్కసారిగా కాంగ్రస్, బిజెపి లకు వ్యతిరేక కూటమి వైపు అడుగులు ఎందుకు వేసినట్లు అవకాశం వస్తే ఏకంగా ప్రధాని అయిపోదామనా అనుకుంటే అది పొరబాటు. ఇదంతా తెలంగాణలో తన పార్టీని గెలిపించే వ్యూహం తప్ప మరోటికాదు. ఈ మధ్య కాలంలో నే అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్బంగా చాలా కీలక ప్రకటన చేసినారు కెసిఆర్ . బిజెపి కి తెలంగాణలో అవకాశం లేదు అని అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదని అయినా నాకూ ప్రదాని కావాలని ఉంది అయిపోతానా అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి ఇపుడు వారే ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్థానే అనడం వెనకు తెలంగాణ రాజకీయ అవసరాలు తప్ప మరోటికాదు. తెలంగాణలో కెసిఆర్ కి కాంగ్రెస్ ప్రధాన శత్రువు అయితే బిజెపి కూడా తాజకీయ ప్రత్యర్థే. అందుకే మూడవ ప్రంట్ మాట. దేశం రెండు జాతీయ పార్టీలకు అవకాశం రాకపోతే కచ్చితంగా ఒక అవకాశం ప్రాంతీయ కూటమికి ఉంటుంది. అలా ప్రధాని అయ్యే అవకాశం మమత, మాయావతి, శరద్ పవార్, నవీన్, బాబు, అవకాశం ఉంటే కెసిఆర్ కి ఉంటుంది. ఇదే ప్రచారం తెలంగాణలో జరిగితే పీ వీ తర్వాత తెలంగాణ బిడ్డకు ప్రదాని అయ్యే అవకాశం మళ్లీ కెసిఆర్ రూపంలో వస్తుంది. అని సెంటి మెంట్ రాజకీయలు నడపవచ్చు. 2014లో తెలంగాణ సెంటిమెంట్ గెలిపిస్తే నేడు ప్రదాని అవకాశం ఉపయోగపడక పోతుందా అన్న ఆశ కెసిఆర్ ది గా కనిపిస్తుంది. అలా తెలంగాణలో మంచి విజయం సాదించడానికి 2014 నుంచి నేటివరకు సాగిన తన పాలన కన్నా మూడవ ముచ్చట మంచి పలితాలను ఇస్తుందన్న వ్యూహంగా కనిపిస్తుది. కానీ నేటి వరకు వరుసగా కేంద్రాన్ని బలపరిచి నేడు వారికి మేం వ్యతిరేకం అంటే ప్రజలు నమ్ముతారా? ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచిన కెసిఆర్ అనేక సందర్బాలలో రాష్ట్రబిజెపి నేతలను విమర్సించిన కెసిఆర్ ఒక్క మాట కూడా మోదిని అనలేదు. మరి ఇపుడు వారు నిర్మించే ప్రత్యామ్నాయం కు ప్రాతిపదిక ఉందా కచ్చితంగా కెసిఆర్ కి ఉన్న ప్రాతిపదిక తెలంగాణలో తనకు ప్రయోజనం కలగడమే. 2019లో కేంద్రంలో రెండు జాతీయ పార్టీలలో ఒకరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే కచ్చితంగా ఇదే కెసిఆర్ అనే మాట కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి తాము మద్దతు ఇస్తాం అంటారు. అలా తన ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయం మన జాలదు.

(యం పురుషోత్తం రెడ్డి,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి 9490493436)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here