ఈ నెలలో అంగారక గ్రహాన్ని కళ్లతో చూడాలనుకుంటున్నారా, ఇలా చేయండి

ఈ నెలలో ఆకాశంలో ఒక విచిత్రం జరుగుతున్నది. సూర్యోదయాని కంటే ముందు ఆంగారకోదయం జరుగుతుంది. అందవల్ల మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంగారకుడిని దర్శించవచ్చు. అక్టోబర్ 23, 24,25,26  తేదీలలో  తెల్లవారు జామున అంగారకుడిని చూసే అవకాశం లభిస్తుంది.

అక్టోబర్ 23, 24తేదీలలో మీరు తెల్లవారుజామునే నాలుగున్నరకల్లా లేయాలి. ఒక కప్పు వేడి వేడికాఫీ సేవించి ఉల్లాసంగా తయారుకండి.

భూమండలం పూర్వార్థ గోళంలో సూర్యోదయానికి గంటముందు అంగారకుడొస్తాడు. తెల్లవారుజామున   మీరు చీకట్లో సాధారణంగా సూర్యోదయం జరిగే చోటే చూడండి.

అపుడు చందమామ  కాంతి హీనమవుతూ  లియో ద లయన్    నక్షత్ర కూటమి ముందు నుంచి జారుకుంటూ ఉంటాడు.

సంధ్య వెలుతురు అపుడపడే భూమ్మీదికి ప్రసరించడం మొదలవుతుంది.

సరిగ్గా అపుడే ఏ పాయింట్ దగ్గిర సూర్యడొస్తాడో అదే పాయంట్ పైన మీకు నిగనిగలాడుతూ నక్షత్రం లాగా ఒక ప్రకాశవంతమమయిన చుక్క కనిపిస్తుంది. అదే అంగారకుడు(దిగువ మ్యాప్) .

లియోని గుర్తించడమెలా? అనుకుంటున్నారా? లియో అటుపక్కకు దొర్లిన ప్రశ్నార్థకం (?) లాగా కనిపిస్తుంది. దీని వల్ల దీనికి కొడవలి (sickle) పేరు వచ్చింది.

ఇది అందరికీ బాగా తెలిసిన ఏస్టరిజం(Asterism).  ఆకాశంలో కొన్ని చుక్కలు కలసి ఏదో ఒక అకారాన్ని తీసుకుంటుంటాయి. దీనినే ఏస్టరిజం అంటారు.

ఇపుడు మళ్లీ మనం అంగారకుడి దగ్గరికి వద్దాం.

కాంతి హీనమవుతున్న అర్ధచంద్రుడిలో వెలుతురు బాగం ఎపుడూ తూర్పు వైపు  ఉంటుంది గుర్తుంచుకోండి. ఇదే చంద్రుడి ప్రయాణ దిశకూడ ఇదే. ఈ సమయంలో అర్ధచంద్రుడి దిశ రెగ్యులస్ అనే నక్షత్రం నుంచి క్రమంగా దూరంగా జరుగుతూ తూర్పునకు పోతూ ఉంటుంది. రెగ్యులస్ అనేది చుక్క లియో నక్షత్ర కూటమి(constellation)లో బాగా నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా ఉండే నక్షత్రం. ఆస్ట్రానమిలో ఇలా ప్రకాశవంతమయిన నక్షత్రాలను ఫస్ట్ మాగ్నిట్యూడ్ నక్షత్రాలంటారు. మసక మసకగా కనిపించే వాటిని  6 మాగ్నిట్యూడ్ నక్షత్రాలంటారు. ఇది వేరే విషయం.

అక్టోబర్ 23న అర్ద చంద్రుడు రెగ్యులస్ ఎడమ వైపున సమీపానే ఉంటాడు. 24 న తూర్పు రెగ్యులస్ కు దూరంగా జరగుతాడు. 25న ఇంకా దూరంగా, భూతలం వైపు ప్రయాణిస్తాడు. అక్టోబర్ 26న భూ ఉపరితలానికి బాగా దగ్గరగా వస్తాడు. ఈ తెల్లవారుజామున, సంద్య వెలుతురు రావడానికి ముందు, సూర్యుడు ఉదయించే స్పాట్ లోనే మీకొక నక్షత్రం లాగా  కనిపిస్తుంది. అదే మార్స్ లేదా అంగారకుడు. అంటే అక్టోబర్ 23 నుంచి అర్ధచంద్రుడు అంగారకుడి వైపు మనకు దారి చూపిస్తూ ఉంటాడు. చంద్రుడు మనల్ని 26న అంగారకుడి సమీపానికి తీసుకువస్తాడు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/rajahmundry-vet-andra-phaneendra-extraordinary-animal-rescuer/

ఆ రోజున ఎరుపు ఆరెంజ్ రంగులతో మెరుస్తూ ఒక చిన్న చుక్కలాగా కనిపించే అంగారకుడు భూమికి 383 మిలియన్ కి.మీ దూరాన ఉంటాడు.వచ్చే12 నెలలో     అంగారకుడి ప్రకాశం పెరుగుతూ పోతుంది. చివరకు  ఇప్పటికంటే 50 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

ఇదంతా లియో కాన్ స్టెలేషన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. దాదాపు ఈ జోడియాక్ సెంటర్ నుంచే చంద్రుడు ప్రయాణిస్తాడు. జోడియాక్ అనే మాట  మీ అందరికి జ్యోతిషంలో బాగా పరిచయమున్న మాట. జోడియాక్ అంటే ఏమీ లేదు ఒక ఏడాదిలో చంద్రడు,సూర్యుడు  ప్రయాణించే మార్గాలు, ఆమార్గంలో వాళ్లకు ఎదురయ్య నక్షత్రాలే.