Home Breaking పోలవరం నుంచి రాజమండ్రికి డేంజర్ : ఉండవల్లి హెచ్చరిక

పోలవరం నుంచి రాజమండ్రికి డేంజర్ : ఉండవల్లి హెచ్చరిక

273
1

పోలవరం నిర్మాణం తీరు అనుమానాలకు తావిస్తున్నదని ఎదైనా ప్రమాదం జరిగితే  ముందు కొట్టుకుపోయేది రాజమండ్రి పట్టణమేనని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు.

ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని ఈ విషయంలో తాను చేసిన సూచనలనే కాదు, ఎవరి సూచనలను కూడా ప్రభుత్వం ఖాతరుచేయడం లేదని ఆయన ఆరోపించారు.

‘పోలవరం వద్ద భూమి కుంగిపోతున్నది, ఇది మాములు విషయం కాదు. సరిగ్గా కట్టకపోతే , రేపు డ్యాం కు ఏదైనా ప్రమాదం జరిగితే రాజమండ్రి కొట్టుకు పోతుంది.  ప్రజలను ఇలా భయభ్రాంతులకు గురిచేయవద్దు,’ అని అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వెంటనే నిపుణులను పంపి భూమి ఎందుకు కుంగిపోతున్నదో, దాని వల్ల పోలవరం ప్రాజక్టుకు ఉన్న ముప్పేమిటో పరిశీలించాలని చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

‘పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు పారుతున్నది. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఏదయినా తేడా వచ్చి డ్యాంకు డ్యామేజ్ అయితే రాజమండ్రి పట్టణం కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచి పెట్టుకు పోతాయి,’ అని అరుణ్ కుమార్ అన్నారు.‘పోలవరం విషయంలో నాణ్యత పాటించకపోతే, చాలా ధన , ప్రాణ నష్టాలు జరుగుతాయి. ప్రజలకు నిజాలు చెప్పండి. పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పును రాష్ట్ర ప్రజలు క్షమించరు. అక్కడ పనిచేసే ప్రతి ఇంజనీరు పోలవరంలో జరగుతున్న తప్పిదాలను నాకు మొరపెట్టుకున్నారు. నిర్వాసితుల పరిస్దితి ఏమిటో తెల్చకుండా నీరు ఎలా వదులుతారు,’ అని ఆయన ప్రశ్నించారు.

అరుణ్ కుమార్ ఈ రోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఒకపుడు కాంగ్రెస్ నాయకుడయిన అరుణ్ కుమార్ ఇపుడేపార్టీలో లేరు. ఆయన వైసిపిలోచేరతారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో   ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి  పోలవరం నిర్మాణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

‘పోలవరం మీద ప్రభుత్వంలో క్లారిటీ లేదని, మంత్రొకటి మాట్లాతున్నారు, ముఖ్యమంత్రి ఇంకొకటి చెబుతున్నారు, ప్రాజక్టు సైట్లో ఉన్నఅధికారులు ఆందోళన ఇంకొకటి ఆయన చెప్పారు.ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ఈ ఏడాది జూన్‌లో పోలవరం నీళ్లి స్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని నిన్న ఒక ప్రకటన చేశారు. ఇంతకు ముందు 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని, నీళ్లిస్తామని చెప్పారు. ఇది 2019. అయినా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాలేదు,’అని ఆయన అన్నారు.

‘ఎపుడు నీళ్లిస్తారో చెప్పగలరా? వచ్చే ఏడాది కాకుంటే ఆ తర్వాత నయినా నీళ్లిస్తారా? లెప్ట్ కెనాల్ పనులు ఎపుడో అయ్యాయి, రైట్ కెనాల్ పనులు పూర్తి కాలేదు,’అని ఆయన అన్నారు.

పోలవరం మీద ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదని చెబుతూ ఈ ప్లాన్ ఏమిటో చెప్పకుంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన హెచ్చరిక చేశారు.

1 COMMENT

  1. రోజు కో మాట పూటకో వేషం లా ఉన్నది టీడీపీ వాళ్ళ పరిస్థితి కిందటి సంవత్సరం 2018 నాటికీ పోలవరానికి నీళ్లిస్తామని చెప్పిన దేవినేని ఉమా గారి మాటలు రాష్ట్రమంతా విన్నారు మరియు పేపర్లో రాసుకోండి అన్నా విషయం అందరూ చూశారు ఎన్నికలు వస్తున్నాయి మనం చేసిన చేయకపోయినా ఓ సారి ప్రజల చెవుల్లో మన మాటలు పడితే రేపు ఓట్లు వేస్తారు అనే భ్రమలో టీడీపీ వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు అది మీ భ్రమ తప్ప రాష్టానికి ఒరిగింది ఏమి లేదు అనేది మే 23న ప్రజలే చెబుతారు చూస్తూ ఉండామని చెబుతున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here