Home English విశాఖ బిడ్డలు తెలంగాణలో మృతి

విశాఖ బిడ్డలు తెలంగాణలో మృతి

347
0

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చేరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లాకు చెందిన రాము అనే వ్యక్తి బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లా తుంకుంటా మున్సిపాలిటీ వచ్చి ఒక తోటలో పని చేసుకుంటూ ఉంటున్నాడు.

అతని ఇద్దురు పిల్లలు వెంకటరమణ(11), దుర్గా ప్రసాద్(10) లాక్ డౌన్ వల్ల పాఠశాలలు సెలవు ఉండటంతో తుంకుంటా గ్రామ శివారులోని రాంరెడ్డి కుంటలో చేపలు పట్టడానికి వెళ్లారు. చేపలు వేటాడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు చిన్నారులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న శామీర్ పేట్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.