పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే కొనసాగాలి: విహెచ్

(ప్రశాంత్ రెడ్డి)

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధే కొనసాగాలని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు విహనుమంతరావు పేర్కొన్నారు. ఈ విలేకరులతో మాట్లాడుతూ ఓటమి ఎదురయినంత మాత్రాన పార్టీ అధ్యక్షపదవిని త్యజించనవసరం లేదనిఅన్నారు.

1977లో కాంగ్రస్ చిత్తుచిత్తుగా ఓడిపోయిందిని చెబుతూ 1980 మళ్లీ ఇందిరాగాంధీకి ప్రజలు అఖండ విజయం సాధించిపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని ఆయన పేర్కొన్నారు.

కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కుటుంబానికి, ఇతర రాజకీయ కుటుంబాలకు చాలా తేడా ఉందని హనుమంతరావు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ దిగిపోవడానికి గ్రామస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ లీడర్లదాకా ఎవరూ సుముఖంగా లేరని, ఆయనే కొనసాగాలని సర్వత్రా కోరుతున్నారని ఆయన చెప్పారు.

రాహుల్ గాంధీ పోతే,ఇక పార్టీలో కార్యకర్తలకు దిక్కుఉండని ఆయన అఅన్నారు. పార్టీలో మార్పు రావాలని చెబుతూ సీనియర్లతో పాటు జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలన్నారు. పార్టీ లో కొంతమంది కుటుంబాలకు పార్టీ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని రాహుల్‌ గుర్తించడం సంతోషమని విహెచ్ పేర్కొన్నారు.
ఏపీలో ఓ ఆత్మ తనను రాహుల్‌కు దూరం చేస్తోందని వీహెచ్ ఆరోపించారు. వైసీపీకి వచ్చిన సీట్లను చూసి జగన్‌ కూడా ఆశ్చర్యంలో ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విధంగా హాజీపూర్‌ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు పరామర్శించకపోవడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *