రైతుబంధు చెక్ అడిగినందుకు టిఆర్ఎస్ నుంచి వేటు

పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎంతటి వారినైన క్షమించేది లేదు

● టీఆర్ఎస్వి ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులు
ర్యాకల రమేష్ యాదవ్

యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్వి నాయకుడు గొట్టం కృష్ణారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాలుపడుతున్నాడని  ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు.  ఈ చర్య తీసుకుంటున్నట్లు  టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు ర్యాకల రమేష్ యాదవ్ శుక్రవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కి కానీ టీఆర్ఎస్వి కి కానీ గొట్టం కృష్ణారెడ్డి కి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎంతటి వారినైన సహించేది లేదని ఆయన  తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు గోపాగాని ప్రసాద్ గౌడ్, టీఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మిట్ట అరుణ్ గౌడ్, పట్టణాధ్యక్షులు మిట్ట అనిల్ గౌడ్, శారాశి రాజేష్, కార్యదర్శి దయ్యాల భరత్, కాటమైన వినయ్ ముదిరాజ్.

ఇంతకీ కృష్ణారెడ్డి చేసిన తప్పేమిటో తెలుసా? తనకు రైతుబంధు చెక్కు రాలేదని ఆలేరు ఎమ్మెల్యే సునీతారెడ్డిని అడగటమే.  దానికి ఇంత పెద్ద చర్య తీసుకున్నారు. ఎంతయినా టిఆర్ ఎస్ రూలింగ్ పార్టీ కదా?

అసలు కథ ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/trs-leader-abuses-party-worker-for-inquiring-about-his-rythu-bandhu-cheque/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *