సిగ్గుంటే కేసిఆర్ చెక్కు తీసుకోకు : ఎర్రబెల్లి వార్నింగ్ (వీడియో)

పాలకుర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుపై విరుచుకుపడ్డారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయాలని పెర్కవేడు గ్రామంలో ఒక రైతు ఎర్రబెల్లిని అడిగాడు. దీంతో ఎర్రెబెల్లి సాధ్యం కాదని చెప్పారు. అయితే ఆ రైతుకు, ఎర్రబెల్లికి మధ్య మాటలు పెరిగిపోయాయి.

దీంతో రెచ్చిపోయిన ఎర్రెబల్లి రైతును బూతులు తిట్టారు. నీకు సిగ్గుంటే కేసిఆర్ చెక్కు తీసుకోకు అంటూ ఆ రైతుపై బూతులు అందుకున్నారు ఎర్రబెల్లి. రైతును అవమానించేలా మాట్లాడిన తీరుపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు రైతును దూషించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పైన వీడియో ఉంది మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *