Home English టిఆర్ ఎస్ లీడర్ కొడుకు కారు ప్రమాదం, నలుగురు పేద మహిళలకు చావు

టిఆర్ ఎస్ లీడర్ కొడుకు కారు ప్రమాదం, నలుగురు పేద మహిళలకు చావు

405
0

నేత కొడకు అంటే ఆ మాత్రం అరాచకత్వం ఉండాలి. తాగాలె. తినాలి. తన్నాలి.  పార్టీలు చేసుకోవాలే. అల్లరిచిల్లర ఫ్రెండ్స్ నేసుకుని రాత్రంత తాగి కార్లు నడపాలి.సచ్చినోడు చస్తాడు, బతికకినోడు బతుకుతాడు. కేసు మాఫీ చేసేందుకు తండ్రి నేత ఉంటాడు. నేత రూలింగ్ పార్టీ వోడు అయితే, పార్టీ పరువుకాపాడుకునేందుకు ప్రభుత్వం సచ్చినోడికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి నోరు మూయిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్టులో కొడుకు తాగ లేదని తేల్తుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎప్పటికీ తేల్వదు బే. అంతే రాజకీయం.

ఇలాంటి కేసే ఒక హైదరాబాద్ సమీపంలో జరిగింది. ఒక కారు తెల్లవారుజామున వేగంగా రాంగ్ రూట్ లో వస్తాంది. ఎదురుగా ఆకుకూరలు విక్రయించేందుకు మార్కెట్‌ కు వెళ్తున్న ఆటో. దూసుకొచ్చిన కారు ఆటోను ఢీ కొనింది. డ్రైవర్‌ తో సహా నలుగురు రైతు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాదు అసలు విషయం.

కారులో ఉన్నది ఎవరు?

కారులో ఉన్న నలుగురిలో ఒకరు ప్రవీణ్ రెడ్డి. లోకల్ టిఆర్ ఎస్ నాయకుడు బిపుల్లారెడ్డి కొడుకు. ప్రవీణ్ తన స్నేహితులు (కోటేశ్వర్ రావు, సాయి, రాఘవ)లతో కలసి తుర్క యామిజాల్ లో ని విఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒక ప్రోగ్రాంలో రాత్రంత జల్సా చేసి తెల్లవారు జామున యాక్సెంట్ కారులో ఇంటికి బయలు దేరారు, సోమవారం తెల్ల వారుజామున అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది..ఎవరికీ వొల్లు తెలియడం లేదు. రాంగ్ రూట్ లోకి మళ్లారు. అంతే ఎదురుగా అకుకూరలు అమ్ముకునే వాళ్లను సిటిలోకి తీసుకొస్తున్న ఆటో వస్తున్నది. మత్తులో కారును ఢీకొట్టారు.   చాలా వేగంతో వస్తూండటంతో, స్పీడ్ కంట్రోల్ లో లేకపోవడంతో కారు  ఢీకొట్టి ఆటోను చాలా దూరంగా లాక్కెళ్లి ఒక చెట్టును గుద్దింది. కారులో ఉన్న వాళ్లకేం కాలేదు, అయితే ఆటోలో ఉన్న వాళ్ల లో నలుగురు చనిపోయారు. మరికొంతమంది  పరిస్థితి తీవ్రంగా ఉందంటున్నారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడకు చెందిన చీమల సుజాత(44), చీమల మమత(35), ఆంబోత్‌ మారు(50), ఆంబోత్‌ హంస్లీ(56)తోపాటు కాట్రోత్‌ అచ్చాలి, కాట్రోత్‌ కమిలి, కాట్రోత్‌ కైలాబ్, సంకటి లక్ష్మమ్మ, ఆంబోత్‌ సోన, చీమల పద్మజ, ఆంబోత్‌ రజిత గ్రామంలోనే ఆకుకూరలు సాగు చేస్తారు. వాటినికి ఇబ్రహీం పట్నం తెచ్చి అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు.  రాజకీయ నాయకుడి కొడుకు ప్రయాణిస్తున్న కారు రాంగ్ రూట్ లో వస్తున్నదని తెలియక  సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆకుకూరల మూటలు పెట్టుకుని ఇబ్రహీంపట్నం మార్కెట్‌లో విక్రయించేందుకు బయలుదేరారు.

ప్రమాదం తర్వాత కారులో ఒక విష్కీబాటిల్ కనిపించిందన మంచాల ఇన్స్ పెక్టర్ గంగారాం మీడియాకు తెలిపారు. కారు లో ఉన్న వాళ్ల బ్లడ్ శాంపిల్స్ కలెక్టు చేశామని, వారు తాగారో లేదో కనుక్కుంటామని రాచకొండ డిసిపి ఎన్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మంత్రి మహేంద్ర రెడ్డి ప్రమాద స్థలానికి వచ్చి పాత స్క్రిప్ట్ ప్రకారం ఎక్స్ గ్రేషియా. డబల్ బెడ్ రూం ఇల్లు ప్రకటించారు. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి  టిఆర్ ఎస్ నేత పుల్లారెడ్డి కొడుకుని గుర్తించిన స్థానికులు మంత్రి కాన్వాయ్ ముందుకు కదలకుండా ధర్నా చేశారు. కాన్వాయ్ మీద రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీ ఝళిపించి వారిని తరిమేశారు. చచ్చినోళ్లు కుటంబాటు సర్వనాశనం.

తొందర్లోనే… తొందర్లో కొడుకు తాగలేదని, డ్రైవ్ చేస్తున్న పెద్ద మనిషే తాగాడని, అతనే యాక్సిడెంట్ కు కారణమని నివేదిక రావచ్చు. తండ్రి క్షేమం, కొడుకు క్షేమం, పార్టీ పదిలం. ఇదే రాజనీతి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here