కొత్త వివాదంలో తెలంగాణ స్పీకర్

స్వయానా ఒక శాసన సభ స్పీకర్ కొత్త వివాదంలో చిక్కకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ,మరియు పోలీస్ అధికారురుల కూడా ఇదే వివాదంలో ఇరుక్కుపోయారు. ఈ ఫోటో చూడండి. ఏముందక్కడ. అందరూ కలిసి బైక్ ర్యాలీ లో హెల్మెట్ ధరించకుండా మోటర్ బైక్ నడుపుతున్నారు.
హెల్మెట్ ధరించకోపోవడం తప్పు కాదా. ర్యాలీలలో హెల్మెట్ ధరించరాదని నియమం ఉందా. ఒకవైపు హెల్మెట్ ధరించాలని క్యాంపెయిన్ నడుస్తున్ సమయంలో ఇలా ప్రముఖులంగా ఈ నియమం ఉల్లంఘించడమేమిటి?
హెల్మెట్ ధరంచాలని తెలంగాణ జాగృతి కవితక్క ఎంత గొప్ప క్యాంపెయిన్ నడిపారు. ఒక స్పీకర్, ఒక మంత్రి, అనేక మంది పోలీసు అధికారులు ఇలా సామూహికంగా ర్యాలీ పేరుతో మోటార్ బైక్ నడపడం బాగుంది.అయితే, హెల్మెట్ కూడా ధరించి ఉంటే, మరొక సందేశం కూడా ఉండేది కదా.
హెల్మెట్ ధరించనందుకు వారి మీద చర్య ఏమిటి?
ఎంత సెలెబ్రిటీలయినా ఇలా బైక్ నడపడటం తప్ప అని వారి తెలియచేయాలి.
సామాన్యుడి హెల్మెట్ ధరించడం లేదు అని Rs 100/ నుండి 500/- వరకు వసుల్ చేసే పోలీసులు ఈ రూల్ వయెలేషన్ కు సమాధానం  చెప్పాలి…??
ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఈ మధ్య జరిగిన టిఆర్ ఎస్ ర్యాలీ ఇది. పార్టీ ర్యాలీలో స్పీకర్ పాల్గొనవచ్చా. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు పార్టీ కార్యక్రమాలకు హాజరు  కాదు.కాని తెలంగాణ స్పీకర్ మాత్రం చాలా లాయల్ గా పార్టీ జెండాలతో ఉన్నర్యాలీని లీడ్ చేస్తున్నట్లు లేదూ…
మీడియా…అధికారులు స్పందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *