తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ముసలం..??

తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ప్రారంభం అయిందా ……?  అంటే .. అవును అనే అనిపిస్తున్నది. తాజా పరిణామాలు ఈ దిశగా  స్పష్టంగా కనిపిస్తున్నాయి .టీపీసీసీ చీఫ్ ,  సీఎల్పీనేత  లేకుండానే తెలంగాణ లోని కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ తో భేటీ కానున్నారు .ఈ భేటీ ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్నది . టీపీసీసీచీఫ్ ఉత్తమ్ నాయకత్వంలో మేము నడవలేము అని కాంగ్రెస్ నేతలు రాహుల్ కు తెల్పనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి .

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న కోమటిరెడ్డి సోదరులే ఈ కొత్త వర్గానికి నాయకత్వం వహించి ఢిల్లీకి తీసుకువెళ్లారని విశ్వనీయ వర్గాల  ద్వారా తెలుస్తుంది . పీసీసీ చీఫ్ పోస్ట్ కోమటిరెడ్డి సోదరులకు ఇస్తే పార్టీ బలోపేతం చేయడం తో పాటు ,పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా తీసుకెళతాం అని రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పనున్నారు .నిన్న మొన్నటి  వరకు పచ్చిగడ్డి   వేస్తే బగ్గుమనే విధంగా ఉన్న రేవంత్ రెడ్డి ,డీ.కే.అరుణ, కోమటీరెడ్డి సోదరులు కలిసిపోవడం అంటే తెర వెనుక ఎంతటి రాజకీయం నడిచిందో అర్థం చేసుకోవొచ్చు.

రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు డి .కే.అరుణ ,గీతారెడ్డి ,కోమటిరెడ్డి బ్రదర్స్ ,భట్టు విక్రమార్క ,మాజీ మేయర్ బాండ కార్తీక రెడ్డి లు అంతా కలిసి ఢిల్లీ వెళ్లారు . బుధవారం రాహుల్ ను కలిసి తమ డిమాండ్స్ తో పాటు సమస్యలను రాహుల్ కు వివరించనున్నారు .ఉత్తమ్ నాయకత్వాన్ని సమర్ధించేది లేదని, లేని పక్షంలో తాము తమ దారి చూసుకుంటామని , పార్టీ కూడా తెలంగాణ లో పునాది లేకుండా పోతదని రాహుల్ గాంధీ తో కరాఖండి గా చెప్పే అవకాశం ఉంది .

దీనితో తెలంగాణ  కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ హస్తినలో హీటెక్కిస్తోంది .రేపు  ఢిల్లీలో ఎం జరగనుందో అన్న చర్చ అందరిలో మొదలైంది . టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూరు పై అధికార పక్షం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
మరి ఢిల్లీ పరిణామాలు ఎలా ఉంటాయి, తెలంగాణ కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి అన్నది తెలాలంటే.. కొద్ది ఘడియలు ఆగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *