బంజారాహిల్స్ పిఎస్ లో శ్రీరెడ్డి గ్యాంగ్ హల్ చల్ (వీడియోలు)

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సినీ నటి శ్రీరెడ్డి, ఆమె స్నేహితులు హల్ చల్ చేశారు. జూనియర్ ఆర్టిస్టులతో కలిసి శ్రీరెడ్డి స్టేషన్ ముందు ధర్నా చేశారు.

మరో జూనియర్ ఆర్టిస్టు శ్రీశాంత్ రెడ్డి అలియాస్ పుల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే శ్రీశాంత్ రెడ్డిపై బాధితురాలు రోజా దాడి చేశారు.

శ్రీశాంత్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులకు శ్రీరెడ్డి స్నేహితురాలు రోజా ఫిర్యాదు చేశారు. శ్రీశాంత్ ఒక సినిమా కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కో ఆర్డినేటర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూనియర్ ఆర్టిస్టు రోజాను లైంగికంగా లొంగ దీసుకున్నాడని కో ఆర్డినేటర్ పై ఫిర్యాదు చేశారు.

సాఫ్ట్ డ్రింకులో మత్తుపదార్థం కలిపి జూనియర్ ఆర్టిస్టు రోజాతో  సెక్సులో పాల్గొన్నాడని, ఆమె నుంచి బంగారం  నగదు డబ్బులు దొంగిలించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోల్లో ఉన్నాయి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *