నెలాఖరు కష్టాలా? అయిదారు వేలు కావాలా?… ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

నెలాఖరు కష్టాలు మీకు మొదలయ్యాయా?
మీరు ఇపుడిపుడే జీవితంలోకి అడుగుపెట్టారా. ఇరవై వేలతో ఉద్యోగంలో చేరారా. హైదరాబాద్ కు మకాం మార్చారా. అయితే, మీకు మొదట వచ్చే కష్టం బ్యాచిలర్ నెలాఖరు కష్టం.
ఇది ప్రతినెలా చివర్లో మీ జేబు తడముతూ ఉంటుంది. చికాకు పెడుతుంది. ఒక్కొక్కసారి రెండుమూడు గంటల్లో అర్జంటుగా అయిదారు వేలు, లేదా ఒక పదివేలు కావాలంటుంది. ఎలా?
ఒక నెలాఖరున అనుకోకుండా ఫ్రెండ్స్ తో కలసి ఒక మాల్ కు వెళ్లారు. అంతా కలియతిరుగుతుండగా మీకో మాంచి వస్తువు కనబడుతుంది. ధర ఏమంత ఎక్కువ కాదు, అయిదు వేలే. కాని జేబిలో డబ్బుల్లేవు. బ్యాంక్ లో కూడా లేవు. మీదగ్గిర ర ఉండేది డెబిట్ కార్డు? ఒకటి రెండు గంటల్లో డబ్బు దొరికే మార్గం ఏమిటి? స్నేహితులంతా ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు. అయినా సకాలంలో ఎవరూ అందుబాటులో లేరు?
ఇలా అపుడపుడు నెలాఖరునే అన్ని అవసరాలు వస్తుంటాయి. ,ఒక్కొక్క సారి పెద్ద మొత్తాలు కూడా అవసరమవుతూ ఉంటాయి. ఎవరూ సకాలంలో ఆదుకోలేరు. ఇలాంటి వాళ్ళందరినీ ఈ నెలాఖరు పీడిస్తూ ఉంటుంది. నెలాఖరున ఆదుకోవడానికి వచ్చే వాళ్లు చాలా తక్కువ.
నెలాఖరు కష్టాలే కాకుండా మామూలు కష్టాలు కూడా ఒక్కొక్క నెలలో ముందే వచ్చిపడతాయి. రూమ్ వోనర్ రెంట్ అర్జంటు గా కావాలనవచ్చు. ఫ్రెండ్ బర్తడేకో, పెళ్లికో మీరేదో కొనాల్సి రావచ్చు. మరో వూర్లో ఉద్యోగానికి వెళ్లిన మిత్రుడికి ఒక అయిదారు వేలు పంపాల్సి రావచ్చు. లేదా ఇంటినుంచే ఫోన్ రావచ్చు. ఫ్రెండ్స్ తో సరదాగా పార్టీ చేసుకోవలసి రావచ్చు, బట్టలు కొనాల్సి రావచ్చు. బ్యాంక్ ఇఎంఐ కావచ్చు, మీ తమ్ముడి కాలేజీ ఫీజు కావచ్చు, లేదా అనుకోకుండా  ఏదైనా బిల్లు మీద పడవచ్చు, మెడికల్ ఎమర్జన్సీ కావచ్చు.
ఇలాంటపుడు చేబదుల్లు అడగలేం. ఒక్కొక్కసారి అడిగినా క్లిక్ అవదు. బ్యాంకులు పనికిరావు. తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకునేందుకు మీ దగ్గిరేమీ లేవు, చిన్న ఉద్యోగం తప్ప…
ముఖ్యంగా ఈ తరం కుర్రవాళ్లకు ఇలాంటి సమస్యలు చాలా వస్తుంటాయి. ఇలాంటపుడు చడీ చప్పుడు లేకుండా, ఎవరినీ బతిమాలకుండా, వేళాపాళా లేకుండా రెండు మూడు గంటలో అయిదు వేల నుంంచి లక్ష దాకా అప్పిచ్చి ఒక నెలరోజుల్లో తీర్చేందుకు గడువు ఇచ్చే అసామి కావాలి. ఒ క ఫోన్ కాల్ చేస్తే అలా అకౌంట్ లో డబ్బు పడే మార్గం ఏమయినా ఉందా?
ఇలాంటి చిల్లర కష్టాలు పడి పడి, దీనికో పరిష్కారం కనుగొనాలనుకున్నారు ముగ్గురు మిత్రులు. ఆ తపన నుంచి వచ్చిందే Phocket.
Phocket మనలాంటి నవతరం కుర్రవాళ్ల  చిన్నా మొత్తాల ఆర్థికావసరాలు తీర్చే యాప్. అయితే, ప్రస్తుతానికి ఇది ఢిల్లీ, నోయిడా, గుడ్ గావ్, ఫరీదాబాద్, జైపూర్, కలకత్తా, ముంబయిలలోనేఉంది. తొందర్లోనే ఇతర నగరాలకు కూడా విస్తరించబోతున్నది.
Phocket అంటే ఏమిటి?
ఇది ఢిల్లీలోమొదలయిన ఒక స్టార్టప్ యాప్. కొత్తగా ఉద్యోగాలచేరి నవాళ్లు లేదా చిన్నచన్ని జాబ్స్  చేసుకునే వాళ్ల అర్జంట్ ఆర్థికావసరాలను తీర్చేందుకు మొదలుపెట్టిన యాప్. అంటే సింపుల్ గా ఇది షార్ట్ టర్మ్ లోన్ యాప్. అయిదు వేల రుపాయలనుంచి లక్ష రుపాలయ దాకా రోజు వారి వడ్డీ మీద రుణాలిచ్చే ఏర్పాటు. సింపుల్ గా ..చిరుద్యోగుల ఆశాదీపం.
దీన్ని రూపొందించిన వాళ్లు, పీయూష్ జైన్, సుమిత్ జైన్, మోహిత్ బన్సల్ అనే ముగ్గురు మిత్రులు.
ఉద్యోగాలు చేస్తున్నపుడు చిన్న మొత్తాలు అవసరమయి, నానాకష్టాలు పడిన అనుభవం నుంచి ఒక పరిష్కారం కనుగొనాలనుకున్నారు. అత్యవసరాలు ఎవరికయినా వస్తుంటాయి. అపుడు ఆదుకోవడానికి ఒకరు అందుబాటులో ఉండరు. ఇది అందరికీ జరిగేదే. అందుకే అలాంటివాళ్లను ఆదుకునేందుకు తక్కువ వడ్డీతో చేసిన ప్రయత్నం. విజయవంతమయింది. చివరకు నాష్దాక్ కూడా ప్రశంసించింది.
Phocket ఎలా పనిచేస్తుంది?
సింపుల్. Phocket లోన్ తీసుకోవాలనుకుంటే ముందు మీ వయసు కనీసం 20 సంవత్సరాలుండాలి. భారత పౌరుడయి ఉండాలి. నెలసరి జీతం రు. 15వేల తక్కువ కాకుండా ఉండాలి. ఈ మూడు నియమాలువర్తిస్తే మీరు లోన్ కు అప్లై చేసుకోవచ్చు.

తెలుగు కుర్రాడి కోసం అమెరికా ప్రభుత్వం మీద కేసు

phocket లోన్ కు మీకు అర్హత ఉంటే… మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం యాండ్రాయిడ్ యాప్ సౌకర్యం ఉంది, వెబ్ సైటూ ఉంది. వీళ్లడిగిన రెండు మూడు డాక్యుమెంట్లు పంపిస్తే సరి. ఈ యాప్ లో లేదా సైట్ లో లోన్ కు అప్లయి చేసేందుకు అయిదారు నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు లోన్ కోసం అప్లై చేయగానే యాప్ మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తుంది. గంట రెండు గంటల్లో మీ లోన్ ఒకె అవుతుంది.
కొత్తగా స్థాపించినా Phocket ఉరుకులు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది. కొద్ది నెలల్లోనే ఈ యాప్ ను 1,86,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పటిదాకా దాదాపు ఏడు వేల మందికి రు. 11 కోట్ల దాకా లోన్ గా పంపిణీ చేశారు. ఇందులో ఎక్కువ మంది ఒకసారి ఇందులో రుణం తీసుకున్నవాళ్లే. అంటే, Phocket సర్వీస్ బాగా ఉందని, యాప్ మీద నమ్మకం కుదిరిందనే గా అర్థం. అయిదువేల గడువు 45 రోజులు. వడ్డీ కేవలం 0.08 శాతమే. రు. 25 వే రుణానికి గడువు 30 రోజులు, వడ్డీ 0.08 శాతం.రు. 50 వేల లోన్ కు గడువు 15 రోజులు వడ్డీ 0.08 శాతం.
ఈ యాప్ సేవలు తొందర్లో హైదరాబాద్ కూ కూడా రాబోతున్నాయి.
(మీకు ఇలాంటి విజయగాథలు తెలిసిఉంటే రాసి నలుగురితో పంచుకోండి. లేదా మాకు సమాచారం ఇవ్వండి . మా ప్రతినిధులు ఆ పని చేస్తారు.trendingtelugunews@gmail.com ఫోన్ నెంబర్ 8919595528)
ఇదే టీమ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *