పాలిసెట్ ఫలితాలొచ్చాయ్, మొదటి ర్యాంకర్ సిద్దిపేట సృజన

తెలంగాణ పాలీ సెట్2019 లో స్టేట్ మొదటి ర్యాంకు సిద్ధిపేట జిల్లాకు చెందిన  మంకాల సృజన లభించింది. రెండవ ర్యాంక్ ఆరురి సాత్విక్ (సూర్యపేట జిల్లా)కు లభించింది.   తెలంగాణ పాలిసెట్ పలితాలు కొద్ది సేపటి కిందట విడుదల చేశారు.

బి.ఆర్.కె భవన్ లోని  స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ &ట్రైనింగ్ ఆఫిస్ లో  టెక్నికల్ బోర్డు కమిషనర్&చైర్మన్
నవీన్ మిట్టల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్థత 92.53 శాతం అని ప్రకటించారు.

మే మొదటి వారంలో కౌన్సిలింగ్ జరగుతుందని
జూన్ మొదట వారంలో తరగతులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.

మొత్తం 1,06,295 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో  92.53శాతం..95,850 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో  61505 బాలురకు గాను ,55933 మంది( 90.94శాతం ) ఉత్తీర్ణులయ్యారు. 42082బాలికల కు గాను 39917మంది (94.86శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *