ఇద్దరు సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు

ఈ రోజు ఇద్దరు నినియర్ మావోయిస్టులు కోటి పురుషోత్తం అలియాస్ విజయ్,  శరత్ చంద్ర,  కోటి వినోదిని అలియాస్  విజయ లక్ష్మి హైదరాబాద్   పోలీస్ కమిషనర్  ఆఫీస్ లో లొంగిపోయారు. 

ఈ సందర్భంగా పోలీసుకు కమిషర్  అంజని కుమార్ మాట్లాడుతూ  మావోయిష్టుల వివరాలు చెప్పారు.  ‘‘వీళ్లిద్దరు
సిపిఐ మావోయిస్ట పార్టీ లో చాలా కాలంగా పనిచేస్తున్నారు. టాప్ క్యాడర్ లో పురుషోత్తం ఉన్నాడు. ఇతని పై 8లక్షల రివార్డు ఉంది.
1974 పురుషోత్తం బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ ఎజుకేషన్ పూర్తి చేసి, 1987 ఎమ్ఏ చేశారు. పురుషోత్తం సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రు మరణం అనంతరం పార్టీలో చేరారు. పురుషోత్తం అంబెడ్కర్ విద్య నికేథన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేసారు. 1982లో పురుషోత్తం వినోదిని ని వివాహం చేసుకున్నాడు.
వినోదిని కూడా అడ్డగుట్ట ఏరియాలో టీచర్ గా పనిచేసే వాళ్ళు.’’

మావోయిస్టు పురుషోత్తం మాట్లాడుతూ తాము ఎందుకు లొంగిపోయామో చెప్పారు.
*  అనారోగ్యం కారణంగా మేము లొంగిపోయాము. 1975 నుంచి ఆస్తమా ఉంది.  పార్టీ నాయకత్వం అనేది సరిగ్గా లేదు. గత రెండు సంవత్సరాలుగా పార్టీలో మాకు స్థానం లేకుండా చేశారు.  సెంట్రల్ కమిటీ కూడా మా సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మావోయిస్టు గణపతి తో కలిసి చాలా సంవత్సరాలు పని చేసాము. మానవ సంబంధాలు పార్టీలో దూరం అయ్యాయి.  పార్టీలో యువత తగ్గిపోయింది. ఎంత కాలం యువత లేకుండా పార్టీని లీడ్ చేస్తాము.తెలంగాణ రావడం అనేది కూడా మా లొంగుబాటుకు ఒక కారణం.  ఎకానమీ పెరిగింది గ్రామ ప్రజలకు అనేక పథకాలు అందుతున్నాయి. రామకృష్ణ ఎదుటి వాళ్ళను పైకి రానివ్వరు.
రామకృష్ణ పార్టీలో అసమర్థుడు. ఎమ్మెల్యేలను చంపడం అనేది చాలా తప్పు

వినోదిని ఏం చెప్పారంటే…

తాము  ప్రత్యేక్షంగా దాడుల్లో ఎపుడూ  పాల్గొనలేని
నల్లమల్ల అడవులకు వెళ్లామని,  ప్రధానల కార్యక్రమాల్లో తమ పాత్రను తగ్గించారని వారు  ఆమె చెప్పారు,
మా ఆరోగ్యం  క్షీణించిన తరువాత పార్టీలో  ఎవ్వరూతమని  పట్టించుకోలేని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *