Home Breaking మనీషా, శ్రావణి మమ్మల్ని… క్షమించుండ్రమ్మా

మనీషా, శ్రావణి మమ్మల్ని… క్షమించుండ్రమ్మా

268
0
తెలంగాణలో అభం శుభం తెలియని అమ్మాయిలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు శ్రీనివాసరెడ్డి అనే దుర్మార్గుడు. ముగ్గురు అమ్మాయిలను దారుణంగా హత్య చేశాడు శ్రీనివాసరెడ్డి. ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేసి ఒక కులానికి సంబంధించిన వారినే హత్య చేశాడంటూ సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఫేస్ బుక్ లోని తన వాల్ మీద రాసిన వ్యాసం కింద ప్రచురిస్తున్నాము.
మనీషా.. శ్రావణి తెనుగిండ్లల్ల పుట్టినందుకు.. మమ్మల్ని.. క్షమించుండ్రమ్మా..
మనకు వలలిచ్చిండ్రు… ఎన్నడు ఎక్కని సీటిచ్చిండ్రు.. అందుకే మనం సారుని దూసుకపోయేటట్టు MP, MLA, సర్పంచిలను గెలిపించినం..
ఇప్పుడు MPTC, ZPTC ఎన్నికలలో కులపోల్లనే కాదుసుమా..
సార్ మనుషులను గెలిపించేందుకు.. చెట్లు పుట్టలెంబడి తిరుగుతున్నం.. మేము అతి కిరాతకంగా హత్య కావించబడ్డ మనీషా, శ్రావణి కుల బందువులం.. మీరెక్కడున్నారో అంటున్నావా మనీషా, శ్రావణి..
మేమెట్లైనా సారు దెగ్గరే ఉండాలే కాబట్కేే హైదరాబాద్లనే ఉంటాం కదమ్మా..
మాకు మీ ఊరు కూతవేటు దూరమే.. మీ ఊరు బొమ్మల రామారం మండలం హజీపూర్ అని తెలుసు, నీవు పదవ తరగతి స్పెషల్ క్లాసుల కోసం కీసర సెరినిటి స్కూల్ కు పోతున్నవని, అట్లనే మనీషా కీసర లోని కెఎల్ఆర్ కాలేజీలో బికాం సదువుతున్నదని కూడా తెలుసు. మీ పాశవిక హత్యల గురిచి మస్తు సుపిస్తుండ్రుగదా మీడియోల్లు.. మా మెడల సింహాల గాండ్రింపు కండువాలేసుకొని మీ అమ్మా, నాయినలని అర్స్కరమ్మంటున్నారా తల్లీ మనీషా, శ్రావణి..
********
సారీ మనీషా, శ్రావణి. .
మీ పిచ్చిగని..
మీ కులపోల్లం..
సార్ కోసం బిజీగ ఉన్నామమ్మా..
అయినా ఏందమ్మా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను తెచ్చెదాక మీ శవాన్ని తీసేదిలేదని నీకులపోల్ల కంటే ఎక్కువ కులపోల్ల నించి మెుదలు సిందోల్ల దాక కలిసోచ్చిండ్రు కదమ్మా..
మల్లోక్కసారి మీరు సచ్చి పోలీసులకు వణుకు పుట్టించినర్ కదమ్మా..
హజీపూర్.. ఉత్తర తెలంగాణ పల్లోలె లెక్క కనిపిందని అడిషనల్ డిజిపి స్థాయి పోలీస్ ఆఫీసర్ నీ సావాయేదాక ఉండేకదమ్మా..
ఇంకెందుకమ్మా తెనుగుదెర్కలోల్లు..
చెప్పు తల్లి చెప్పు.. మమ్ముల్ని సార్ కు సేవజేస్కొనివ్వ్..
నీ అయ్య అవ్వలని అర్సుకుంటే ఏమెస్తది… పొయ్యిన మీరు రారుగదా.. మీ సావు మీరు సచ్చినరు గదా..
ఇప్పుడిప్పుడే చాపలని సూస్తున్నం.. నిన్న మెున్ననే గంగమ్మని చెర్లలకు తెస్తున్నరని ముర్సుతున్నం… మమ్ములని రమ్మనకుండ్రి.. .
ప్లీజ్
రోజు మీ సావు వార్తలు పేపర్ల తప్పకుండ సుస్తున్నంగదా…
ఇంత మెుత్తుకుంటున్నరుగదమ్మా..
సరే..
ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా మనీషా, శ్రావణి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రేపు పేపర్ స్టేట్ మెంట్ ఇస్తం తియ్య్..
గంతెందుకమ్మా మీ ఊరోల్ల జమగూడును సూసి మీవాల్లని కలిసేందుకే మీ ఎంపీ, ఎమ్మెల్యేలే దడ్సుకుంటున్నారుకదా..
ఇంకెందుకమ్మా.. నీ కులపోల్లు..
మనిషన్న వాల్లమని మరిచినోల్లం తల్లులూ…
(సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here