కెసిఆర్ మీద కోపం… సరూర్ నగర్ ఎమ్మార్వో ఏంచేశారో చూడండి (వీడియో)

ఎవ్వరికీ అనుమానం లేదు, రాష్ట్రంలో రెవిన్యూ శాఖ అవినీతి కంపుకొడుతూ ఉందని. ఇప్పుడేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెవిన్యూ శాఖ కంపుకంపే. 1997లో ఒక సారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇంటర్నల్ సర్వే చేయించి, రాష్ట్రంలో ఏ శాఖలలో అవినీతి ఎక్కువగా ఉందో జాబితా తయారుచేశారు.అందులో కూడా రెవిన్యూ శాఖ, విద్యుత్ శాఖలు ముందున్నాయి. ఈ నివేదికను చంద్రబాబు నాయుడు ఢిల్లీలో   లీడర్సిప్ కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చి చెప్పారు. ఈ విషయం మీడియాలోరాగానే యూనియన్ నాయకులు ఆమరణ నిరహార దీక్షకు కూర్చున్నారు.

అదే అవినీతి ఇంకా కొనసాగుతూ ఉంది తెలంగాణ వచ్చాక కూడా. దీనికొక విరుగుడు కనిపెట్లాలనుకున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఇదొక మాంచి సంస్కరణ అని పేరొచ్చింది. జనాల్లో సంతోషం వ్యక్తమయింది.సర్వత్రా చప్పట్లు కొట్టారు.

అయితే, ఇక రెవిన్యూ డిపార్ట్ మెంటు మూసేస్తారని వార్తలు రావడంతో కొంతమందినాయకులు నిరసన తెలిపారు. ప్రజలెవరూ పట్టించుకోలేదు.

మరికొంతమంది అధికారులు ‘ మేం మారాం, మా ఆఫీసులో అవినీతి లేదు,’ బోర్డు తగిలించి ముఖ్యమంత్రి ప్రశంసలందుకోవాలని చూశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్  లోని సరూర్ నగర్ (రంగారెడ్డి జిల్లా) మండలాఫీసు వాళ్లు ముఖ్యమంత్రి మీద కోపం ప్రజల మీద చూపిస్తున్నారు.

ప్రజలు క్యాస్టు సర్టిఫికేట్ కోసం, ఇన్ కం సర్టి ఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే వాటిని ఏదో సాకుతో రిజెక్టు చేస్తున్నారు.  వాటిని అక్షరాల చెత్తకుప్పలోపడేస్తున్నారు. దరఖాస్తు చేసిన వాళ్లు వాకబు చేస్త, రిజక్టయిన దరఖాస్తులను వాపసు ఇవ్వడానికి బదులు లేవని చెబుతున్నారు. చాలా మంది వీటికి సపోర్టింగ్ డ్యాక్యుమెంట్లు ఒరిజినల్స్ జత చేశారు. అయినాసరే కొన్నింటిని చించిపడేశారు. కొన్నింటిని  చెత్తబుట్లలో పడేశారు.

ఇపుడు అడ్మిషన్ కాలం. పిల్లలకు క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికేట్ లు అవసరం. అయినా సరే, ముఖ్యమంత్రి మీద కోపంతో సరూర్ నగర్ మండలాఫీసు వాళ్లు సర్టిఫికేట్ లు జారీ చేయడం లేదు. తల్లి తండ్రలు వచ్చి వాకబు చేస్త రిజక్టు అయ్యాయయని, అప్లికేషన్ కనిపించడం లేదని చెబుతున్నారు.

ఈ రోజు ఒక మదర్ వచ్చిఈ జవాబు విని ఆందోళన కు గురయింది. ఈ దరాఖాస్తులను పడేశారేమో అని ఆఫీసు వెనక చెత్త కుప్పలో వెదికేందుకు వెళ్లింది. అక్కడ ఆమె అనేక దరఖాస్తులు, ఇతర ఒరిజినల్ సపోర్టింగ్ డాక్యమెంట్సతో సహా పడివుండటం చూసి అవాక్కయింది. ఆమె ఆరు దరఖాస్తులను తీసుకుని చూపించింది. ఇది పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కాదా అని ప్రశ్నిస్తుంది. సెన్సిటివ్ గా ఉండే పిలల్లు క్యాస్ సర్టిఫికెట్ రాక, ఇన్ సర్టిఫికేట్ దొరకక, అడ్మిషన్ లు లేదా ఉద్యోగాలు రాకపోతే, ఆత్మహత్యలు చేసుకుంటారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ఏంటున్నారో వినండి.

 

Read Also 

కాంగ్రెస్ తో కెసిఆర్ మళ్లీ దోస్తి, కుమారస్వామి దౌత్యం: ఇండియన్ ఎక్స్ ప్రెస్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *