16 సీట్లు ఇస్తే కేసీఆర్ పండ్లు తోముతాడా ? రేవంత్ ఫైర్

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రేవంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే…

“నేనసలు లోక్ సభకు పోటి చేయాలనుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది నిలబడాలని కోరారు.  నేను సబితా ఇంద్రారెడ్డి అక్కని, సుధీర్ రెడ్డిలని కూడా అడిగాను. వారు నిలబడాలని కోరారు. కానీ దుర్మార్గంగా వారు పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. బంధువులంతా వెన్నంటి ఉంటామన్నారు. అప్పుడే నేను ముందుకు వచ్చాను. కూన శ్రీశైలం అన్న కూడా నాకే మద్దతు పలికారు.

టిఆర్ఎస్ పార్టీకి, నాయకులకు కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. అందరిని కొనుగోలు చేసుకుంటూ పోతే ప్రశ్నించేది ఎవరు. ఫిరాయింపులకు అడ్డుకట్టపడాలి. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే. 16 సీట్లు ఇస్తే కేసీఆర్ ఢిల్లిలో ఏం చేస్తారు. గాడిద పళ్లు తోముతాడా.మల్కాజ్ గిరి నియోజకవర్గం చాలా పెద్దది. ఇక్కడ అన్ని రాష్ట్రాల ఓటర్లు ఉన్నారు.

వ్యాపారులు వస్తే పార్లమెంటులో ఏం మాట్లాడుతారు. 16 మంది లోక్ సభ సభ్యులతో విభజన సమస్యలు పరిష్కారం అవుతాయా.. కేసీఆర్ కి ఈ ఎన్నికలతో సంబంధం లేదు. ఆయన గెలిచినా ఓడినా చేసేదేం లేదు. ఎన్నికలు ఇప్పుడు ఉంటే ఆయన జాతీయ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు. గట్టి నాయకుడిని గెలిపిస్తేనే మల్కాజ్ గిరి సమస్యలు పరిష్కారమవుతాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

మీరు మొస్తే వచ్చేవాళ్లం.. మీరు మోయలేక కింద పడేస్తే అక్కడే ఉంటాం. కార్యకర్తలే కీలకం. బూతు స్థాయిలో బలోపేతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ కలిసి చర్చకు తీసుకు రావాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఏంటో తెలియ చెప్పాలి.పార్టీ మారిన వారు బెదిరిస్తున్నారట. ఇబ్బంది పడకండి. మీ దరిన మీరు వెళ్లండి.

కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. కాంగ్రెస్ ఎలా ఖాళీ అవుతుంది. చెట్టంత కొడుకులను పెంచి పోషిస్తే అమ్ముడు పోయారు. ఎవరికైనా బాధ ఉంటది. ప్రస్తుత పరిస్థితుల్లో సైనికుడిలా పోరాటం చేస్తా. మీరంతా నా వెంట ఉంటే ఏదైనా సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీతో గోక్కున్న ఎవరు కూడా బాగుపడలేదు. మంగళవారం ఎల్బీ నగర్ లో కార్యకర్తల సమావేశం ఉంది. 22 వ తారీఖు నాడు నామినేషన్ వేస్తున్నా. ఆశీర్వదించండి”. అని రేవంత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *