కెసిఆర్ మీద రేవంత్ షాకింగ్ అరోపణలు

తెలంగాణా ఐటి మంత్రి కెటి రామారావు  ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీతో రహస్యంగా నాలుగు గంటల పాటు సమాలోనలు జరిపారా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అవునంటున్నారు. ఇదంతా ఓల్డ్ సిటికి మెట్రోను  తమ కుటుంబానికి మిత్రులకు లాభసాటిగా ఎలా తీసుకువెళ్లాలని  చర్చించేందుకు  ఈ సమావేశం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా రేవంత్  గతంతో మెట్రోరైల్  నిర్మాణాన్ని ఆపేందుకు కెసిఆర్ ఎలా ప్రయత్నించారో వివరించారు.

ఈరోజు రేవంత్ రెడ్డి  విలేకరులతో మాట్లాడుతూ  ఈ వివరాలు వెల్లడించారు.  రేవంత్ చెప్పిన మరిన్ని విశేషాలు:

అసెంబ్లీ,అమరవీరుల స్తూపం,సుల్తాన్ బజార్,ఓల్డ్ సిటీ ,పురాతన కట్టడాల ప్రాంతాల్లో ఆపడానికి ప్రయత్నం చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి  చెప్పారు. అయితే,  అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ పక్కనపెట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రామేశ్వర్ రావు ఆస్తులను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పారు.

 ఇప్పుడు ఇంతకు ముందు నిర్ణయించిన ఫలక్ నామ టు ఎయిర్ పోర్ట్ వరకు కాదని రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు  అని కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చాడు.ఇదంతా రామేశ్వర్రావు ఆస్తులు పెంచే కార్యక్రమం.

మార్కెట్లో మొత్తం 1200 కోట్ల విలువైన వాటాలను  ఎల్ అండ్ టి  కంపెనీ నుండి కేసీఆర్ కుటుంబానికి చెందిన బినామీ కంపెనీలు 215 కోట్లకు కొనుగోలు చేశాయి.ఈ విషయాలపై  ఒక కమిటీ ద్వారా విచారణ చేయించాలి. అందుకే కల్వకుంట్ల కేసీఆర్ మీదా వారి ఫామిలీ మీద స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నా.

 సామాన్య ప్రజలకు అవసరం లేని విధంగా  ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మెట్రో నిర్మాణం జరిగితే ప్రజలపై ,తీవ్ర భారం పడుతుంది.కేసీఆర్ కుటుంబం ధన  దాహంతో ఇలాంటి పనులకు తెర తీస్తుంది. మెట్రో పేరిట జరిగిన అక్రమాలపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలి.

 ఓల్డ్ సిటీ ప్రజల సౌకర్యం కోసం మొదలు పెట్టాలనుకుంటున్న మెట్రో రైల్ నిర్మాణం అడ్డుకొని ,కేసీఆర్ బంధువులకు లాభం చేకూర్చే విధంగా మరో రూట్ ముందుకు తీసుకు వచ్చారు. దీనికోసమే అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్ రహస్యంగా 4 గంటలు చర్చలు జరిపారు.

 గతంలో మెట్రో లో అవినీతి జరిగిందని కేసీఆర్ నాటి ప్రభుత్వం పై విమర్శలు చేసింది నిజం కాదా?

 

*సుల్తాన్ బజార్ లో డిజైన్ మార్చాలన్నది నిజం కాదా

* పురాతన సంపద పేరుతో అప్పుడు ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ..అధికారంలోకి వచ్చాక పాత డిజైన్ ఎందుకు ఓకే చెప్పారు .?

 *హైటెక్స్ లో 52ఎకరాలు .డిలైట్ బిల్డింగ్ ,విజయవాడ లో ఎయిర్ పోర్ట్ ముందు 31ఎకరాల ,వైజాగ్  లో 2ఎకరాల భూములను హైటెక్స్ బిల్డింగ్ లో 15వేల sft ఎల్ అండ్ టీ నుండి కేసీఆర్ బినామీలు 215కోట్ల స్వంతం చేసుకున్నారు *

 *12వందల కోట్ల ఆస్తులు ఎల్ అండ్ టీ నుండి కేసీఆర్ బినామీ కంపెనీకి బదలాయింపు జరిగాకనే కేసీఆర్ పాత మెట్రో డిజైన్ కు ఓకే చెప్పారు *

 *మెట్రోలో కేసీఆర్ అవినీతి పై విచారణ జరిపించాలి *

 *కేసీఆర్ ధన దాహం తో మెట్రోలో ఉండే ప్రభుత్వ వాటాను కూడా అమ్మేయాలనే కుట్ర జరుగుతుంది

 **కేసీఆర్ అండ్ ఫామిలీ పై ఎల్ అండ్ టీ ఆస్తులను బలవంతంగా రాసించుకున్నది వాస్తవం

*హెచ్ఎండి ఆస్తులను అమ్మి మైహోం జూపల్లి కోసం రాయదుర్గం మెట్రోను నిర్మించాల్సిన అవసరం ఉంది

 *నా ఆరోపణలపై స్పందించకుండా తేలుకుట్టిన దొంగలు మౌనంగా ఉన్నారు*

 *స్పందిస్తే నిజాలు బయట పడతాయనే సీఎం ,మంత్రులు మాట్లాడటం లేదు

 *కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికి  తెలంగాణ రాలేదు *

 *ప్రభుత్వం చెబుతున్న తప్పుడు వాదనలు చేయలేకనే ఏజీ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేశారు *

 *మెట్రో లో కేసీఆర్ అవినీతి అనుకూలంగా ఉన్నందుకే ఆంధ్ర కు చెందిన ఎంవిఎస్ రెడ్డి ని మెట్రోకు శాశ్విత ఎండిగా నియమించారు *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *