రాయలసీమ కడప డిక్లరేషన్… హోదా వల్ల ఒరిగేదేమీ లేదు

రాయలసీమ డిక్లరేషన్

రాయలసీమ మౌలిక సమస్యల పరిష్కరించకుండా సీమ ప్రజలలో వెలుగులు నింపడం సాద్యం కాదని రాయలసీమ ఉద్యమ సంస్థలు నమ్ముతున్నాయి. 15-04-2018 కడపలో జరిగిన రాయలసీమ ఉద్యమ సంస్థల ఉమ్మడి సమావేశం ఏకగ్రీవంగా ఈ క్రింది తీర్మాణాన్ని ఆమోదించింది.
ఒక దేశం అయినా , రాష్ట్రం అయినా ఒకే అభివృద్ది నమూనాతో సమగ్రంగా అభివృద్ది సాదించలేవు- చివరకు అది ఒక కుటుంబం అయినా కూడా. బలవంతంగా పాలకులు అమలు చేస్తే అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే లాభం చేకూరుతుంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి నేడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలకులు అనుసరించిన అభివృద్ది నమూనా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలయిన రాయలసీమ, ఉత్తరాంధ్రలు తీవ్ర నష్టానికి గురి అయినాయి. విడిపోయిన తర్వాత అబివృద్ధఇ వికేంద్రీకరణ అని మాటలు చెప్పిన పాలకులు మాట తప్పినారు. అందుకు ఉదా.. మన ముఖ్యమంత్రి గారు తనకు రెండు కల్లు అమరావతి, పోలవరం అని ప్రటించడమే. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు కూడా అబివృద్దిని వికేంద్రీకరించాలని ఒక వైపు మాట్లాడుతూనే ఉన్న నిధులలో ప్రాధాన్యతలవారిగా మొదటి సీమకు కేటాయించమని అడగడం మాని సాధ్యం కాని డిమాండ్లులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. నేడు సీమ పట్ల వివక్షచూపుతున్న అధికార, విపక్ష పార్టీల వైఖరిని సమావేశం ఖండిస్తున్నది.
అమ్మా పెట్టదు అడుక్కుతిననీయదు అన్నట్లుగా ఉంది నేటి రాజకీయ పరిస్థితి. రాష్ట్రం తమ ప్రాధాన్యత అంశంగా మధ్య కోస్తాను ఎంపిక చేసుకున్నది. గుడ్డిలో మెల్ల అన్నట్లు రాయలసీమకు అంతో ఇంతో అబివృధ్ధకి అవకాశం ఉన్న విభజన చట్టం అమలు డిమాండ్ చేయకుండా చట్టంలో లేని హోదా చుట్టూ రాజకీయ ఆందోళనలుచేయడం రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడమే కాదు అంతిమంగా రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం చేసినట్లే.

రాయలసీమ డిక్లరేషన్ చేసిన బిజెపి తన నిజాయితీని నిరూపించుకోవాలి…
రాయలసీమ సమస్యలపై కర్నూలు వేదికగా బీ జే పీ సీమ డిక్లరేషన్ ను ప్రకటించింది. వారి రాజకీయ విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నా సీమ ఉద్యమ సంస్థలు వారి డిక్లరేషన్ ను స్వాగతిస్తున్నాము. కానీ నెలలు గడుస్తున్నా ఇంత వరకు వారి పార్టీ అధినాయకత్వం ఇంత వరకు తమ విధానంగా ప్రకటించకపోవడంపై సీమ బిజెపి నేతలు వివరణ ఇవ్వాలి. తక్షణం బీజేపీ విబజన చట్టం పరిధిలో ఉన్న కడప ఉక్కు, గుతకల్లుకు రైల్వేజోన్, నంద్యాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనంతకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చట్టం మేరకు మన్నవరం, గాలేరు నగరి, హంద్రీ నీవా కు నిదులను విడుదల చేయాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతల అబివృద్ది నిదుల క్రింద సీమ వాటాని మొదట తేల్చి కాలపరిమిత నిర్ణయించిన తర్వాత నిధులను విడుదల చేయాలి. ప్రథమంగా తన బాధ్యతను నిర్వహించి అటు పిమ్మట రాష్ట్రం పై పోరాడాలి తక్షణం బీ జే పీ తన వైఖరిని వెల్లడించాలని సమావేశం డిమాండు చేసింది.

పార్టీలు తమ హోదా కోసం చేస్తున్న ప్రత్యేక హోదా  రాజకీయ ఉద్యమానికి రాయలసీమ ప్రజల దూరంగా ఉండాలి.

విభజన సందర్భంగా కేంద్రం రాష్ట్రానికి రెండు హమీలు ఇచ్చింది. ఒకటి చట్టబద్ధంగా విభజన చట్టం, రెండు రాజకీయ హమీగా హోదా. అందువల్ల రెండింటిని అమలుచేయాలని అడిగే నైతిక హక్కు ఏపీ ప్రజలకు ఉంది. విభజన చట్టం అమలులో కాలయాపన చేయడం తప్ప నిరాకరించే అధికారం కేంద్రానికి లేదు. అదే హోదా విషయంలో మాత్రం సులభంగానే నిరాకరించినది. హమీ ఇచ్చి మోసం చేసిన బీ జే పీ ని ఏపి ప్రజలు తమకు అవకాశం వచ్చినపుడు రాజకీయంగా తిరస్కరించాలి. కేంద్రం హోదాను ఇవ్వలేమని చెప్పిన తర్వాత ప్రజలకు ఉన్న అవకాశం కేవలం అధికార బీ జే పీ ని రాజకీయంగా తిరస్కరించడమే. అది కూడా 2019 ఎన్నికలలో మాత్రమే. హక్కుగా ఉన్న విభజన చట్టం అమలుకు మొదటి నుంచి ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే నేటికే మంచి పలితాలు వచ్చి ఉండేది. కానీ హక్కును గాలికి వదిలి రాజకీయ ప్రయోజనాల కోసం హోదా ఉద్యమాన్ని నడుపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలది ఒకటే దారికావడం దరదృష్టం. పోవవరం,రాజధానికి నిధులు, రైల్వేజోన్, కోస్ట ల్ కారిడార్, 12 విద్యాసంస్థలు, రాయలసీమ, ఉత్తరాంద్ర అభివృద్ది నిధులు, కడప ఉక్కు, మన్నవరం, ఉత్తరాం ధ్ర, రాయలసీమ నీటి ప్రాజెక్టులకు నిధులు, దుగిరాజ పట్నం ఓడ రేవు. హైదరాబాదులో ఉమ్మడి సంస్థలలో వాటా లాంటివి 10 సంవత్సరాలలో పూర్తి చేయాలి. దాదాపు వాటి విలువ 6 లక్షల కోట్లు పైమాటే. ఇంతటి విలువైన హక్కుగా ఉన్న అంశాలను వదలి హమీగా ఉన్న హోదాను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలకు ఉపయోగపడే రాజకీయ హోదా ఉద్యమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సీమ డిక్లరేషన్ విజ్ణప్తి చేస్తుంది.

రాయలసీమ భవితవ్యం ప్రమాదంలోకి…

విభజన జరగడం ఖాయం అని తెలిసినా సీమకు ఏమి అవసరం అన్న విషయం పక్కన పెట్టిన కారణంగా విభజన చట్టంలో దుమ్మగూడెం టెయిల్ పాండును చేర్చుకోలేక పోయినాము. విభజన చట్టం అమలు జరగాల్సిన సమయంలో వాటి కోసం ప్రయత్నించ కుండా రాని, వచ్చినా సీమకు ఉపయోగపడని హోదా ఉద్యమాన్ని సీమ ప్రజలపై బలవంతంగా పార్టీలు రుద్దుతున్నాయి. సహజంగా పోరాట గుణం ఉన్న సీమప్రజలు తమ అభిమాన నేతల మాటలు నమ్మి నాడు, నేడు మోసపోయినారు.

విభజన చట్టం అమలు చేయడం అంటే కడప ఉక్కు, గుంతకల్లుకు రైల్వేజోన్, అనంతకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, నంద్యాలకు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం వలన మన్నవరం, గాలేరు నగరి, హంద్రీ నీవా లకు నిధులు, సీమ మొత్తానికి అభివృద్ది నిధులు, సీమకు ఆనుకుని దుగిరాజ పట్నం ఓడరేవు ఇలా అన్నీ చట్టంగా వచ్చిన హక్కులు అమలు కావాలి. దాదాపు వీటి విలువ 2 లక్షల కోట్లు. కేంద్రం సైతం నిరాకరించడానికి వీలు కాని విషయాలు. కానీ వీటి అమలు కోసం ప్రభుత్వం, పార్టీలు కృషి చేయకపోవడం వలన రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పడం, ఉన్న రాష్ట్ట్రాలలో కూడా అమలు తీరు దారుణంగా ఉండటం వలన హోదా కోసం ప్రయత్నించడం వృధానే. మరో వైపు రాయలసీమలో మౌలిక వసతులు లేని కారణంగా హోదా వచ్చినా పరిశ్రమలు రావు. అదే విభజన చట్టం అమలు అయితే సీమకు విలువైన సంస్థలు అందులోను కేంద్రప్రభుత్వం సంస్థలు రావడం వలన మౌలిక వసతులు ఏర్పడుతాయి. పార్టీల హోదాను పెంచేందుకు పనికొచ్చే రాజకీయ హోదా ఉద్యమానికి దూరంగా ఉండాలని సీమ ప్రజలకు ఈ డిక్లరేషన్ విజ్ణప్తి చేస్తుంది. రాయలసీమ ప్రజల హోదాను పెంచే విభజన చట్టం అమలు కోసం జరిగే ప్రయత్నంలో బాగస్వాములు కావాలని రాయలసీమ డిక్లరేషన్ కోరుతుంది.

-పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *