నీళ్ల కోసం మండుటెండలో రాయలసీమ రైతుల పాదయాత్ర

* మండుటెండను లెక్క చేయకుండా పాదయాత్ర గా కదిలిన రైతులు..

* వేలాది మంది రైతన్నలతో ప్రారంభమైన ” సిద్దేశ్వరం అలుగు ప్రజా పాదయాత్ర..

* జెండా ఊపి పాదయాత్ర ను ప్రారంభించిన తెలంగాణా, కృష్ణా జిల్లా,ప్రకాశం జిల్లా నాయకులు..

నంద్యాల: రాయలసీమ నాలుగు జిల్లాలకు కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం సీమ రైతాంగం కదిలింది.

మంగళవారం నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నుంచి సిద్దేశ్వర అలుగు సాధన కోసం నాలుగు రోజుల ప్రజా పాదయాత్ర ప్రారంభమయింది. యాత్రను తెలంగాణ రాష్ట్ర రైతు నాయకులు, RDS మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య కృష్ణా జిల్లా అధ్యక్షులు వేణుగోపాల రావు, ప్రకాశం జిల్లా రైతు నాయకులు తిరుపతి రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే సిద్దేశ్వర అలుగు నిర్మాణానికి పూనుకోవాలని  యాత్రలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రోళ్ళు పగులకొట్టే రోహిణీ కార్తెలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత ను లెక్కచేయకుండా రాయలసీమ రైతు బిడ్డలు ప్రజా పాదయాత్ర లో పాల్గొనడం గర్వంగా వుందని అన్నారు.

సిద్దేశ్వరం అలుగు నిర్మించి తెలంగాణ లోని దక్షిణ ప్రాంతం, రాయలసీమ లోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, త్రాగునీటి కష్టాలు తొలగించాలని ఆయన అన్నారు.

రాయలసీమ ప్రాంతంలో ఒక తడికి నీరందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి సీమ రైతాంగం ఆత్మహత్యలకు,వలసలకు గురవుతోందని పేర్కొన్నారు.

దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు ను చేపట్టి ఆ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టు కు నీరందించి తద్వారా శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ కు మళ్ళించాలి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ లో రాజధాని లేదా హైకోర్టు ను నిర్మించాలని కోరారు.

అమరావతిని ఫ్రీజోన్ చేయాలి. విద్య,వైద్యం, పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయాలి.తుంగభద్ర వరద జలాలను వినియోగించుకునే సమాంతర కాలువ కోసం కర్నాటక ప్రభుత్వం తో చర్చలు జరుపాలి. రాయలసీమ ప్రాంతం జీవన హక్కుల సంరక్షణ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కోరారు ‌.

పాదయాత్ర కొనసాగే మార్గంలోని ఆయా గ్రామాల రైతులు పెద్దఎత్తున గ్రామం మొదటికి వచ్చి ఘనస్వాగతం పలికి పక్క గ్రామం వరకు పాదయాత్ర లో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఊరూరా రైతులు గ్రామాలలో మజ్జిగ, మంచినీరు, భోజన వసతులను కల్పించారు.

కొందరు రైతులు ఎనిమిది పదుల వయస్సులో భానుడి భగభగలను లెక్కచేయకుండా పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ పాదయాత్ర లో అనంతపురం జిల్లా నుంచి జలసాధన సమితి నాయకులు రామ్ కుమార్, రామకృష్ణ, రైతు కూలీ సంఘం ఇండ్ల ప్రభాకరరెడ్డి, రాయలసీమ సాహిత్య, సాంస్కృతిక సంఘం నాయకులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి,రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు అరుణ్, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు రత్నం ఏసేఫు, కడప జిల్లా విప్లవ రచయితల సంఘం నాయకులు వరలక్ష్మి,రాయలసీమ కార్మిక, కర్షక సమితి నాయకులు నాగిరెడ్డి, K.C.కెనాల్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ చంద్రమౌళీశ్వర రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు రామకృష్ణా రెడ్డి, కామిని వేణుగోపాల రెడ్డి, నాగార్జున రెడ్డి,, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నాగలక్ష్మి, నంద్యాల బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శీలం ఓబులరెడ్డి, ఇండియన్ మొదటి అసోసియేషన్ నాయకులు డాక్టర్ హరినాథరెడ్డి,భగత్ సింగ్ గ్రంథాలయం ట్రస్డ్ చైర్మన్ శంకరయ్య, B.C. సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు,AP రైతుసంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, నందిరైతు సమాఖ్య,BJP, కాంగ్రెసు, CPM, CPI, PDSU,RSF, RUF, తదితర సంఘాల ప్రతినిధులు, పార్టీ ల ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *