Home English రాయలసీమ పార్టీల కేమయింది, అన్యాయం పట్టించుకోరా?

రాయలసీమ పార్టీల కేమయింది, అన్యాయం పట్టించుకోరా?

179
0

అసలే, రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కావడం లేదు. దానికి ఇపుడు రాయలసీమ వాసులకు ఉద్యోగావకాశాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జోనల్ పద్ధతిలో జరపాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల నియామకాలను రాష్ట్రమంతా యూనిట్ గా తీసుకోవాలని మెమో జారీ చేసింది.  ఇంకే ముంది, కోస్తావాళ్లే కొట్టకు పోతారు. ఇప్పటికే వేల సంఖ్యలో తాత్కాలిక నియామకాల పేరుతో రాజధాని లో భారీగా నియమాకాలు జరిగాయి. ఇందులో రాయలసీమ వాసులకు మొండిచేయిచూపించారు. ఇపుటి టిటిడి మెమో వచ్చింది. ఇదంతా రాయలసీమ ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడిగా కనిపిస్తుంది.

రాయలసీమ విభజన హామీలు అమలు జరగక పోవడానికి కారణం విధాన నిర్ణయం తీసుకోవాల్సిన రాజకీయ పార్టీలు తమ అజెండాలలో సీమ ప్రజలకు చోటు లేకపోవడమే కారణం. ఇదే టిటిడి ఉద్యోగాలకు పట్టరాదు.  జోనల్ పద్దతి లో కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ గా చేసుకుని  మునుపటి లాగే టిటిడి నియామకాలు నిర్వహించాలని మెమో జారీ చేయడానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం , రాయలసీమ అధ్యయనాల సంస్థ టిటిడిలో నియమకాలను సమావేశం నిర్వహించింది.ఈ సమావేశం సారాంశం ఇది.

రాజకీయ పోరాటమే మార్గం.

రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్య రాజకీయ పార్టీలు చేసిన విధానాల కారణంగా ఏర్పడినవే కనుకే రాజకీయ పరిస్కారం ద్వారానే వాటికి పరిస్కారం సాధ్యం. రాజ్యాంగ నియమాలు , అమలులో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగినపుడు మాత్రమే న్యాయస్తానల ద్వారా పరిస్కారం చేసుకోవచ్చు. కానీ నేడు ప్రభుత్వం చేస్తున్న విధాన నిర్ణయాల వలనే రాయలసీమ కు నష్టం జరిగింది , జరుగుతొంది స్వయంప్రతిపత్తి కలిగిన టిటిడిలో నియామకాలను ఎలా నిర్వహించాలి అన్న విషయం పై సంస్థ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. ఏ పరిధిలో వారిని తీసుకోవాలి అన్న విషయంలో టిటిడి నిర్ణయానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ టిటిడి పాలక మండలి నియామకం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అందుకే అధికార పార్టీ వైఖరి ఇక్కడ కీలకంగా ఉంటుంది.

రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటే సీమ ప్రజలకు నష్టం

నీరు , ఆర్థిక వనరుల పై ఆధిపత్యం కలిగి ఉన్న మధ్య కోస్తా జిల్లాల ప్రజలతో పోటీపడటం వెనుకబడిన రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజలకు కష్టం. టిటిడిలో 2011 ప్రాంతంలో రాష్ట్రం యూనిట్ గా జరిగిన నియమకాలలో సీమకు దక్కింది15 శాతం మాత్రమే. తిరుపతిలోనే 120 జీఓ ప్రాతిపదికన పద్మావతి మెడికల్ కళాశాలలో జరిగిన అడ్మిషన్లలలో కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది. అందుకే టిటిడి నియమకాలలో జోనల్ పద్దతిలో జరగడమే రాయలసీమకు ప్రయోజనం.

120 జీఓ తరహా పోరాటమే మార్గం…

పద్మావతి మెడికల్ సీట్లను 120 జీఓ ద్వారా రాష్ట్రాన్ని యూనిట్ గా చేసుకుని అడ్మిషన్లు చేసినప్పుడు తల్లిదండ్రులు సుప్రీం కోర్టు వరకు వెళ్లి జీఓను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రతి సందర్భంలో సీమకు వ్యతిరేకంగా నిలబడింది. నేడు టిటిడి నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహారం చేస్తోంది అనుకోవడం అత్యాశ అవుతుంది. జీఓ120 రాష్ట్రపతి ఆదేశాలకు వ్యతిరేకం కనుక మనం కోర్టులు ద్వారా విజయం సాధించాం. టిటిడి స్వయంప్రతిపత్తి సంస్థ కనుక కోర్టుల ద్వారానే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం గతంలో లాగే వ్యవహారం నడిపితే సీమకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలను నిలదిస్తూ రాయలసీమ ఉద్యమాన్ని120 జీఓ వ్యతిరేక ఉద్యమం లాగా స్వతంత్రంగా నడపగలిగితే పార్టీలపై వత్తిడి పెరిగి ఎన్నికల సమయం కనుక రాజకీయ నిర్ణయం సీమకు అనుకూలంగా మారక తప్పదు. రాజకీయ పార్టీ అధినేతలు పట్టించుకోకుండా ఆయా పార్టీ స్థానిక నేతలు ఉద్యమంలో ఉంటే సీమ ప్రజలకు ఆయా పార్టీల మీద కోపం రాదు ఫలితంగా అధినేతల మధ్య కోస్తా అనుకూల వైఖరి వల్ల సమస్య పరిష్కారం కాదు. అధినేతల వైఖరి చెప్పని రాజకీయ నాయకులకు దూరంగా రాయలసీమ ఉద్యమం జరిగితే అపుడు ఎన్నికల అవసరాల కోసం అయినా తమ అధినేత పై వత్తిడి తీసుకు వస్తారు అన్నది 120 జీఓ వ్యతిరేక ఉద్యమం మనకు నేర్పిన పాఠం. ఆవైపు రాయలసీమ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత రాయలసీమ ఉద్యమ సంస్థల బాధ్యత.

మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here