Home Breaking ప్రొఫెసర్ కోదండరామ్ హౌస్ అరెస్ట్ (వీడియో)

ప్రొఫెసర్ కోదండరామ్ హౌస్ అరెస్ట్ (వీడియో)

254
0
తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్ ను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. ఆయన ఇంటర్ బోర్డు వద్ద జరగనున్న ప్రతిపక్షాల ధర్నాకు నాయకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఈ మహానిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఆయన మీద గృహనిర్బంధం ఆంక్షలు విధించారు.
ఫ్రొఫెసర్ మీద ఇలాంటి నిర్బంధం కొత్త కాదు. గతంలో కూడా విధించారు.  కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంటర్ బోర్డు  అవకతవకలు కొంత పుంతలు తొక్కాయి. గ్లోబరీనా సంస్థ ఎలా ఇంటర్ బోర్డులోకి ప్రవేశించిందో, దీని వెనక ఎవరున్నారో  కనుక్కునేందుకు  ఫ్రొఫెసర్ ధర్నా దారి తీసే ప్రమాదం ఉంది. ధర్నా మహా ధర్నా అయి, ఆపైన ఉమ్మడి ప్రతిపక్ష ఉద్యమంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అపుడు గ్లోబరీనా సంస్థ బోర్డులోకి ఎలా దూరిందో పాదముద్రలు, వేలి ముద్రలు కనబడతాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులేమిటనేది దర్యాప్తు చేస్తే చాలా కీలకమయిన అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక తెలంగాణలో ఈ ఉపద్రవం ఏమిటి, ఈ కడుపు కోతకు కారణం  ఏమిటి?
ఆ రోజు ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేస్తే ఇపుడు ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం నిర్షక్ష్యానికి విద్యార్థులు బలవుతున్నారు.
ఇప్పటిదాకా  23 మంది చనిపోయినట్లు సమాచారం. దీనిని ఆధారంగా తెలంగాణ ఎటువోతున్నదో చెప్పేందుకు ఎంచుకున్న చిన్న కార్యక్రమం ఇంటర్ బోర్దు వద్ద ధర్నా.
అయితే, ధర్నా చిన్నదయినా ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధం చాలా తీవ్రంగా ఉంది. ఇందులో భాగమే ప్రొఫెసర్ కోదండ రామ్ గృహనిర్బంధం. ఈ 23 మరణాలు ప్రతిపక్షాలను  ఏకం చేసేంత శక్తి వంతమయినవని   ప్రభుత్వం బెదిరిపోతున్నదా?
ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం పిలుపు మేరకు ఈ రోజు ఇంటర్ బోర్డు ముట్టడి కార్యక్రమం ఉండింది. అయితే, ఈ కార్యక్రమం కొనసాగకుండా నేతలందరిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అలా మరొక వైపు ఏబీవీపీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనితో పలు చోట్ల అఖిలపక్ష నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. వారి కదలికల మీద ఆంక్షలు విధించారు. పలు చోట్ల కార్యకర్తల అరెస్టు చేశారు. బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహారదీక్షచేపట్టారు. పోలీసుల తీరు మీద ప్రొఫెసర్ కోదండరామ్ ఏమంటున్నారో చూడండి
<
పలువురు నేతల అరెస్టు సమాచారం అందుతూ ఉంది. తెలుగుదేశం నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఇంటర్ బోర్డకు వెళ్లకుండా నివారించేందుకు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్‌ మాజీ ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు సీపీఐ, టీజేఎస్‌, కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేశారు. ముందస్తు అరెస్ట్‌లను టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌మార్ రెడ్డి , మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఖండించారు.
ఇంటర్ బోర్డ్ ముందు  ఉద్రిక్తత కొనసాగుతూఉంది.  యాదవ హక్కుల పోరాట సమితి అక్కడ ఆందోళనకు దిగింది. పోలీసులు వారిమీద విరుచుకుపడ్డారు. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు.
మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తెలంగాణలో రాజకీయ కార్యక్రమం మెుదలుపెట్టింది.  పార్టీ కార్యకర్తలు  ఇంటర్ బోర్డ్ ను ముట్టడించారు. పోలీసులకు , జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల హౌస్ అరెస్టు
టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యని కూడా ఇంటర్ బోర్డు వద్ద పోకుండా నివారించారు. ఆయనను కూాడా గృహనిర్బంధంలో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here