ప్రభుదేవా సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్కురీ’టీజర్ ఇదిగో…

A Silent Movie is Coming to Tell You a Great Story

డాన్సింగ్‌ స్టార్ ప్రభుదేవా హీరోగా నిర్మాణమయిన తాజా చిత్రం ‘మెర్క్యూరి’ టీజర్‌ విడుదలయింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా లాంచ్‌ చేసిన ఈ టీజర్‌కు సోషల్‌ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేని మూకీ ధ్రిల్లర్ మూవీ ఇది. ఈ సైలెంట్‌ థ్రిల్లర్‌ కావడం వల్ల ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రగిలించింది. గతంలో ఎపుడో కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్‌ పుష్పక విమానం తీసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత మరొక సైలెంట్ మూవీ రావడం ఇదే.
అంటే ‘మెర్క్యూరి’ లో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే మూవీ నడుస్తుంది. ‘పిజ్జా’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు ఈ మూవీకి దర్శకుడు. ఇది ఇపుడు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. మూకీ కావడంతో సంతోష్‌ నారాయణ్ సంగీతం చాలా కీలక పాత్ర పోషిస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు మెర్క్యూరి ఈ ఏప్రిల్‌ 13న విడుదలకు సిద్ధమవుతూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *