కత్తి మహేష్ హైదరాబాద్ బహిష్కరణ

ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్,  హేతువాది రామాయణం మీద  వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయిన  కత్తి మహేష్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. ఇది ఆరునెలల పాటు అమలులో ఉంటుంది. ఆయనను చిత్తూరు జిల్లాకు పంపిస్తారు.  పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు.  హైదరాబాద్ లో  కనిపిస్తే మూడేండ్ల జైలు శిక్ష ఉంటుంది. రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఈ విషయం ప్రకటించారు. బావ వ్యక్తీకరణ పదే పదే టివిచానెల్ ను వేదిక తీసుకుని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇది మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది. ఇది ప్రశాంతంగా ఉన్న  హైదరాబాద్ లో శాంతి భద్రతలను దెబ్బ తీస్తుందని డిజిపి అన్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగాకత్తి మహేశ్ ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

బావ వ్యక్తీకరణ మీద ఒక వ్యక్తిని ఇలా నగరం నుంచి లేదా రాష్ట్రం నుంచి బహిష్కరించడం ఇటీవల ఇదేప్రథమం.

ఇలాంటి వ్యక్తులను సమర్థించినా వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహేశ్ ను ప్రోత్సహించిన టివి 9 తోపాటు పత్రికలను, సోషల్ మీడియాను కూడా ఆయన  ఈ సందర్భంగా హెచ్చరించారు.

కత్తి మహేశ్ వ్యాఖ్యలను ప్రసారం చేసిన టివికి కూడా  షో కాజ్ నోటీసు ఇచ్చామని, వారి దగ్గిర నుంచి  సంజాయిషీ వచ్చాక చర్య గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

కత్తి మహేష్ స్వతంత్ర భావాలున్న మేధావి. స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తీకరిస్తూ కత్తి మహేష్ ఈ మధ్య వార్తల్లో కెక్కాడు. ఆయన ధోరణి నచ్చని వాళ్లు ఆయన మీద కత్తికడుతున్నారు. తాజాగా రామాయణం, రాముడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సంస్థల వాళ్లకు ఆగ్రహం తెప్పించాయి. దాని పర్యవసానామే ఇదంతా.

ఇది ఇలా ఉంటే మహేష్ వ్యాఖ్యల మీద కొన్ని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తువస్తున్నాయి.  ఆయన పలుపోలీసు స్టేషన్ లలో కేసులు కూడా నమోదయ్యాయి,  పరిపూర్ణానంద స్వామి ఏకంగా ధర్మాగ్హ హ యాత్ర జరపాలనుకున్నారు.

అయితే, పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన హౌస్ అరెస్టు చేశారు. దీనితో స్వామి పరిపూర్ణానంద ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బంజరంగదళ్ , విశ్వ హిందు పరిషత్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కి కార్యకర్తలు కి మధ్య తోపులాట జరిగింది.  ఇంటి చుట్టు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రాష్ట్రంల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉండటంతో   ఈచర్యలు తీసుకోవలసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *