పవన్ సలహాదారు దేవ్ ఎవరో కాదు, పక్కా లోకల్ చింతలబస్తీ చిన్నోడే…

జనసేన నేత పవన్ కల్యాణ్ గొప్ప మ్యాజిక్ చేశాడనుకున్నారు. ఎవరికి అంతుపట్టని రీతిలో ఎక్కడి నుంచో ఒక మహామేధావిని ఉన్నట్లుండి సృష్టించి , వారే మా వ్యూహకర్త (స్ట్రాటజిస్టు) అని చెప్పే సరికి అంత ఆశ్చర్య పోయారు. వైసిపినేత జగన్ ను ప్రశాంత కిశోర్ అనే ఎన్నికల నిపుణుడు నడిపిస్తున్నాడని అందరు చెప్పుకుంటుంటారు. ఈ మధ్య జగన్ వూపు పెరిగింది. దానితో పవన్ కూడా ఒక సలహా దారును పెట్టుకోవాలనుకుంటున్నాడు. అంతే, ఒక వ్యవూహకర్త దొరికాడు. ఇంతవరుకు బాగానే ఉంది. అయితే, అక్కడే డ్రామా మొదలయింది. ఆయన పేరు దేవ్ అని పూర్తి చెప్పకుండా పవన్ వ్యూహకర్తని జనసైనికులకు పరిచయం చేశాడు.

దానితో ఎవరీ దేవ్ అని ఆరాతీయడం మొదలయింది. జనసైనికులంటే అమాయాకులు గాని బయట ప్రపంచంలో తెలివైన వారుంటారుగా.
దానికితోడు దేవ్ గారు జనసైనికులు ముందర బాగా నటించారు.పవర్ స్టార్ పవన్ ప్రభావమేమో. తనకు తెలుగే రాదని, తాను తెలుగువాడినే కాదని, తెలుగు నాలుగుముక్కలకంటే ఎక్కువ మాట్లాడలేనని తెగ కోసేశాడు.

పవన్ కల్యాణ్ కూడా బయటనుంచి మేధావిని తెచ్చుకున్నారని అంతా చప్పట్లు కొట్టారు. పూర్తి పేరు చెప్పకుండా దేవ్ అనే మేధావిని జనసేన స్ట్రాటజిస్టుగా నియమించడం జరిగిందని పవన్ కల్యాణ్ ప్రకటన కూడా విడుదల చేశారు.

అందులో కూడా దేవ్ గారి పూర్తి పేరు లేదు.
ఇంతకీ ఎవరీ దేవ్… అనేది ప్రశ్న. తీరా చూస్తే, దేవ్ ఎవరో కాదు, హైదరాబాద్ చింతల్ బస్తీ పోరడు. వాసుదేవే. చింతలబస్తీ పోరడు పవన్ కు సలహాదారు అయినాడంటే గ్లామరేం ఉంటుంది. ఎక్కడో అమెరికా నుంచో అథమం ఢిల్లీ నుంచో వస్తేనే గ్లామర్. అందుకని రాత్రిరాత్రి ఖైరతాబాద్ వాసుదేవ్ ని కేవలం ‘దేవ్’ గా మార్చేశారు. ఆయనను తెలుగు మర్చిపొమ్మన్నారు. పొడిపొడిగా అమెరికా వోళ్లు తెలుగు మాట్లాడినట్లు చెప్పమన్నారు. అయితే, 24 గంటల కాకముందే వాసుదేవ్ ముసుగు తొలగిపోయింది. వాసుదేవ్ చింతలబస్తీ వాడని, అతను బిజెపిలో ఉన్నాడని, బిజెపి నుంచి బయటకు కూడా రాలేదని సోషల్ మీడియా గట్టు నానా రట్టు చేసేసింది.
పవన్ సినిమా లాగే దేవ్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. జి కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి గా ఉన్నపుడు డిసెంబర్ 23, 2013 విద్యావేత్త అని చెప్పుకుని వాసుదేవ్ బిజెపిలో చేరాడు. ఆ పార్టీ తరఫున చాలా టివి డిబేట్లలో కూడా పాల్గొన్నాడు.


జనసేనలో ఎవరినడిగినాదేవ్ వివరాలు చెప్పడం లేదు. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు. పత్రికల వారికి ఫోన్ ఇవ్వకుండా ఎలా కాపాడతారు?
అందులో వాసుదేవ్ ని అవతారం మార్చి, పేరు మార్చి కాపాడాలనుకోవడం ఎమిటి?
ఎందుకంటే అతగాడు, 2014 ఎన్నికలపుడు సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని చూశాడు. అసీటు టిడిపి-బిజెపి అనుబంధంలో టిడిపికి పోయింది. దానితో ఆయన పోటీ చేయలేకపోయాడు. తర్వాత, ఎదో ఎన్నికల అధ్యయన సంస్థ నెలకొల్పానని చెప్పుకునేవాడు.
ఆయనెవరో కాదు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామో దర రాజనరసింహకు బంధువు కూడా.

పవన్ ఎలాగు బిజెపి మనిషని అంతా అనుకుంటున్నది. అయితే, ఇపుడు   ప్రశ్నంతా వాసుదేవ్ బిజెపి నుంచి డెప్యుటేషన్ మీద వచ్చాడా లేక కోవర్టా అనేదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *