పవన్ కల్యాణ్ కు మొదటి షాక్

జనసేన నేత పవన్ కల్యాణ్ కు పెద్ద ఎదురు దెబ్బతగిలింది. గిరిజనుల వ్యతిరేకత వల్ల  రేపు చేయదల్చుకున్న శ్రీకాకుళ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. మత్స్య కారులకు ఎస్ టి స్టేటస్  కావాలని, ఆ ఉద్యమానికి తాను మద్దతునిస్తానని ఫిబ్రవరి ఆరో తేదీన ఆయన ఆవేశంగా ప్రకటించారు. వాళ్ల డిమాండ్ న్యాయమైనదని ప్రకటిస్తూ తాను వాళ్ల తరఫున పోరాడతానని హైదరాబాద్ లో  ప్రకటించారు. అంతేకాదు, ఆరోజు  ఆయన అనేక మంది మత్స్య కారులను కలుసుకున్నారు.  పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణరావును కూడా కలుసుకుని తాను పోరాడతానని చెప్పారు.

పవన్ దంతా సినిమా  ఆవేశం.  సినిమాలో హీరో ఏదనుకుంటే అదవుతుంది.  అలా కాకపోతే, అడ్డొచ్చినవా ళ్లందరని ఉతికి ఆరేసి ప్రభుత్వం, పోలీసులు చేయాల్సింది కూడా తానే చేసిపారాస్తాడు. ప్రతిఫలంగా ఆయనకు హీరోయిన్ చేయందుతుంది. దీనితో ఒక పాట, డ్యాన్స్, చిందులు, హాలంతా అరుపులు కేకలు ఈలలు.

జీవితం అలా ఉండదు పవనన్నా. హీరో గా రాజకీయాల్లోకి ఎంటరయినా, సినిమా ఆవేశం పనికిరాదు. పోయిన ఎన్నికల్లో ఓట్లకొసం తెలుగుదేశం పార్టీ మత్స్యకారులను, బోయలను ఎస్ టిలో కలుపుతానని చెప్పి పబ్బం గడుపుకుంది. మత్స్యకారులను గాలికి వదిలేసింది- ఎందుకంటే, అదయ్యేది కాదు. అది కావాలంటే, ముందు గిరిజనులను ఒప్పించాలి.

అయితే, ఫ్యాన్స్ ను చూసి ఆవేశపడటం వేరు, కులసంఘాలను సమస్యలను పరిశీలించడం వేరు. ఇక్కడ విజ్ఞత కావాలి. అది లేకపోతే ఏమవుతుంది? గిరిజనుల మనోభావాలు తెలుసుకోకుండా, వాళ్లతో సంప్రదించకుండా మత్స్యకారులకు గిరిజన హోదా కోసం పోరాడతానని ప్రకటించి, శ్రీకాకుళానికి వెళ్లి విప్లవం తెద్దామనుకున్నాడు. ప్రోగ్రాం ప్రకారం ఆయన ఫిబ్రవరి 21న శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్య కారుల సంఘాల నేతలతో సమావేశమయి పోరాట కార్యక్రమం రూపొందించాల్సి ఉంది.

మత్స్యకారుల కోర్కెలో న్యాయం ఉండవచ్చు. ఆ కోర్కె నెరవేరేందుకు సినిమా హీరో ఆవేశం పనికిరాదు. హీరో డైలాగులు పనికిరావు. ఇరువర్గాలకు సమాధానం చెప్పగలగాలి. అలాకాకుండా ఒక చిన్న ఆవేశానికి లోనయి ప్రశ్నించడం ప్రకటనలు చేస్తే ఏమయింది. అవతలి పక్షం గిరిజనులు కత్తులు నూరడటం ప్రారంభించారు.

మత్స్యకారులను ఎస్ టిలో చేరిస్తే గిరిజనలు తాట వొలుస్తామంటున్నారు. ఇలా మైదాన ప్రాంతాల వాళ్లందరిని గిరిజనుల్లో చేరిస్తే తమగతేమిటి? అనేది వారి ప్రశ్న.  ఇది మన హీరోకి అర్థంకాలేదు. తానేదో మహాకార్యం చేస్తున్నట్లు ప్రకటన చేశాడు. గిరిజనలు ఆగ్రహానికి గురయ్యాడు.

గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసి, పవర్ స్టార్ కు భద్రత కల్పించేలేమని పర్యటన వాయిదా వేసుకోమన్నారు పోలీసులు. ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. ఇపుడు ఈ ఎదురు దెబ్బతగ్గిలింది. పవన్ కల్యాణ్ లాంటి వపర్ స్టార్ గిరిజనలకు భయపడి పర్యటన వాయిదా వేసుకోవడమేమిటి?

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక డబల్ గేమ్ ఆడటం కష్టం. ఇపుడాయన స్పెషల్ స్టేటస్ మీద ఆటో ఇటో తేల్చుకోవాల్సివస్తున్నది. కేంద్రం మీద జగన్ ప్రకటించిన  అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నది మరొక ప్రశ్న. ఆ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి ఎలా ముందుకు పోతుందో అర్థంకావడం లేదు. ఇలా రాజకీయాలు పవన్ ను చుట్టుముడుతున్నాయి.  ఈ రోజు విశాఖ స్వామీజీ వొకాయన పవన్ ని దాదాపు శపించారు.చిరు, పవన వల వల్ల రూలింగ్ పార్టీలకు కష్టాలొస్తాయన్నాడు. ఏమిటో ఇదంతా? జనసేన రాజకీయ యాత్ర అంతా చిక్కలు పడుతూ ఉంది. వాటిని వూడదీయడం పవన్ చేతనవుతుందా, ముఖ్య మంత్రి చంద్రబాబు సాయం తీసుకుంటారా? వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *