ఈ రోజు బిగ్ న్యూస్ నాగాయలంక

తెలుగు వారందరికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా నాగాయలంకలో ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. దీనితో అక్కడ ఒఎన్ జిసి  డ్రిల్లింగ్ కార్యక్రమంను ప్రారంభించబోతున్నది. ఈరోజు జరిగిన డ్రిల్లింగ్ ప్రారంభోత్సవానికి ఒ యన్ జి సి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర శశి శంకర్  తో పాటు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బందర్ ఎంపీ కొనకళ్ల నారాయణ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం డ్రిల్లింగ్ పనులు ప్రారంబించారు. భూమి లో కేవలం  నాలుగు కిలోమీటర్ల లోపే గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ఒ యన్ జి సి అధికారులు చెప్పారు.

ఇక్కడి సహజసంపద మీద రాష్ట్రాలక వాటా ఉన్నపుడే ఇది తెలుగువారికి శుభ వార్త అవుతుంది. ఇప్పటివరకు కేంద్రమే ఆయిల్ గ్యాస్ ను తరలించుకుపోతున్నది. ఇది రాష్ట్రానికి వాటా లేదు. ఇపుడిపుడే ఈ డిమాండ్ వస్తున్నది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి ఇంతవరకుతరలించుకుపోయిన గ్యాస్ చాలు. ఇక రాష్ట్రానికి వాటా కావాల్సిందే నని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉంది.  ప్రజలంతా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాలి. ఫెడరల్ పాలిటిక్స్ కోరుకుంటున్న నాయకులు, పార్టీలన్నీ కూడా అయిల్ గ్యాస్ నిక్షేపాలు బయటపడినపుడు రాష్ట్రాలకు వాటా వుండాలని చెప్పాలి. అపుడే ఈ అమూల్య సంపద వల్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే, రాష్ట్రానికి నిర్వాసితులు, కేంద్రానికి లాభాలు లాగా వ్యవహారం మారిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *