ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం (గ్యాలరీ)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటసార్వభౌముడు,తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా తీస్తున్న బయోపిక్‌ షూటింగ్ మొదలయింది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణం గురువారం ఉదయం రామకృష్ణ హర్టీ కల్చరల్‌ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు ఎందరో ఈ కార్యక్రమానికి వచ్చారు. దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వివి వినాయక్‌, పూరి జగన్నాథ్‌ లతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్‌ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగుదేశం ఆవిర్భవించిన మార్చి 29 వ రోజును షూటింగ్ కోసం ఎంపిక చేశారు.

దానవీర శూర కర్ణ సినిమాలోని దుర్యోధనుడి ప్రశ్న ‘రాచరికమా అర్హతలు నిర్ణయించునది’ అనే డైలాగ్‌లను తొలి షాట్‌గా చిత్రీకరించారు. వెంకయ్య నాయుడు క్లాప్‌ కొట్టారు ముహూర్తం ప్రకారం 9 గంటల 42 నిమిషాలకు తొలి షాట్‌ చిత్రీకరణ జరిగింది. బాలకృష్ణ ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మాణమవుతూ ఉంది. సాయి కొర్రపాటి, విష్ణువర్థన్‌ ఇందూరిలు సహనిర్మాతలుగా ఉంటే, కీరవాణి సంగీతమందిస్తున్నారు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి. దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *