చంద్రబాబు హడావిడి ఎందుకంటే…

బిజెపి వ్యతిరేక ఫ్రంటు అంటూ  కాలు గాలిన పిల్లిలా చంద్రబాబు అటుఇటు తిరుతున్నాడని, ఆయన ఆటలు ముందుకు సాగవని వైసిపి అధికారప్రతినిధి అంబటి రాంబాబు ఘూటుగా వ్యాఖ్యానించారు.

‘చంద్రబాబూ మీ ఢిల్లీ హడావిడి అంతా వృధా ప్రయాస.మీకు బలం ఉంటే ఆ నేతలందరూ మీ దగ్గరకే వస్తారు. మీరు కాలుగాలిన పిల్లిలా తిరుగాల్సిన అవసరం లేదు,’ అని ఈ  రోజు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

పోలింగ్ తర్వాత బాబు చిత్రవిచిత్రంగా ప్రవరిస్తున్నాడని, నూటికి వెయ్యి శాతం గెలుస్తానని  అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో  చెప్పాలని రాంబాబు అన్నారు.

వివిప్యాట్ ,అధికారులు,ఈవిఎంలు ఇలా ప్రతీ అంశంపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నాడని చెబుతూ

వివి ప్యాట్ పిటిషన్ ని  న్యూసెన్స్ పిటీషన్ అని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని చంద్రబాబు అపుడే మర్చిపోయారని అయన అన్నారు. ఎన్నికల నిర్వహణ మీద మాజీ రాష్ట్ర పతి  ప్రణబ్ ముఖర్జీ ‘మంచి కార్మికుడు నెపాన్ని పనిముట్లపైకి నెట్టడు’ అనిచేసిన వ్యాఖ్యని చంద్రబాబు గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు సలహా ఇచ్చారు.

రాంబాబు ఇంకా ఏమన్నారంటే…

– చంద్రబాబు కి ఏ వ్యవస్థపై నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మారలేదు

-ఇంటిలిజెన్స్ ఛీఫ్ బదిలీపై కూడా నానా రాధ్దాంతం చేశారు.

– చంద్రబాబు గెలిచే అవకాశం లేదని వ్యవస్థలని బ్రష్టుపట్టిస్తున్నారు.  రేపు ఫలితాలు కూడా నమ్మరు.

– ఈవీఎం లు గతంలో లేవా, నువ్వు గెలిచినప్పుడు ఇవే ఈవీఎం లే కదా. ఓటమి అంగీకరించలేక ఈవీఎం లపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

-కౌంటింగ్ కేంద్రాలవద్ద అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు.

– కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తే ఎన్నికల సంఘం వెంటనే అణిచివేయాలి

– చంద్రబాబు పిచ్చి భ్రమల్లో ఉన్నారు, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం నీ పిలుపు వల్ల కాదు

– మంత్రి దేవినేని ఉమ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.ఎగ్జిట్ పోల్స్ చూస్తూనే భయపడుతున్నారు. ఇక వాస్తవ ఫలితాలు చూస్తే ఏమైపోతారు.

– బుద్దా వెంకన్నా.. తొడ కొడితే నీ తొడ వాస్తుంది.ఇది బాలకృష్ణ దగ్గర నేర్చుకున్నట్లు ఉంది. ప్రజాస్వామ్యంలో తొడగొట్టడం కూడదు.

– టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు, కక్కిస్తాం జాగ్రర్త

– 23న మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు.మీ బండారం బయటపడిపోతుంది.మా గొప్పతనం కూడా తెలిస్తుంది.

-అన్ని ఉన్న ఆకుల్లా మేం మౌనంగానే ఉంటాం.చంద్రబాబు ఏమిలేని ఆకులా ఎగిరెగిరిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *