Home Breaking ముర‌ళీమోహ‌న్‌కి చంద్ర‌బాబు, లోకేశ్ ప‌రామ‌ర్శ‌

ముర‌ళీమోహ‌న్‌కి చంద్ర‌బాబు, లోకేశ్ ప‌రామ‌ర్శ‌

142
0

వెన్నెముక‌కు సంబంధించిన శ‌స్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాజమండ్రి మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌ని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, టీడీపీ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్  ఈ రోజు ప‌రామ‌ర్శించారు.

సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ముర‌ళీమోహ‌న్ నివాసానికి వెళ్లి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కేర్ హాస్పిట‌ల్ వైద్యులు స‌ర్జ‌రీ విష‌యంలో చాలా కేర్ తీసుకున్నార‌ని ముర‌ళీమోహ‌న్ వారికి వివ‌రించారు.

రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ని తెలిపారు.

వైద్యులు సూచ‌న‌లు పాటించాల‌ని, పూర్తిగా న‌య‌మ‌య్యేవ‌ర‌కూ విశ్రాంతి తీసుకోవాల‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here