నాగ‌శౌర్య నూత‌న చిత్రం ప్రారంభం!

 రాజా కొలుసు ద‌ర్శ‌క‌త్వంలో
 
విభిన్నమైన  చిత్రాల‌ను నిర్మించే సంస్థ‌గా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భ‌వ్య క్రియేష‌న్స్ కు మంచి పేరు ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `పైసా వ‌సూల్‌` త‌ర్వాత ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. `ఛ‌లో` సినిమాతో గ్రాండ్ స‌క్సెస్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌తో ఈ  చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. కొత్త ద‌ర్శ‌కుడు రాజా కొలుసును ప‌రిచ‌యం చేస్తూ భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై  వి.ఆనంద ప్ర‌సాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్ర‌మిది.
sdr
హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం ఉద‌యం లాంఛ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఆనంద‌ప్ర‌సాద్ స‌తీమ‌ణి కృష్ణ కుమారి, హీరో నాగ‌శౌర్య త‌ల్లి దండ్రులు ఉషా బాల‌, శంక‌ర‌ప్ర‌సాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా:  సాయి శ్రీరామ్‌,  సంగీతం:  మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌,  ఆర్ట్:  వివేక్‌,  ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  రాజా కొలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *