ఎంపి కవిత జాగృతి మనుషులట, ఆసుపత్రిలో ఎగబడి కొట్టిర్రు (వీడియో)

హైదరాబాద్ లోని ఒక తెలంగాణ జాగృతి నేత రెచ్చిపోయిండు. ఉప్పల్ లో ఒక ఆసుపత్రిలోకి చొరబడి ఒక వ్యక్తిని చితకబాదిండు. ఆ జాగృతి నేత కొట్టిన  వీడియోలు సిసి టివిల్లో రికార్డయ్యాయి.

వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ లో భరత్ నగర్ లో స్థల వివాదంలో ఈగ అంజయ్య, పిల్లి నాగరాజు మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. ఈ గొడవలో గాయపడిన పిల్లి నాగరాజు వర్గం వారు ఆసుపత్రిలో చేరారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి ఉప్పల్ కన్వీనర్ సంతోష్ ఆసుపత్రికి ఆగ మేఘాలమీద వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును, ఆయన మనుషులను చితకబాదిండు. పోలీసుల ముందే సంతోష్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయి నాగరాజు బృందాన్ని కొట్టారు.

ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *