Home Breaking వర్ల రామయ్యా, ఎంతపనిచేశావయ్యా, క్షమాపణ చెప్పు

వర్ల రామయ్యా, ఎంతపనిచేశావయ్యా, క్షమాపణ చెప్పు

266
0

విజయవాడ: ఎపిఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్యను కులవివాదం వదలడం లేదు.మొన్నామధ్య బస్సులనుహడావిడిగా తనిఖీ చేసేందుకు వెళ్లి, ఉత్సాహంలో మితిమీరి,పెద్దరికం బాగా మీదేసుకుని, ఒక ఎస్ సికుర్రవాడిని కులం పేరుతో దూషించాడు.  అది ఇపుడు రాజుకుంది. తన కుమారుడిని హీనంగా తిట్టిన వర్ల రామయ్య పబ్లీక్ గా క్షమాపణలు చెప్పాల్సిందేనని పిల్లవాడి తండ్రి రజనీ డిమాండ్ చేస్తూ ఉంది.

వర్ల అసభ్యంగా తన కుమారుడిని తిట్టడం పట్ల ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నది.

‘‘నా కుమారుడు బాగా చదువుతాడు.. అనేక మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ వచ్చాయి.అవేమీ తెలుసుకోకుండా వర్ల రామయ్య నా బిడ్డను అందరిలో ఇష్టారాజ్యంగా తిట్టాడు.ఆ వీడియోలన్నీ మీడియా, సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి…మా పరువు పోయింది,’’ అని ఆమె వాపోతున్నది.

‘‘మూడు రోజుల నుంచి నా బిడ్డ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు…అన్నం తినటం లేదు.కులం పేరుతో తిట్టి మా జాతిని అవమాన పరిచారు…మా కులం నుంచి విదేశాలకు వెళ్లారు, డాక్టర్లు అయ్యారు,’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ ‘‘వర్ల మాకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కరాఖండిగా చెబుతూన్నది.

అసలు కథ ఇది

టిడిపి వర్ల రామయ్య నోటి దురద ఎలా ఉందో చూడండి (వీడియో)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here